Showing posts with label మతం. Show all posts
Showing posts with label మతం. Show all posts

Monday, April 2, 2012

నా ’బరబ్బా’

బరబ్బాను అర్ధం చేసుకోవడం అంటే ఒక దేశ రాజకీయ, సామాజిక, మానసిక, ధర్మ పరిస్తితులను అర్ధం చేసుకోవడంగా కనిపిస్తుంది. అనగనగా ఒక రోమా సామ్రాజ్యం. అక్కడి రాజకీయ పరిస్తితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇలాంటి పరిస్తితులలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూలగొట్టి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతమంది ఎన్ని మార్గాలు ఎన్నుకున్నారో మనకి తెలియదు గానీ, బరబ్బా అనే వ్యక్తి మాత్రం తీవ్రవాదాన్ని ఎంచుకున్నాడు. గెరిల్లా యుద్ద విధానాన్ని పాటిస్తూ రోమా ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నాడు.

అలాంటి సమయంలోనే మరొక వ్యక్తి రోమా సామ్రాజ్యపు క్రూర పాలనకు మూలాలైన మనిషి లోని స్వార్ధం, అసూయ, ధన బలం, అధికార దాహం, అంశాలపైన అవగాహన కల్పించడానికి పూనుకున్నాడు. ఆయన పేరు యేసు. అప్పటి వరకూ ఆధారమనుకున్న ధర్మ శాస్త్రాలు కొద్ది మంది పావులు వాడుకోవడాన్ని గమనించాడు. ఆ శాస్త్రాలకు అప్పటి కాలమాన అవసరాలను బట్టి కొన్ని మార్పులు చేయడానికి పూనుకున్నాడు. అందుకే సమాజంలో పాటిస్తున్న ఎన్నో అంశాలపై ఆయన వ్యాఖ్యానాలు ఇవ్వడం జరిగింది. యుద్దం అలసిపోయిన మనిషికి శాంతి అవసరం అన్నట్టుగా సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును చూస్తున్న ప్రజలకు యేసు ఒకింత ఓదార్పును కలిగించాడు. అందుకే ప్రజలు తండోపతండాలుగా ఆయన ప్రసంగాలకోసం ఎగబడ్డారు. అయితే విసిగి వేసారి పోయిన ప్రజలకు ఒక ఆశ కలిగించాడు. అదే పరలోకం. దేవుని రాజ్యం. ఈ రాజ్యం మనది కాదు అన్నాడు. ఇక్కడ పొందిన శ్రమలకు అక్కడ పరిహారం ఉంది అన్నాడు. ప్రజలకు ఒక నమ్మకం కలిగింది.

యేసుకు పెరిగుతున్న ఆదరణ బరబ్బాను ఆశ్చర్యపరిచింది. వెంటనే ఒక రాజకీయ నమూనాను తయారు చేసాడు. ఇద్దరం కలసిపోదాం అన్నాడు. బుద్ది, భుజ బలం తోడయితే వారి గమ్యం సులభమవుతుందని తన ఆలోచనను యేసు ముందుంచాడు. అయితే యేసు, తమ మార్గాలు వేరని, వారు కలసి పనిచేయడం సాధ్యం కాదని , సున్నితంగా తిరస్కరించాడు. ఆ తరువాత ఎక్కడా వీరిద్దరి కలసిన సంభాషణలు మనం చూడలేదు.

రాజ ద్రోహం నేరం మీద యేసు బంధించబడ్డాడు. ఒక సామాన్యుడు మహా జనాంగంతో రాజు అని పిలుపించుకుంటుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి భయం వేస్తుంది. ఆ భయం నుండే యేసుకు ఏ శిక్ష వేస్తే మరోసారి ఇలాంటివి జరుగకుండా ఉంటాయో అనే దానిపై చర్చ జరిగింది. సిలువ వేయడమే పెద్ద శిక్ష అనుకుంటే, శిలువ మోయడం కూడా జత చేసారు. ఆ వీధులలో అలా యేసు మోయలేక సిలువ మోస్తూ ఉంటే, మనిషన్నవాడెవ్వడూ మరో సారి యేసులా ఆలోచించకూడదన్నది రోమా ప్రభుత్వ ఉద్దేశ్యం.

ప్రజల సమక్షం లో తీర్పు జరుగుతుంది. యేసుపై శిక్ష ఖరారయ్యింది. కానీ ఎవరిని విడుదల చేయాలి. ప్రజలకు కోరుకొనే అవకాశం దొరికింది. ప్రజలు ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. ప్రజల తరపున యుద్దం చేస్తున్న బరబ్బానే కోరుకున్నారు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ప్రక్రియ కాదు. రాజకీయ క్రీడ. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జరిగిన బహిరంగ ఆట. ప్రభుత్వానికి వేరే అవకాశం లేదు. ఇంత ప్రజాదరణ కలిగిన యేసును చంపెయ్యడమే ముఖ్యోద్దేశం. ప్రస్తుతం బరబ్బాకి అంత ప్రజాదరణ లేదు. అందుకే బరబ్బాను విడుదల చేసారు.

కానీ బరబ్బా మనసు నలిగిపోయింది. తను ఏ ప్రభుత్వం మారాలనికొని యుద్దం చేసాడో, ఆ ప్రయత్నంలో ఒక అమాయకుడికి కూరమైన శిక్షను విధించారు. నిజానికి రోమా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నింటికీ కారణమైన తనకు విడుదల, ప్రజల సంక్షేమాన్ని కోరుకొని, కొంత ఊరట కలిగించి, కొత్త జీవాన్ని నింపిన యేసుకు సిలువ శిక్ష. యేసు చెప్పాలనుకున్న రాజ్యం బరబ్బాకు అర్ధమయ్యింది. యేసు లాంటి వాడు బ్రతికి ఉంటే సంపూర్ణంగా వ్యవస్థ మారడానికి అవకాశం ఉంటుంది. ప్రవర్తనతో ప్రతీ వ్యక్తీ సైనికుడిగా మారే అవకాశం ఉంది. ఆ అవకాశం మరో సారి రాదు. మళ్ళీ నిర్మించుకోగలనన్న నమ్మకం లేదు. అందుకే అతని అడుగులు వేగంగా కదిలాయి. పరుగు పెడుతున్నాడు. గుండె పగిలేలా అరుస్తున్నాడు “యేసు నిర్దోషి”. దయచేసి అతనిని విడచిపెట్టండి, అతనికి బదులుగా నన్ను సిలువ వేయండి. నోరు మెదపలేని మహో జనాంగం ముందు ఒక వ్యక్తి (ఒకే ఒక వ్యక్తి) భోరున విలపిస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు, తన్ను తాను అర్పించుకోడానికి సిద్దపడ్డాడు. ఒక అమాయకుడు శిక్షింపబడకూడదని.

• ఏ విషయాలు అర్ధం కాని వారికి యేసుకు ఎందుకు సిలువ వేసారో అర్ధం కాదు.

• యేసు దేవుడు కాబట్టి, సిలువ వేయుంచుకోవడానికి వచ్చాడు కాబట్టి అని, ఆ పని పూర్తయ్యే వరకూ ఎదురు చూసిన వారికి సిలువ ప్రయాణ నేపధ్యం అర్ధం కాదు

• బరబ్బాను బందిపోటు దొంగగా చూసిన వారికి ఆనాటి రాజకీయ నేపధ్యం, అతని అంత:సంఘర్షణ అర్ధం కాదు

• బైబిలులో ఏం రాసినా అది గొప్పే అనుకునే వాడికి “ఏమీ అర్ధం కాదు”

Tuesday, September 27, 2011

నీలోనే దేవుడు

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
” యోహాను 1:1

వాక్యము అనగా మాటల కూర్పు. అంటే మనం మాటాడే ప్రతీ మాట దేవుని ఉనికిని తెలియజేసుంది. మాటను దేవుడు అనడంలో చాలా గొప్ప అంతరార్ధమే దాగి ఉంది. ఇప్పటి వరకూ మనం నమ్ముతున్నదేమిటంటే దేవుడు చాలా శక్తివంతుడని, తను తలచుకుంటే ఏమైనా కాగలదని, తనకి సాధ్యమైనదేదీ లేదని నమ్ముతాం. దేవుడు మనకు కనిపించకుండా, మనకు తెలియని ఆకారంలో ఉన్నాడని అంటాం. దేవుడిని మనం ఎన్నటికీ చూడలేమని, చూసే శక్తి మనకు లేదని, కేవలం ఆయన క్రియలను మాత్రమే చూడగలమని నమ్ముతాం. వీటన్నిటికీ సరిగ్గా సరిపోయేదే ’మాట’. అది ఎంత శక్తివంతమైనదంటే ’నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’. మనం జీవితంలో జరిగే ప్రతీ పనికి ముందు స్పందించేది మాట. ఎన్నో ఆలోచనల సమాహారం మాట. ఆలోచనలెంత గొప్పవైనా వాటిని మాటల రూపంలోకి తీసుకురావడానికి ఎవరైనా జాగ్రత్త వహించవలసిందే. ఆలోచన మాట రూపంగా మారిన మరు క్షణమే కార్యరూపం వైపు పరుగులు తీస్తుంది. “ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను...” అన్నియూ పలికినట్టుగా జరిగెను. కానీ మన ఆలోచనలను అక్కడితో హద్దులను నియమిస్తున్నాం. కానీ మనం జీవితంలో ప్రతీ క్షణం దేవుని శక్తిని చూస్తున్నాం. నేను కాకుండా నా మాటే చేరాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా టెలిఫోన్ వచ్చింది, తరువాత టెలిఫోన్ రంగంలో మనం ఖాళీ గా కూర్చుకొని, పనిలేక పలికిన ప్రతీ మాట ఈరోజు వాస్తవ రూపంలో మనద్వారా వాడబడుతుంది. మనం ఈరోజు అనుభవిస్తున్న ప్రతీ సౌకర్యం ఒకప్పుడు ఇలా జరిగితే బావుండును అనే మాట. కాలక్రమేణా అది కార్యరూపం. దేవుడనే (మాట) శక్తి నీలోనే ఉంది. ఆ శక్తిని నీవు ఎలా వాడుకుంటావు అనేది నీ ఇష్టం. నీవు ఎలా వాడినా ఫలితం మాత్రం తధ్యం.

"వాక్యము శరీరధారియై మన మధ్య సంచరించుచుండెను"

నిజం. వాక్యము (మాట) తనంతట తానుగా సృష్టించబడదు. దానిని నడిపించడానికి ఒక శరీరం కావాలి. శరీరం ద్వారానే ఇంకో శరీరానికి కార్యనిమిత్తమే చేరుతుంది. అందుకే మనం దానిని ’శరీరధారియై యుండును’ అని సూత్రీకరించవచ్చు. అందుకే బైబిల్ లో అప్పటి వరకూ లేని ఓ కొత్త సూత్రాలని బోధించడానికి ’యేసు’ అనే శరీర ధారిని సృష్టించ వలసి వచ్చింది. ఎందుకంటే మోషే విన్న ’అదృశ్య శక్తి’ కి కాలం చెల్లిపోయింది. పది ఆజ్నలను పాటించే వాడు కాదుకదా, గుర్తున్నవాడు కూడా ఆ సమాజంలో కనిపించలేదు.

జ్నానం: నీలో వున్న దేవుడి (మాట) శక్తిని ని నువ్వు గుర్తించలేనపుడు, నీకు ఏ దేవుడూ కనిపించడు, ఏది ఎందుకు జరుగుతుందో నీకు అర్ధం కాదు. నమ్మమని పదే పదే చావగొట్టటం తప్ప.

Sunday, September 25, 2011

తప్పు చేయడం is default quality

నా చిన్నతనంలో నేను నేర్చుకొన్న మరొక విషయం: మనిషి సాతాను ద్వారా పాడయిపోతాడు, దేవుని ద్వారా బాగుపడతాడని. కాబట్టి ఎవ్వరి జీవితంలోనైనా మంచి జరిగితే అది దేవుని కృప అని, చెడు జరిగితే సాతాను శోధన అని చాలా publicity జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సన్నివేశం నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. అదేమంటే తెల్లారి లేస్తే ప్రభువా, ప్రభువా అనే ఒక స్నేహితుడు (యుక్త వయసు) ఈ సమాజం పాడైపోతుందని, అది నెమ్మదిగా చర్చి వద్దకు చేరిందని, దాని ప్రభావం వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అప్పటికే మనం చేసే ప్రతిపనికీ వెనుక ఒక తోకను తగిలించడాన్ని భరించలేకపోతున్న నాకు, ఇది పుండుమీద కారం చల్లినట్టయింది.

ఇంతకీ విశయం ఏమిటంటే "స్త్రీలు - వస్త్రధారణ - దైవత్వం". సింగిల్ ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు స్త్రీలు బైబిలు ప్రకారం లేరని, దాని వల్ల సమాజంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నది ఆయన వాదన. సమాధానం, మీకు, నాకు తెలిసు, కానీ ఆయనకు తెలియదు కదా. ఆరోజు నా వాదనతో ఆయన ఏకీభవించలేదు. నేను యేసుని ప్రార్ధించను కాబట్టి అలా మాట్లాడుతున్నానని, నిజమైన యేసును తెలుసుకొంటే నా మాటలు మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ పోస్టు ఆయనకే అంకితం.

Leading Role: Jesus
Supporting Characters: his disciples

యేసు ఒక public meeting లో ఇలా అంటాడు: "మనుష్యుని అపవిత్రునిగా చేయునది ఏదియు లేదు గానీ, లోపలినుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయును". కధలో అన్ని సమయాలలో వలెనే మరలా శిష్యులు ఇంటికి వెళ్ళిన తరువాత clarity ఇవ్వమని అడుగుతారు. అప్పుడు యేసు "మీరు ఇంత అవివేకులై ఉన్నారా! వెలుపలినుండి మనుష్యని లోపలికి వెళ్ళేది మనుష్యుని అపవిత్ర పరచదని మీరు గ్రహించ లేక పోతున్నారా! అలా బయట నుండి వెళ్ళేది, కడుపులోకి ప్రవేశించి, బహిర్భూమిలో విడచిపెట్ట బడుతుంది అని చెప్పి, దానిని కొనసాగిస్తూ, లోపలినుండి అనగా, మనుష్యుని హృదయలోనుండి దురాలోచనలును, జారత్వములును, దొంగతనములును, నరహత్యలును, వ్యభిచారములును, లోభములును, కృత్రిమములును, కామ వికారమును, మత్సరమును, దేవ దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నియు మనుష్యుని లోపలినుండే బయలువెళ్ళి, మనుష్యుని అపవిత్రపరచును"

మార్కు సువార్త దేవుని actions లో limitation ను ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే మొత్తం scene లో సాతాను లేడు. కాబట్టి ఎవరైనా ఈ పనులను సాతాను కి attribute చేస్తే అది ఖచ్చితంగా మనకి బాగా అలవాటయిన లక్షణం "పక్కవాడి మీదకు తోసెయ్యడం".

ఇంకో ఆసక్తి కరమైన విషయమేమంటే, పైనుదహరించిన నా స్నేహితుని పాస్టర్ గారు (ప్రస్తుతం ఆయన చాలా popular), వారు సభ్యులు కొంతమంది నుండి వచ్చిన letters ఆధారంగా చేసుకొని, 'ప్రురుషుల, యువకుల మనసు పక్కదారి పట్టకుండా స్త్రీలు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి' అని మూడు సార్లు వాక్యము ద్వారా హెచ్చరించడం కూడా జరిగిందట.

లోపలి కలిగిన feelings కి బయట వాళ్లని బాధ్యులను చేయడం ఏమంత న్యాయం.
Let's take the responsibility of our actions.

Source: Mark

Friday, September 23, 2011

క్షమాపణ ఒక శక్తి: Forgiveness is Energy

మనుష్యులనుద్దేశించి యేసు ఒక చక్కటి మాట అంటాడు. అదేమనగా ’పాపములు క్షమించుటకు మనుష్యు కుమారునికి అధికారము కలదని తెలిసికొనవలెను’ అని. నా జీవిత కాలంలో మనుష్యులకు ఈ అధికారమున్నదని ఎవ్వరూ చెప్పలేదు. అది మరి వారికి తెలియకో/ దాచవలెననో నాకు తెలియదు. అయితే ఒక్క మాట చదువగానే చిన్నప్పటినుండీ ఊపిరి పీల్చినంత సులభంగా, ప్రతీసారీ గుర్తుచేసుకొనే పరలోక ప్రార్ధన గుర్తొచ్చింది. ఆ చివరలో ఇలా ఉంటుంది "మేము మా యెడల అపరాధములను చేసిన వారిని క్షమించిన రీతిగా, నీవు/మీరు మా అపరాధములను క్షమించండి". చాలా బావుంది. నువ్వు ఎవరినైనా క్షమిస్తేనే, క్షమించబడతావు అని దారి అర్ధం. నిజానికి ఎంతమంది, ఎంతమందిని ప్రతీ రోజూ క్షమిస్తారో తెలియదు గానీ, అందరూ క్షమించానని మాత్రం దేవుడు (వారికి) కి చెబుతారు.
క్షమాపణ ఒక శక్తి అని చాలామందికి తెలియదేమో. లేకపోతే వారు నాకు ఎప్పుడో ఒకసారి దీని గురించి ఖచ్చితంగా చెప్పి ఉండేవారు. ఇంకా విచిత్రమేమంటే క్షమించడం అన్ని సార్లు వీలుకాదు అని, దేవుని ఉగ్రరూపాన్ని తట్టుకోలేమని మాత్రం చెప్పారు.
ఎవరు ఏమి చెప్పినా, యేసు క్షమించిమని చెప్పినా, వాస్తవ జీవితంలో క్షమించగలగడం గొప్ప పనే. ఇక నుండీ నా జీవితంలో క్షమించగలిగే గొప్ప వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకొంటాను. బహుశా నేను అందరినీ క్షమించేస్తానేమో.

My source for interpretation: మార్కు సువార్త.

Tuesday, September 20, 2011

భార్యా-భర్తల సంబంధం: యేసు. [మార్కు సువార్త]

యేసు తన కొత్త పంధాను జనంలోకి తీసుకెళ్లడానికి పరిసయ్యులు చాలా బాగా సహాయం చేసారు. వారు creative ideas తో వచ్చి, యేసు దగ్గరనుండి సమాధానాలు ఆశించే వారు. యేసు చాలా జాగ్రత్తగా మోషే ధర్మ శాస్త్రాన్ని amend చేస్తూ, logical అందరినీ సంతృప్తి పరచేవాడు. అలాంటి వాటిలో భార్య భర్తల సంభంధం ఒకటి.

"ఒకడు భార్యను విడనాడుట న్యాయమా" అని పరిశయ్యులు అడిగిన ప్రశ్నకు యేసు మోషే ధర్మశాస్త్రాన్ని reference గా తీస్తాడు. "పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని" చెప్పినని గుర్తుచేస్తారు. అయితే ఆ ప్రశ్నకు యేసు సంతృప్తిపడినట్టుగా కనిపించదు. దానికి కొనసాగింపుగా ఇలా interpret చేస్తాడు. "ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి ఇలా వ్రాసి ఇచ్చెను" గానీ సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురు షునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను.
అయితే నేనిక్కడ రెండు విషయాలను అర్ధం చేసుకొన్నాను.
1. మోషే ఈ విషయం తెలిసి, అప్పటి ప్రజానీకం పాటించడానికి సిద్దంగా లేరని, విడిచిపెట్టడానికి చట్టబద్దత కలిగించి ఉండాలి.
లేదా
2. మోషే కి ఆ విశయం తెలియక పోయినా, ఆదికాండాన్ని base గా చేసుకొని, మోషే argument ని యేసు extend చేసి ఉండాలి.
యేసు ఈ extension లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. చట్టబద్దతను దాటి నైతికతను, దైవికతను జోడించాడు. ఈ చర్చ ఇలా సాగించడానికి అతని శిష్యులు అతనికి సహకరించారు. పరిశయ్యులతో జరిగిన చర్చ వీరికి అర్ధం కాదు. ఇంటికి వచ్చిన తరువాత వారు యేసుని మరలా అడుగగా "తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను". బహుశా పది ఆజ్నలులోని వ్యభిచారాన్ని గుర్తు చేస్తే భయపడతారని ఆశపడి ఉండవచ్చు. అయితే పది ఆజ్నలు పాటించకపోతేనే ఈయన రావలసిన అవసరం ఏర్పడిందన్నది అసలు విశయం. ఓహ్.. సారీ.. పది ఆజ్నలు మరో సారీ revise చెయ్యడానికి వచ్చాడన్నది అంగీకరించవలసిన విశయం. అయితే ఇది revise అయ్యిందో లేదో పాటించే వారు చెప్పాలి.

ముఖ్య గమనిక:
నేను చిన్నప్పటి నుండి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను. అయితే ఆ సిద్దాంతాలతో ఇమడలేక నాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాను. ఆ రోజు నుండీ ఈ రోజు వరకూ నాపై ఎన్నో pressures, blackmailings, ఇంకా ఎన్నో. అయితే నాకు ఏమతం అన్నా ఒకటే. నాకు దాని చారిత్రకతతో తప్ప, వాస్తవాతీతమైన విషయాలతో నాకు సంబంధం లేదు. ప్రతీ సిద్దాంతంలోని కొంత వాస్తవికత ఉంటుందని నమ్ముతాను. దానిని స్వీకరించడానికి ఎప్పుడూ సిద్దమే. ఆ క్రమంలోనే నా అవగాహనను నా బ్లాగులో రాసుకొంటున్నాను. నన్ను enlighten చేయాలనుకొనే వారికి ఎప్పుడూ స్వాగతం. Emotional గా తీసుకొనే వారు మాత్రం నా post లలోకి రావొద్దని మనవి.

Wednesday, August 19, 2009

దేవుడిది ఏ కులం

ఏడవ తరగతి చదువుతున్న మా అన్నయ్య గారి అమ్మాయి, ఆరవ తరగతి చదువుతున్న మా పెదనాన్న గారి మనుమడు ఆడుకొంటున్నారు. నేను ఇలా computer దగ్గర కూర్చొని ఏదో చదువుతున్నాను. వాళ్ళిద్దరికీ నేను బాబాయినే. వాళ్ల పనిలో వాళ్ళు, నా పనిలో నేనూ ఉన్నాం.

ఇంతలో మా పాప పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. బాబాయి వీడికో doubt వచ్చింది చెప్పవూ అని. ఏ subject లో doubt అడుగుతాడో చెప్పేద్దామని ఆశగా వాడివైపు చూసాను. వాడేమో అడగడానికి సిగ్గు పడుతున్నాడు. ఇంతలో మా అమ్మాయి తనే అందుకొని, వీడు "దేవుడు ఏ కులం అని అడుగుతున్నాడు" నువ్వు చెప్పు బాబాయి అని తనకి కూడా సమాధానం కావాలన్నట్టుగా చూసింది.

నా పరిస్తితి అడకత్తెరలో పోక చెక్క అయ్యింది. ఇన్ని బ్లాగులు చదివినా, రాసినా, ఇలాంటి ప్రశ్నను ఊహించలేదు. మా ఊరు IInd grade municipality అయినా మేముండే ప్రాంతం మాత్రం పల్లె వాతావరణమే ఉంటుంది. అక్కడ అంబేద్కర్ నగర్, గాంధీ నగర్, కనగ దుర్గ అమ్మవారి వీధి, ఇలా వుండవు. మాదిగ పేట, కుమ్మరి పేట, చాకలి పేట, శెట్టిబలిజ పేట, కాపుల పేట ఉంటాయి. అన్ని పేటలలోనూ అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. మా వాడు కొంచె తెలివైన వాడు. అందుకే వీడికి ఆ ప్రశ్న వచ్చింది.

ఆ వయసుకు నా ఆలోచనలన్నీ చెప్పేస్తే వాడికర్ధం కాదేమో అని అనుమానం. నీకెందుకురా అని కొంతమంది లాగా తిట్టి పంపించలేనూ. ఇన్ని అనుమానాలతో నేను ఉంటే వాళ్ళు ఇంకా నా వైపే చూస్తున్నారు. అందుకే దేవుడు మన కులమేరా అని చెప్పాను. అంతే వాళ్ళు అక్కడి నుండి గొప్ప విశయాన్ని సాధించినట్టుగా విజయ గర్వంతో వెళ్ళిపోయారు.

ఇప్పటికే కులం గురించి రకరకాల మనుషులతో రక రకాలుగా వాదించి, చర్చించి అలసిపోతున్నాము. కనీసం వాళ్ల కొంతకాలమైనా ప్రశాంతంగా వుండాలని అలా చెప్పేసాను. నిజానికి నాకు దేవుడే లేడు, ఇక కులమెక్కడ తెచ్చేది.

కానీ ఆంధ్ర ప్రదేశ్ లో దలిత వినాయకుడిని, అయ్యగోర్ల వీధిలో ఊరేగించినందుకు, ఊచకోత కోసిన సంఘటనలు మాత్రం ఇంకా మరిచిపోలేదు.

Wednesday, November 26, 2008

నేను 'దేవుని బిడ్డని'

నేను 'దేవుని బిడ్డని'. మా అమ్మ 'ఒంటి గొడ్రాలు' ౧౦ సం. లు బాధ పడ్డ తరువాత దేవుడిచ్చిన వరప్రసదాన్ని. ఎ దేవుడో తెలుసా? మనవాళ్ళ బ్లాగుల చర్చనీయమ్సమైన ఆ 'క్రైస్తవ దేవుడే'. మా అమ్మ పుట్టిన వాళ్ళని దేవుడికే ఇచ్చేస్తానని మొక్కుకుంది అట. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు నన్ను చర్చ లో దేవుడికి ఇచ్చేసింది. ఐతే దేవుడు నాతో ఏమీ మాట్లాడలేదు. నన్ను రమ్మని అనలేదు. నాకేమి చేయాలో చెప్పలేదు. పాస్తారుగారు ఈ దేవుని బిడ్డని వేలం వేసారు. మళ్ళీ మా అమ్మే నన్ను కొనుకుంది. నేను దేవుని బిడ్డని.

దేవునితో నాకెప్పుడూ పోరాటమే నాకెందుకు కనిపించలేదని. చాలా కాలం చూసాను, కనిపించలేదు. ఎందుకు కనిపించలేదా అని ఆలోచించడం మొదలు పెట్టాను. ఇప్పుడు కాదు ఎప్పుడో. చివరకు తెలిసింది కనిపించదని లేదా కనిపించాడని అనుకోవాలని. దేవుడితో పాటు మొదలైన ఈ ప్రశ్న మానై ఈరోజు దేవుని బిడ్డ దూరమై పోయాడు. దేవునికి దూరంగా ఉన్నా అప్పుడు ఇప్పుడు ఒకలానే వున్నాడు. అప్పుడు దేవుడు అవసరం లేదేమో అనిపించింది. బాధగా వున్నప్పుడు నాకెవరో కావాలని అనిపించలేదు, సంతోషంగా వున్నప్పుడు ఎవరో వున్నారని అనిపించలేదు. హాబ్స్ చెప్పినట్టు మనిషిలోని కదలికలే స్పందనలు కలుగ జేస్తాయి అనిపించింది.

మతం నైతికతను బోధిస్తునదని ఎన్ని సార్లు అనుకున్నా, నాకు తెలిసిన భక్తులంతా తమను తాము మతంతో సమర్దించుకొనే వాళ్ళే తప్ప అందులో పాటిస్తున్నవి చాలా తక్కువే అనిపించింది. ఒక వేళ ఈ మాట చెబితే ఆరోజు మూడో ప్రపంచ యుద్దమే. చాలా సార్లు చేశాను లెండి. నేను నీతిమంతుడిని కాదు పాపినే కాని అందరు నాలాగే వున్నారు అయినా వాళ్ల దృష్టిలో నాపై ఎందుకంత చిన్న చూపో ఇన్నాళ్ళైనా తెలియడం లేదు. ఈ పాపిని మార్చాలని, నన్ను పరలోక రాజ్యం పంపించాలని ఎంతమంది కష్టపడుతున్నారో తెలిసినప్పుడు నా సారీరా కదలికల స్పందన నాకే అసహ్యం గా వుంటుంది. ఓ కొత్త బిచ్చగాడి గురుంచి చెబుతాను. ఇది జరిగి ఇంకా పదిహేను రోజులు కాలేదు.

పన్నెండేళ్ళ తరువాత ఒక స్నేహితుడు నా బ్లాగు చదివాడు. నా జీవితం లో వెలుగు చూపించాలనుకున్నాడు. అందులో బొల్లోజు బాబా గారు తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేసారు. ఓ ఆదివారం ఉదయం ఆరున్నరకి ఫోను చేసి, నలభై కిలోమీటర్ల దూరంలో వున్నా తనదగ్గరకు వెంటనే రావాలని అడిగాడు. నాకెందుకో చాల అవసరం అనిపించి వెంటనే బయలుదేరాను. బజాజ్ స్పిరిట్ మీద అరవై కిలోమీటర్ల స్పీడుతో సుమారు గంట పది నిమిషాలలో గమ్యాన్ని చేరుకున్నాను. వాడు చెప్పిన మొదటి మాట ఇప్పుడు మనం చర్చికి వెళుతున్నాము. ఏమీ మాట్లాడకు అన్నీ తరువాత చెబుతాను అన్నాడు వెంటనే. ఎందుకంటే నాకు ఏమీ తెలియని రోజుల్లో ఇవన్ని మాట్లాడింది వాడే. అప్పుడు తనమాటే వినమన్నాడు ఇప్పుడు అదే చెయ్యాలనుకున్నాడు. జీవితం మారిందేమో గాని విధానం ఐతే మారలేదు. వాడేమి మారేదో అ దేవుడికే తెలియాలి.

మతం అనే వ్యవస్థ అలానే వుండి. దానిని దాటి ఆలోచిస్తే వాల్లెప్పుడు బయటే వుంటారేమో నేనున్నట్టుగా. నాకూ 'దేవుడు' కావాలి, నన్ను ఇబ్బంది పెడుతున్న వాల్లన్దిరికి నన్ను వదిలేయమని చెప్పడానికి. నా మానాన నాన్ను బ్రతుకనివ్వడానికి, నేను 'దేవుని బిడ్డను' కాను చెప్పడానికి.