Monday, June 22, 2015
ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం
Friday, June 19, 2015
మెట్రో వస్తే మనకి ఈ సమస్యలేమీ ఉండయి
వికలాంగుల భోగీ
నా ఎదురుగా ఓ పెద్దాయన. బాగా మాసి పోయిన ప్యాంటు, చొక్కా. ఆ పోలీసోడు టికెట్టు చూపించమన్నాడు. చాలా విసురుగా, కోపంగా చూపించాడు. పోలీసు శాంతించాడు. నాకెందుకో అతని సమాధానం, అతని బాడీ లాంగ్వేజ్ లో ఏదో విశిష్టత కనబడుతుంది. నెమ్మదిగా అతను చిరాకు నుండి నార్మల్ మొహం లోకి మారుతున్నాడు. ఇంతలో ఎవరి గోల వారిది. ఏవండీ మనకు గోదావరి అందుతుందా? నేను ఖమ్మం వెళ్ళాలి. ఇంకో ఆయన ఫోన్ లో ఎవరికో చెబుతున్నాడు, వరంగల్ పాసింజర్ నాంపల్లిలో బయలుదేరిందట, నేను సికందరాబాదులో క్యాచ్ చేస్తాను. అతను అందరితోనూ మాట కలపడం ప్రారంభించాడు. చాలా హుషారుగా, తెలుగు రాష్ట్రాలలో ప్రతీ ప్రాంతం తనకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మండుతున్న ఎండలు గురించి సంభాషణ జరుగుతుంది. ఏ ప్రాంతంలో ఎంత ఉష్ణోగ్రత ఉన్నదో చెబుతున్నాడు, రాజకీయం మాట్లాడుతున్నాడు. వార్తా పత్రికలన్నీ బాగా చదువుతాడనిపించిండి. నేను చాలా ఆశక్తిగా, అతని చూస్తూ, వింటూ ఉన్నాను. ట్రైను జేమ్స్ స్ట్రీట్ దగ్గర ఆగింది. టాపిక్ ట్రాఫిక్ మీదకు మళ్ళింది. రోడ్డు, రైలు అన్నీ ఈ ట్రాఫిక్ జామ్ లోనే అక్కడ సారాంశం. ఇంతలో అతను అన్నాడు "మెట్రో వస్తే మనకి ఈ సమస్యలేమీ ఉండయి". నాకు అర్ధం కాలేదు. ఎలా అని అడిగాను. అతనే చెప్పాడు "మెట్రో కి ట్రాఫిక్ జామ్ ఉండదు కదా. పోవుడు, వచ్చుడు. అంతే. జమ్మున పోతాం". నాకు నవ్వాగలేదు. సూపర్ చెప్పినవ్ భయ్యా అని సికందరాబాదులో దిగిపోయాను.
సత్ర్పవర్థనకి మందెయ్యండి బాబూ
Thursday, April 3, 2014
ప్లీజ్ అబద్దం చెప్పండి, మీ కాగితం నాకు దొరికింది.
Monday, December 19, 2011
జీవిత కాల అభ్యసనం
1. ఐదో తరగతిలో ’మన దేహం’ పాఠం చెబుతూ పాల్ విశ్వాసం మాశ్టారు ముఖాన్ని చల్లటి నీటితో కడగితే ఆరోగ్యం అని చెప్పి, అందుకే నేను వేడినీళ్ల స్నానంలోనూ ముఖాన్ని మాత్రం చల్లనీళ్లతోనే కడుగుతాను అని చెప్పారు. ఆరోజునుండి, ముఖం కడిగినప్పుడల్లా మాష్టారు మాట్లాడుతూనే ఉంటారు.
2. సాంప్రదాయ సమాజంలో ఆధునిక ఆలోచనలతో జీవించడానిక్ తమపై పరిపూర్ణ అవగాహన కావాలి, ధైర్యం కావాలి. ఈ రెండు కలబోసి డోలాయమానంలో ఉన్న ప్రతీసారీ ముందుకు నెట్టడానికి ఎప్పుడూ సిద్దంగా (ఆలోచనలలో) ఉంటారు మా విజయలక్ష్మి (Geography)మేడం .
౩. స్కూలో అసెంబ్లీ జరిగేటపుడు, వార్తలు చదివే సంస్కృతి ఉంది. ఎప్పుడూ తెలుగు వార్తలు చదివే నేను ఇంగ్లీషులో చదవాలనుకున్నాను. అప్పుడు ఇంగ్లీషు తిరుపతిరావు సార్, నువు తెలుగులో దిట్టవే కానీ ఇంగ్లీషులో కాదు అన్నారు. ఎప్పుడు పబ్లిక్ లో మాట్లాడాలనుకున్నా, ఆయన గుర్తురాకుండా ఆ ఉపన్యాసం సాగదు.
4. నాలో ఏమి ఉండేదో నాకు తెలియదు, నాలో ఏమి పోయిందో కూడా తెలియదు. కానీ ఇద్దరు మిత్రులు (కె.కె, శరీన్) నువ్వు నువ్వులా లేవురా. something is missing. అన్నారు (1995 లో) నా ఎంక్వరీ ప్రక్రియని అలా మొదలు పెట్టి వదిలేసారు వాళ్ళు. అది ఆగమన్నా ఆగడం లేదు.
Saturday, June 4, 2011
’ప్రైవేట్’ మాయ
సమయం: రాత్రి ఎనిమిదిన్నర
ఎక్కు స్థలము: టొయోటా, కొండాపూర్
---------------------------------
బాబూ కండక్టర్ నా సీటేదీ అని అడిగితే, ఆ వెనుక సీట్ చూపించి, అక్కడ కూర్చోండి సర్, అది విండో సీట్ అన్నాడు. సో ఇక్కడ మనవాడు బెనిపిట్ చేశాడన్నమాట. సరేలే అని కూర్చున్నాను. ఓ పది నిమిషాలు నన్ను ఎంజాయ్ చేయనిచ్చి, 'సార మీరిప్పుడు G4 వెళ్ళాలి అన్నాడు. అదేమిటి నన్ను అంత వెనుకకు పంపుతున్నావు అన్నాను. అది విండో సీట్ సర్. బావుంటుంది అన్నాడు. నాకు విండో సీట్ మీద అంత ఇష్టం లేదు లే. వెనుకకు లేకుండా వుండాలి అంతే అన్నాను. మీకెందుకు సర్. ఈ మధ్యలో నేను వేరే చోట చూస్తాను కదా అన్నాడు. 'చూడ లేకపోతే' అని నేను రెట్టిస్తే 'నేనేమి చేయగలను సర్, ఆన్ లైన్ లో మీ టికెట్ ఎలా వుంటే అలా ఇస్తాం అన్నాడు. ప్రశాంతంగా ఉన్న నా మనసులోకి వాడు ఒక కొత్త ప్రశ్న ను లేవనెత్తాడు. టికెట్ బుక్ చేసినవాడు C2 అని చెప్పాడు, వీడు ఎక్కించుకొనేటపుడు C2 కదా అని అడిగాడు, ఇప్పులేలా తేడా పడిందబ్బా అని అనుకొని అదే విషయం వాడినే అడిగాను. ట్రావెల్స్ వాళ్ళు అంతే సర్. మాట సరిగ్గా వినరు, వాళ్లకి కమీషన్ ముఖ్యం అంతే మా వాళ్ళేదో చెబుతారు. వాళ్ళేదో రాస్తారు. మేమేమి చేయగలం అంటూ ప్రశాంతంగా నవ్వుతున్నాడు. వాడి మాటల్లో తీయదనం, వాడి చిరునవ్వు. 'వీడు ఏమీ చేయలేదులే' అనుకొని వెనుక seat కి వెల్లిపోయాను. చాలా సార్లు నాకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈసారి దానిని జీర్నించుకో లేక పోతున్నాను. నా ఆలోచనకు తోడుగా మధ్య మధ్యలో స్పేడ్ బ్రేకర్లు నన్ను కుదుపు తున్నాయి.
వెంటనే నేను బుక్ చేసిన travels కి ఫోన్ చేసి విషయం చెప్పాను. అలా ఎందుకు చేస్తాం సర్. రోజుకు ఎన్ని సార్లు బుక్ చేస్తాం. ఆ కండక్టర్ తో ఫోన్ చేయించండి, నేను మాట్లాడతాను అన్నాడు. అయితే ఈ రోజు నా అసహనం మామూలు గా తగ్గేట్టు లేదు. ఇంతలో అరికాల్లోకి జారిపోయిన నా బ్రెయిన్ మోకాలులోకి వచ్చింది. వీడు ఇంత సేపు ఆన్ లైన్ చార్ట్ అంటున్నాడు కదా. అది చూస్తే బావుంటుంది కదా అనుకొని వెనుక సీట్ లో వున్న నేను, కేబిన్ లో ఉన్న కండక్టర్ కి ఫోన్ చేసి, చార్ట్ తీసుకు రమ్మన్నాను. అవతలి వారి గొంతు మారింది. మీకు ఎల్.బి నగర్ లో సీటు మారుస్తా సర్. అన్నాడు. మారుద్దుగానీలే ముందు చార్ట్ తీసుకొని రా అన్నాను. చార్ట్ లేకుండా వచ్చి, సర్ కొంచెం ఓపిక పట్టండి, మీ సీట్ మార్చేస్తా అన్నాడు. అది ఓ.కే. నేను చార్ట్ చూడాలి అన్నాను. "చార్ట్ మా పర్సనల్ సర్. ఎవ్వరికి ఇవ్వం" అన్నాడు. మోకాలులో ఉన్న బ్రెయిన్ కడుపులోకి వచ్చింది. వెంటనే నేను టికెట్ బుక్ చేసిన వాడికి ఫోన్ చేసి, మాట్లాడు అంటూ కండక్టర్ కి ఇచ్చాను. అప్పుడే తగిలింది షాక్.
" అన్నా నేను సాయి. హెడ్ ఆఫీసు లో ఈ సీట్ అరేంజ్ చేయమన్నారు. ఇప్పుడు మార్చేస్తున్నాను" అన్నాడు. ఇంక నేను మాట్లాడడానికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. 'మీ సేట్ మార్చేస్తాడు సార్ అంటూ మా వాడు ఫోన్ పెట్టేసాడు. బస్సులో నా సీట్ మార్చేసాడు. ఆ తరువాత ఆ యంగ్ కుర్రాడు నన్ను చూసి నవ్వలేదు.
Monday, May 30, 2011
నాకు కులం నచ్చదు... మీ కులమేంటో చెబుతారా?
అదో style. అదొక methodology. ఏ మాయ కబుర్లైనా చెప్పి, మనతో మన చేసే వాడి కులం తెలియాలి. అలా తెలియకపోతే బహుశ తిన్నది అరగదేమో? రాత్రి నిద్ర పట్టదేమో? ఒళ్ళంతా ఏదో కనిపించని పురుగు పాకినట్టవుతుందేమో. ఏమో... ఏమో... ఏమవుతుందో నాకు తెలియదు. కానీ ఇలా చాలా సార్లు జరిగింది. ప్రతీ సారీ నాకు పరీక్షే. చివరికి నా కులాన్ని చెప్పినపుడే నేను pass. నేను answer ఇచ్చే వరకూ question రకరకాలుగా మారుతూ ఉంటుంది.
“నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే, ఇంకెవ్వరినీ వేలెత్తి చూపించవు” అని చాలా సార్లు చదివాం. అది ఎవరైనా పాటిస్తారో లేదో నాకు తెలియదు కానీ, ఎదుటి వాని కులం తెలుసుకోవాలని అనిపించినపుడు మాత్రం “మా ---- కులం లో ఇలా ఉంటుంది సర్”. ఆ సందర్భం ఎక్కడినుండి వచ్చిందో, ఎందుకు వచ్చిందో నాకు అర్ధం కాదు. కానీ అకస్మాత్తుగా వచ్చేస్తుంది. ఒక సునామీ వచ్చినట్టు, ఒక ప్రమాదం జరిగినట్టు. ఈ ఆట ఆడడం నా వల్ల కావడం లేదు. నేను కూడా నా పేరు చివర నా కులాన్ని తగిలించేసుకుంటాను. నా శరీరం రంగుని, నా మాటలని, నా దుస్తులని, నేను వాడే వస్తువులని కొన్ని వందల సార్లు scanning చేసి, litmus test లో clear cut results రాక, వాళ్ల అనుమానం, నిజమో కాదో తెలియక, వారు సతమతమవుతూ, నన్ను ఇబ్బంది పెట్టే methodology కి good bye చెప్పేయ్యాలి. ఈ బాధంతా ఎందుకో తెలుసా?
Graduation Spot Valuation కి వెళ్ళాను. కొత్త. అలా.. అలా చూసుకుంటూ ఓ ఖాళీ చోటు చూసుకొని కూర్చున్నాను. పక్కాయనతో పరిచయం. ఆయన ఏ భేషజాలు లేని వ్యక్తి. నాకేదైనా సాయం చేయాలంటే దబ్బున ముందుకొస్తాడు. ఒక్క రోజులోనే ఒక deal కి వచ్చేసాం. ప్రతీ రోజూ ఇద్దరం ఇలాగే కూర్చుందాం అని. ఇద్దరూ దాదాపు ఒకే ఏరియాకి చెందడం వల్ల కలసి ఒకే బైక్ (నాది) వెళ్లడానికి ఒప్పందం కుదిరింది.
Step: 1
సార్ మీకు ---- university లో ---- professor. ------ Reddy తెలుసా అన్నాడు. [సుమరు 30 ఏళ్ళ క్రిందటి కధ]. ఆయన నన్ను చూసి నువ్వు SC వా అని అడిగాడు. నేను అవును అన్నాను, నిజానికి నేను SC కాదు. అయినా SC అయితే తప్పేంటి.
అకస్మాత్తుగా ఈ topic ఏమిటబ్బా? అనికుని, అబ్బో ఏమి ఆదర్శం అనుకున్నాను.
SC వాడికి నీ ---- పేరు ఎందుకురా. ఏ మల్లయ్యో, ఎల్లయ్యో పెట్టుకోవచ్చుకదా అన్నాడు. ఏమో సార్. మా అమ్మా, నాన్నా ఇలా పెట్టారు అన్నాను.
అలా నిజంగా జరిగి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అయితే ఈ topic ఎందుకు నడిపిస్తున్నాడో అర్ధం కాలేదు. అయితే నేను శ్రోతగా ఉన్నాను.
“మీ కమ్మోళ్ళింతేరా” అని అనేవాడు. నాకు మార్కులు చాలా తక్కువ వేసాడు. నన్ను personal గా కలిస్తే మార్కులు పెంచుతానన్నాడు. కానీ నేనే వెళ్లలేదు.
కమ్మ, రెడ్డి conflict గురించేమైనా మాట్లాడతాడేమో అనుకున్నాను. కానీ దానిమీద చర్చ నడువలేదు. మధ్యలో నాకో అనుమానం వచ్చించి. గురువుగారేమైనా నా కులం తెలుసుకోవడానికి ఈ story లన్నీ చెబుతున్నాడా అని. కందకు లేని దురద కత్తిపీటకెందుకని మౌనంగానే ఉన్నాను.
Step: 2
అది మేము కలసి ప్రయాణం చేస్తున్న రెండో రోజు.
సార్ ఇలా అడుగుతున్నానని ఏమో అనుకోవద్దు. [నాకు విశయం అర్ధమవుతుంది] Generala గా నేను ఇటువంటి వాటికి వ్యతిరేకిని. కానీ ఇండియాలో తప్పదు. పెళ్ళి సంబంధాలకోసం అడుగుతున్నాను. మీ కులం ఏమిటి?
పరిచయమయిన మూడో రోజున, నేను సహాయం అడుగకుండానే, నాకు పెళ్ళి సంబంధం చూడాలని ఆయనకి అనిపించింది. చాలా గొప్ప మనసు.
అయితే అప్పటికీ ఆయన అంతరార్ధాన్ని అర్ధం చేసుకొని కేవలం సరైన ప్రశ్న కోసం ఎదుర చూస్తున్న నేను చిన్న చిరునవ్వు నవ్వి “నేను మాదిగ” అన్నాను.
ఓహ్. మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సర్. ఆయన సంబరాన్ని వ్యక్తం చేసాడు. కాకపోతే నేనే ఇంకా పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనలో లేను.
ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ప్రతీ సారీ అదే ఆట. కేవలం మనుషులు మారతారు. Repeat. Repeat. Repeat.
అందుకే నా పేరు “సురేష్ కుమార్ మాదిగ”.
ఇప్పుడు నా ఆట మొదలు. జనాల ఆట కట్టు
Sunday, April 24, 2011
గుంటూరోల్లూ సూపర్
Thursday, March 31, 2011
మా గోదారోల్లు సూపరు
బండి తిన్నగా ఎక్కించి, సైడు స్టాండు వేసి, దానిపై గిర్రున తిప్పి, నేను నిలబడ్డ లైనులోకి సమానంగా వచ్చాడు. పవన్ కళ్యాన్ సినిమా చూసినట్టనిపించింది.
సన్నగా నా పెదాలపై చిరునవ్వుతో, నా మనసు అంది 'మా గోదారోల్లు సూపరు'
Thursday, July 9, 2009
ఖమ్మం కవులతో నా అనుబంధం
2. ఈసారి కలసినపుడు తనతో గద్దపాటి శ్రీనివాస్ ని తీసుకువచ్చాడు. మా 'ఖమ్మం' కవి అంటూ పరిచయం చేసాడు. నువ్వు మా ఖమ్మం రావలయ్యా, అప్పుడే కదా మావాళ్ళు గురించి తెలిసేది అంటూ చాలా సార్లు ఆహ్వానించేవాడు. ఖమ్మం కవులు, రచయితల ఆధ్వ్యర్యంలో జరిగే ప్రతీ పనిని కళ్ళకు కట్టినట్టుగా వివరించేవాడు. అదే ఇప్పుడు నన్ను ఖమ్మం కవుల 'స్వేచ్చ కోసం' కు స్పందన రాయడానికి కారణం.
3. ఐనాల సైదులు, గద్దపాటి శ్రీనివాస్ సంపాదకత్వంలో వచ్చిన శ్రీ శ్రీ స్మారక కవితా సంకలనం "స్వేచ్చ కోసం" భావుకులందరికీ ఎంతో స్వేచ్చనిచ్చింది. కవిత్వానికున్న ప్రామాణికత ముసుగును తొలగించి మనసుపొరల్లో అల్లుకున్న ఏ భావాల తోరణమైనా కవితే అని చాటి చెప్పింది. రూపం మార్చిన కుల భూతాన్ని, కువ్వలలై ఎగిరెల్లిన మాదిగ మనసుని, శ్రీ శ్రీ సరళ సామ్రాజ్యాన్ని, బానిస చేసిన డాలర్ వర్షాన్ని, భరతమాత అరవై వసంతాల సిగ్గుని, ఎందుకో కొరగాని వినతి పత్రాల్ని వివరంగా చూపించింది.
ఈ ప్రజా రచయితల సమాఖ్య, అపనమ్మకాల అమ్మను నమ్మనంది, మండే ఆకలి బాధను ఎవరు తీసుస్తారంది, పురుగు మందుల పిరికితనానికి ధైర్యాన్నిచ్చింది, స్త్రీ మూర్థి తనపై జరుగుతున్న ఆగడాలకు ఖడ్గమై రావాలంది, కుంభకోణాల ఎన్నీకలాలను తన్నుకు చావమని, నఖ శిఖ పర్యంతం శ్రీ శ్రీ ని స్పౄశించి వదిలింది.
ఆ తడిమిన అక్షరాలను త్వరలో వివరిస్తాను
Thursday, March 5, 2009
నాన్న 'లవ్’
దిగుమర్తి సూరయ్య గారి (మా తాతగారు) పెద్ద కుమారుడు దిగుమర్తి రాఘవులు గారు (మా నాన్నగారు). రాఘవులు గారు కుటుంబ భారాన్నంతా తలకెత్తుకొని నడుస్తున్న రోజులవి. ఆయన వృత్తి పరంగా వడ్డీ వ్యాపార కంపెనీలో డబ్బు వసూలుదారుడైనా, ప్రవృత్తి పరంగా బుర్రకధ కళాకారుడు. ప్రతీ రోజూ ఉద్యోగ నిమిత్తం సుమారు 30 కిలోమీటర్లు తిరిగి, సాయంత్రానికి తన బుర్రకధ స్నేహితులతో కలసి, practice చేసి రాత్రి 10 గం. ల కు ఇంటికి వచ్చేవారట. రాఘవులు గారు వచ్చేవరకూ సూరయ్య గారు, వారింటికి దగ్గరలో ఉన్న కాలువ దగ్గర, (అప్పట్లో వంతెనలు లేవు) తన వయసు స్నేహితులతో కాలక్షేపం చేస్తూ కొడుకు రాకను గమనిస్తూ ఉండేవారట. కొడుకు వస్తున్న విషయం గమనించిన వెంటనే మెల్లగా అక్కడనుండి ఇంటికి చేరుకొనే వారట. ఇది గమనించిన రాఘవులు గారు తన ఎక్కడికి వెళ్ళినా, తన తండ్రి ఎదురు చూస్తారనే ఉద్దేశ్యంతో వీలయినంత త్వరగా ఇంటికి చేరుకొనే వారట. కానీ ఎప్పుడూ వారు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చర్చించలేదు.
1990 ల మాట
రాఘవులు గారి పెద్దకుమారుడు వీరకిషోర్. ఆయన జీవిత భీమా సంస్తలో ఉద్యోగి. తన తండ్రిలాగే కుటుంబ భారాన్నిభుజాన వేసుకొని నడిచేవారు. కాలం మారింది. ఆ ఊరికి ఒక వంతెన వచ్చింది. రాఘవులు గారి ఇంటికి మోటారు వాహనం కూడా వచ్చింది. కిషోర్ గారు ఎక్కడికి వెళ్ళినా, రాఘవులు గారు నిదుర పోయే వారు కాదు. పెద్ద కొడుకు వచ్చాడన్న సంగతి తెలిసిన తరువాతే ఆయన కునుకు తీసేవారు. ఎంత రాత్రయినా కుమారుని వాహనం శబ్దం విన్న తరువాత, ఏదో పని ఉన్నట్టుగా బయటకు వచ్చి, పడుకోవడానికి వెళ్ళేవారు. ఇది గమనించిన కిషోర్ గారు, ఎంత దూరం వెళ్ళినా, తన తండ్రి నిదుర పోకుండా చూస్తారని, వీలైనంత త్వరగా ఇంటికి చేరుకొనే వారు. వీరు ఎప్పుడూ చర్చించు కోలేదు.
2010 లో కిషోర్ గారి పెద్ద కుమారుడు ప్రణయ రంజిత్ ఏమి చేస్తాడో చూడాలి.
Friday, January 9, 2009
'కీడెంచి మేలెంచు '
మనుషులంతా ఇలానే ఉంటారు అని తెలిసినపుడు, నేనూ మనిషినే కాబట్టి ఇతర మనుషులతో నేనెలా వుండాలి అని ఆలోచించుకుంటే సరిపోతుంది కదా. అలాంటి సమయంలో ఎవరైనా మనం ఆకున్నంత చెడ్డగా కాకుండా వేరేలా ఉంటే వాళ్ళే మంచోళ్ళు. ఎప్పుడూ మంచిగా వుండడం అందరికీ అన్ని సమయాల్లోనూ సాధ్యం కాదుకదా, దీనిని మనం కీగ్రంట గమనించ గలిగితే అందరూ మంచోల్లే.
ఇంకేమి చెప్పమంటారు నాలో నూతనోత్సాహం. అందరూ నాలాంటి వారే.
Wednesday, December 10, 2008
“Who is that Dog?”
To day she brought her daughter and called me interact. I am afraid. The kid may ask “Mom who is this Pig?”
Pig may be an avatar of Vishnu, dog may be a faithful pet, but I have my name. I have dignity of a living being. I smiled at her when her sister called me dog. I was really do not know what to do. I thought it was a different culture where I did not grew up. To day I know what dignity is. I know how to respect others, not only my friends but also other beings like me. I am happy because I did not grow up in the culture. I have never seen such address any where else. I am afraid; the kid may call me ‘Pig’.
పెట్రోలు దొంగతనం: మంచి అనుభవం
ఎవరో నా బండి మీద గట్టి ప్రయత్నమే చేసారు. కానీ విఫలం అయ్యారు. ఇక ఎవ్వరైనా ఆ ప్రదేశంలో స్పిరిట్ బళ్ళు పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది అంట సులభం కాదని తెలిసి పోయింది. ఆ దొంగ వున్నంత కాలం మనం నిర్భయంగా గా వుండవచ్చు. తను ఇక స్పిరిట్ జోలికి పోడు. ఇది తనకీ నాకు మంచి అనుభవమే కదా.
Friday, October 10, 2008
అసలు మనిషి

విద్య వలన వినయము, వినయము వలన జ్ఞానము వస్తాయన్న మాట ఉన్నత విద్యలో నిజం కాదేమో అని అనిపించింది. ఎందుకంటే ఆధిపత్య వర్గాన్ని, అణచివేయబడ్డ వర్గాన్ని, అణచివేయబడ్డ వారిలో ఆధిపత్యాని, ఆధిపత్యంలో అణచివేతను కళ్ళారా చూసాను. వీళ్ళ పేరు ప్రక్కన డిగ్రీలు తప్ప, బుర్రలో ఏమీ పెరగదా అన్నది నా రెండో ప్రశ్న. మనం స్పర్సించేంత దారుణమైన ఆధిపత్యం. గొంతు పగిలిపోయేంతగా అరిచే పోరాటం. ఆ రెండింటికీ ఎప్పటికీ పోటీనే. ఎప్పుడూ కలవవు, ఎక్కడా ఆగవు.
ఇక్కడికి వచ్చేవరకూ నాకేమీ తెలియదు. నేనే కాదు నాలాంటి వారు చాలామంది వున్నారు. అంటే యూనివర్సిటీ అనేది అంత ఇరుకైన సమాజమా? దానికోసమేనా మనం ఇంత దూరం వచ్చాము. బుర్ర పగిలిపోయే ప్రశ్న. దాని సమాధానమే 'అసలు మనిషీ
ఇంతవరకూ వాస్తవాన్ని చెప్పుకోని వాడు, ఒప్పుకోని వాడు ఎంతో అన్యోన్యంగా జీవించారు. నిజాన్ని చెప్పుకోవాల్సి వస్తే దూరంగా పారిపోయారే తప్ప వాస్తవాన్ని పంచుకోలేక పోయారు. అందుకే ఇంత కాలం కనిపించనివన్నీ ఇప్పుడు ఆశ్చ్చర్యంగా, వింతగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న వాడు 'అసలు మనిషీ. ఏ అరమరికలు లేని మనిషి. తను నమ్మిన సిద్దాంతాన్ని నిక్కచ్చిగా, నిర్భయంగా పాటిస్తున్న మనిషి. తర తరాలుగా వస్తున్న వంశ పరంపర్యాన్ని నిలబెట్టడానికి ముందుకొచ్చి నిలబడ్డ ఉన్నత విద్యావంతుడు.
వినడానికి ఒకింత ఇబ్బందిగా వున్నా ఇదే వాస్తవం. ముసుగులో గుద్దులాట లేకుండా నేరుగా నీతో చెబుతున్నాడు తన చెప్పలనుకున్నదేదైనా. అందుకే వాస్తవం చాలా విలువైనది. నిన్ను తీర్చి దిద్దుకోవడానికి, నీకంటూ ఒక స్తానం ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడే అవకాశం.
అంబేద్కరు చెప్పిన సమ సమాజం రావాలంటే ముందుగా ఆసలు మనిషిని తెలుకొవాలి. వాస్తవాన్ని అంగీకరించాలి. అంగీకరించిన వాస్తవం లోనుండి ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకోవాలి. కులం వాస్తవం. కుల నిర్మూలన జరగాలంటే, మన కళ్ళముందు జరిగేవన్నీ కులం చాటున జరుగుతున్నాయని తెలుసుకోవాలి. ఆ చాటు తీస్తే తప్ప కులాన్ని తీయలేము ఎందుకంటే అదే అసలు మనిషి.
Thursday, September 11, 2008
నిర్జీవమైన నవ్వు
కానీ....ఖానీఏ వ్యక్తి కోసం అందరూ ఇంత ఆత్రుత పడుతున్నామో తరు మాత్రం మాట్లాడడం లేదు. కళ్ళళ్ళో ఆనందం లేదు, ఇంతమంది కష్టాన్ని తను గుర్తించనూ లేదు. నీ ఉద్దేస్యం ఏమిటి అని అడాగ్గానే ....ఒక నిర్జీవమైన నన్ను....
ఎందుకు???
Tuesday, September 2, 2008
నాకు డ్రైవింగ్ లైసెన్స్ రాదు
నడపడం రాక అనుకున్నారా! కాదు కాదు. రూల్స్ ఒప్పుకోవు అంతే. వింత ఏమిటి అనుకుంటున్నారా. దాని వెనుక చాల ఏళ్ళ కధ ఉంది. నాకిప్పుడు ౩౦ సంవత్సరాలు. నాకు రెండో ఏడు మొదటి రోజున జ్వరం వచ్చి, క్రమేణా పోలియోగా మారిపోయింది. ఇప్పుడు నేను న ఎడమ కాలుకి ఏ రకమైన ఆధారం లేకుండా నడువలేను. ఐతే చిన్నప్పటినుండి నేను పెరిగిన వాతావరణంలో ఇది చేయలేవు అని నన్ను ఎవరూ అనలేదు, నేను అనుకోలేదు.
గత ఎనిమిది సంవత్సరాలుగా నేను హైదరాబాదులో ఉండడం వల్ల బయటికి వెళ్ళాలంటే తప్పకుండా నాకూ ఒక టూ వీలర్ కావాలి. మూడో తరగతి నుండే నాకు సైకిల్ తొక్కడం తెలుసు. ఇంటర్మీడియట్ లో లూనా తో మొదలు పెట్టి హోండా ఏక్టివా వరకు నేను నడపని బండి లేదు. (హైదరాబాదు లో కూడా)
ఇక లైసెన్స్ తీసుకోవాలని మావూరి ఆర్.టి.ఓ ఏజంటు దగ్గరకు వెళ్లాను. మీకు త్రీ వీలర్ ఇప్పించేస్తాను అన్నాడు. నేను కుదరదు, నేను టూ వీలర్ నడపగలను, నాకు అదే కావాలి అన్నాను. దాదాపు మూడు సంవత్సరాలు ఆ విషయం మీద ఎంత చర్చ జరిగిందో. కాని ఏ ఒక్కరూ నన్ను ఆర్.టి.ఓ దగ్గరకు తీసుకు వెళ్ళలేక పోయారు. లెక్కలేనన్ని వాయిదాలు. చివరకు నేనే నేరుగా వెళ్దామని నిర్ణయించుకుని వెళ్లాను. నా కోరికను విన్న గుమాస్తాలు మీరు పక్కన కూర్చోండి, మీది ప్రత్యేకం కదా అని దాదాపు నాలుగు గంటల సేపు నావైపు కూడా చూడలేదు. చివరకు నన్ను దూరం నుండి గమనించిన ఇంకో ఆయన నీ ప్రాబ్లం ఏమిటి అని అడిగాడు. అంతే అవకాసం కోసం ఎదురుచూస్తున్న నేను ఆయన ముందు నా కోపాన్ని వెల్ల గ్రక్కాను. అయన ఇచ్చిన అవకాశంతో లోపలికి వెళ్ళిన నేను నా కోరికను చెబితే, నన్ను అర్ధం చేసుకున్న ఆ అధికారి రూల్స్ ఒప్పుకోవని త్రీ వీలర్ తీసుకోమన్నాడు.
అందరి అర్హతలను పరీక్షించే వాళ్లు నా అర్హతను కూడా పరిక్షంచ వచ్చుకదా, కాని ఎందుకో రూల్స్ ఒప్పుకోవడం లేదు.