Professor Maricia Rioux has visited University of Hyderabad and Delivered this lecture. Click Maria's Talk to listen this audio
Showing posts with label Disability in Media. Show all posts
Showing posts with label Disability in Media. Show all posts
Thursday, September 25, 2014
Monday, June 17, 2013
ఓటమిని ఓడించిన వైకల్యం
మనం అందరం సాధారణ మనుష్యులం... కోపం, ప్రేమ, బాధ, ఈర్ష్య, జాలి, కష్టం, ఇష్టం, సంతోషం, దు:ఖం లంటి ఎన్నో ఉద్రేకాలు కలిగిన మనస్తత్వాలు మనవి...
మన ఈ జీవితప్రయాణంలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాము.. కాని ఎప్పుడైనా ఒక అవిటివాడినో లేక శారీరక లోపాలు ఉన్నవారినో కలిసినప్పుడు మాత్రం వారి మీద మనకు ముందు కలిగేది "జాలి".. అది సహజం.. నేను కూడా అలాగే ఉండేవాడిని..
కానీ నా ఈ ప్రయాణంలో ప్రత్యేక్షంగా మరియు పరోక్షంగా పుట్టుకతో లేదా ప్రమాదవశాత్తు అవయువాలు కోల్పోయిన కొంతమందిని కలిసాను.. వాళ్ళని కలిసిన తరువాత వాళ్ళకి కావలసింది ఏంటో తెలుసుకున్నాను, వాళ్ళు కోరుకునేది ఏంటో తెలుసుకున్నాను... వాళ్ళ మీద "జాలి" చూపించడం మానేసాను... ఎందుకంటే వాళ్ళు కోరుకునేది "ప్రోత్సాహం" కాని "ఓదార్పు" కాదు..
ఇక్కడ నా మనసుని కదిలించిన కొన్ని సంఘటనలు ప్రస్తావిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇవి చదివిన మీలో ఈ సంఘటనలు ఒక్కరి మనసునైన కదిలిస్తుందెమో అని ఆశ... కదిలిన మనసులలో ఒక్క మనసైన మారుతుందేమో అని అత్యాశ....
అతను ఆషిష్ గోయల్ కాదు ఆదర్శ్ గోయల్:
కొన్ని ఏళ్ళ క్రితం లో ఒక పెద్ద కార్పరేట్ సంస్థ ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తు ఇంటర్వ్యూకి వచ్చిన ఆషిష్ గోయల్ అనే వ్యక్తితో ప్రభుత్వ పరిధిలో అంధుల కోటాలో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించమని చెప్పింది. ఎందుకంటే ఆషిష్ కొన్ని ఏళ్ళ క్రితం "రెటినిటిస్ పిగ్మెంటోసా" అనే వ్యాధి వలన తన చూపు కోల్పోయాడు... కాని అతను ఆ సంస్థ ఇచ్చిన ఉచిత సలహా ని తక్కువగా తీసుకోలేదు... ING Vysya లో ఉద్యోగం సంపాదించడమే కాక తన బ్యాచ్ లోనే రెండవ స్తానంలో నిలిచాడు... ఆ తరువాత వార్టన్ స్కూల్, యూనివర్సిటి ఆఫ్ పెన్సిల్వనియ, ఫిలడెల్ఫియా నుంచి MBA పట్టా పొందాడు..
ఈరోజు ఈ ముంబయి వాసి జె.పి.మార్గన్, లండన్ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు...
కొన్ని ఏళ్ళుగా వృత్తి పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఎన్నో గొప్ప పనులు చేసాడు. ఇష్టంతో "బ్రెజిలియన్ డ్రమ్స్" నేర్చుకున్నాడు, వాయిస్తాడు. ఇప్పుడు "అర్జెంటినో టంగో" నుంచి "బాక్సింగ్" వరకు తనకి ఇష్తమైన కళలు అన్నీ నేర్చుకుంటున్నాడు.
2010 లో జాతీయ అవార్డ్ అందుకోవటానికి గాను భారత దేశానికి వచ్చిన ఆషిష్ ని ఒక వెబ్ సైట్ యజమాని లజ్వంతి డిసౌజా పలకరించినప్పుడు తన గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు చెప్పాడు ఆషిష్.
తనకి వచ్చిన జాతీయ అవార్డ్ తనకు చాలా ఉత్సాహం ఇచ్చిందని చెప్తూ రాష్ట్రపతి చేతుల మీద అవార్డ్ అందుకోవడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రోత్సాహం అనేది ఎవరికైనా సరే అద్భుతాలు సృష్టించే శక్తి ఇస్తుందని నమ్ముతున్నానని చెప్పారు.
"మేము జీవితం అనే ఆటలో ఎంతో కోల్పోయాం, ఇలాంటి అవార్డ్ వల్ల తిరిగి మేము ఒక అడుగు ముందుకు వేయడానికి సహాయ పడుతుంది. ఇలాంటి గుర్తింపు పొందినందుకు ఈ సందర్భంగా భగవంతుడికి కృతఘ్నతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి గుర్తింపు మనిషిలో ఉత్తేజం నింపుతుంది. అంతేకాకుండా, ఇలాంటి అవార్డ్ అవిటివాళ్ళ మీద సమాజానికి వుండే అభిప్రాయం మర్చగలిగితే అంతే చాలు" అన్నారు.
అంతేకాకుండా "Enable India" అనే సంస్థ ద్వారా అతను సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. "Education through Pratham", "Akshaya Pathra" అనే మరో రెండు పథకాలు ద్వారా కూడా తను సేవలు అందిస్తున్నాడు.
అందుకే ఆషిష్ గోయల్ ఎంతో మందికి ఆదర్స్ గోయల్ అయ్యాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే...
సురేష్ ప్రజాపతి - సహా:యానికి నిధి:
కొన్ని ఏళ్ళ క్రితం అహ్మదాబాద్ లో జరిగిన ఒక జాబ్ ఫెయిర్ లో అభ్యర్ధులుతో మాట్లాడిన తరువాత బయటకి వచ్చిన అధికారి ఒక అంధుడు అక్కడ కూర్చోటానికి చోటు కోసం వెతుక్కుండటం చూసాడు. ఆ అంధుడి పేరు సురేష్ ప్రజాపతి. పరీక్ష అయ్యిపోయిందా అని అడిగిన అధికారి ప్రశ్నకు సమాధానంగా "లేదు. నేను నా స్నేహితుడితో ఇక్కడికి వచ్చాను" అని గట్టి నమ్మకంగా చెప్పాడు. ఓహో అయితే నీ స్నేహితుడు నిన్ను తీసుకుని నీకోసం వచ్చాడా? అని అడిగిన అధికారి సురేష్ ఇచ్చిన సమాధానం కి ఆశ్చర్యపోయాడు. "లేదు. నేను ఇంతకు ముందే ఇక్కడ నమోదు చేసుకున్నాను. మాది విరంగం పక్కనే మండలం అనే గ్రామం. నా స్నేహితుడికి అహ్మదాబాద్ గురించి పెద్దగా తెలియదు. కాబట్టి నా స్నేహితుడు తనని ఇక్కదికి తీసుకుని రమ్మని నన్ను కోరాడు. అతనికి సహాయంగా నేను ఇక్కడికి వచ్చాను" అని మల్లి అదే నమ్మకం తో చెప్పాడు.
ఆ సమాధానం విని ఆశ్చర్య పోయిన అధికారి ఏదైనా సంస్థలో పని చేస్తున్నావా? అని అదిగిన ప్రశ్నకు "నేను టెలిఫోన్ బూత్ నడిపేవాడిని, కాని ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉండటం వల్ల వేరే కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఎన్నో సంస్థలకి తిరిగాను కాని ఎక్కడ ఉద్యోగం దొరకలేదు" అని మొదటిసారి కొద్దిగా అధైర్యత చూపించాడు.
నువ్వు ఏమి ఉద్యోగం చేయగలవు? అని అధికారి అడిగిన ప్రశ్నకు "టెలిఫోన్ ఆపరేటర్ గా చేయగలను, గుజరాత్ రాష్ట్రంలో ఒంటరిగా ఎక్కడికి అయినా వెళ్ళగలను. పిల్లలకు పాఠాలు చెప్పగలను, ముఖ్యంగా నేను ఏమైనా నేర్చుకోగలను" అని చెప్పాడు. నిజంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడిన సమాధానం అది. ఆ తరువాత అతను కోరుకున్నట్టుగా అతనికి మంచి ఉద్యోగం లభించింది.
సామాన్య వనిత ఈ జెన్నిత:
తిరుచ్చి, తమిళనాడు లో జన్మించిన ఈమె పుట్టుకతోనే శారీరక లోపాలతో జన్మించింది. అలా అని తనకు లోపాలు వున్నాయి అని ఏ రోజు కృంగిపోలేదు. తనలో ఉన్న శక్తిని తెలుసుకుని ఆమె తండ్రి, ఇరుదయరాజ్ ప్రోత్సహించాడు. అవిటివాళ్ళు అయిన గొప్ప మేధావుల కథలు వినిపించాడు. ఆమెను ప్రోత్సహించాడు. "చదరంగం" మీద తనకి ఉన్న ఆశక్తిని తెలుసుకున్నాడు. ఆమె ఇష్టాన్ని, ఆశయాన్ని తెలుసుకుని విశ్వవిఖ్యాతగా పేరుగాంచిన రాజు రవిశేఖర్ ఆమెను తీర్చిదిద్దాడు. ఈరోజు ఆమె చదరంగం ఆటలో ఎన్నో విజయాలను అందుకుంది. పోలండ్ లో నిర్వహించిన అంతర్జాతీయ చదరంగం పోటీలో వెండి పథకాన్ని గెలుచుకుంది. ఇలా ఎన్నో మైలురాళ్ళు దాటిన ఆమెను తన విజయాల రహస్యం ఏమిటని అడిగితే "విజయం, అపజయం అనేవి మన మనసులోనే ఉంటాయి. నేను మొదటిసారి చదరంగం పోటీలో పాల్గొనిన రోజు నాకు ఇంకా గుర్తు ఉంది. ఆరోజు నాలో వణుకుని నేను చూసాను. వేలమంది ప్రేక్షకులు నన్నే చూస్తున్నారు. వీల్ చైర్ లో వచ్చిన నన్ను చూసి వారంతా మనసులో ఏమనుకుంటున్నారు అని ఆలోచించిన క్షణం నాకు ఇంకా గుర్తు ఉంది. కాని ఆరోజు ఆట గెలిచిన తరువాత ఈరోజు వరకు నేను అదే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను" అని ప్రకాశవంతమైన చిరునవ్వుతో చెప్పింది.
విజేతగా నిలిచిన సుజాత:
ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన ఈమె షిరిడి నుండి తిరిగి వస్తుంటే 2001 లో ప్రమాదానికి గురి అయ్యింది. ఆ ప్రమాదంలో తను చేతులు, కాళ్ళు కోల్పోయింది. నాలుగు నెలలు తరువాత ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె ఇంక జీవితకాలం నడవలేదు అని తేల్చి చెప్పారు. ఆమె భుజాల కింద చలనం కోల్పోయింది. ఆ తరువాత ఆమె కొన్ని రోజులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యింది. అప్పటికి ఆమె వయసు 21. ఆమె స్నేహితులు అనుకున్న వారంతా ఆమెను ఒంటరి దానిని చేసారు. విధి చాలా విచిత్రమైనది. ఆమె బాధకు మరింత బాధను జత చేసింది. 2004 లో తోడుగా నిలుస్తాడు అనుకున్న ఆమె తండ్రి కూడా మరణించాడు. దానితో ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. బాధ ని బాధతో ఎన్ని సార్లు గుణించిన ఆమె పడే బాధకు తక్కువే అవుతుంది. ఆ బాధలోనే ఆమెకు ఆత్మ విశ్వాసం పెరిగింది. స్టాక్ మార్కెట్ పై అవగాహన పెంచుకుంది. ఆమె తెలివితో ఈరోజు ఆమె నెలకు సుమారు మూడు లక్షలు సంపాదిస్తోంది. ఆమె నిఫ్టీ ద్వారా ఒక రోజు ఆరు లక్షలు సంపాదించిన ఎకైక వ్యపారవేత్త.
అంతే కాదు ప్రముఖ టీవి ఛానెల్ లో ఈ సుజాత అలియాస్ సుజి అనే మహిళ "suzy's encounter" అనే కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరిస్తుంది. మీ విజయంలో కీలక పాత్ర మీ కుటుంబానిదా?? స్నేహితులదా?? అని అడిగిన ప్రశ్నకు "నా తండ్రి కొన్ని ఏళ్ళ క్రితమే మరణించారు. నేను నా తల్లితో ఉంటున్నాను. ప్రమాదానికి ముందు నన్ను ఆధరించిన స్నేహితులు ప్రమాదానికి తరువాత నన్ను వెలేశారు. వాళ్ళు నిజమైన స్నేహితులు కారు. అలాంటి వాళ్ళు డబ్బు, హోదా, సంతోషం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారు. అలాంటి వాళ్ళు ఓటమికి ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఇప్పుడు నాకు కొత్త స్నేహితులు దొరికారు. వాళ్ళు చల కొద్ది మందే అయినా నిజమైన స్నేహితులు. కష్టకాలంలో నా వెన్నంటే వున్నారు. వాళ్ళు నాకోసం ఆలొచించే వాళ్ళు" అని ఆమెలోని ఆవేదన బయటపెట్టింది.
పుట్టుకతో పోలియో - సాధించినవి ఎన్నో:
ఇది నా ప్రత్యేక్ష అనుభవం. నాలుగేళ్ళ క్రితం బెంగళూరు లోని ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహించిన సమావేసానికి (conference) నేను హాజరయ్యాను. సమయం గడిచిపోతున్నా సమావేసం మొదలపెట్టని యాజమన్యాన్ని పై కోప్పడ్డాను. కొన్ని నిమిషాల తరువత సమావేసం మొదలుపెట్టాల్సిన వ్యక్తిని ఇద్దరు వ్యక్తుల సహాయంతో సమావేస గదికి తీసుకుని వచ్చారు. అతనిని చూసి అనవసరంగా కొప్పడ్డాను అని బాధపడ్డాను. అతను ప్రసంగించడం మొదలుపెట్టిన పది క్షణాలకే అతను మాట్లాడేది ఆశక్తిగా వింటున్నాను. అతను పుట్టింది ఆంధ్రప్రదేశ్, అతనికి పుట్టుకతోనే పోలియో ఉంది. అతనిది సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. ఎన్నో కష్టాలతో, చదువంటే ఇష్టంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని ఈరోజు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి డైరెక్టర్ హోదాని అందుకున్నాడు. అతనే వి.వి.రవీందర్. 2004 లో తమిళనాడులో సంభవించిన సునామి కారణంగా ఎంతోమంది ప్రాణాలు విడిచారు. సముద్ర తీరాల్లో నివసిస్తూ ప్రాంతీయ బాష తప్ప వేరే బాష తెలియకపోవడం కూడా ఒక శాపం లాంటిదే అని భావించాడు. దానితో చలిమ్చిన అతని మనసు ఒక ప్రాజెక్ట్ చేసి ప్రభుత్వానికి అందించాడు. అదే మెస్సేజింగ్ సర్వీస్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. అవును. జి.ఎమ్.ఎస్ సృష్టికర్త అతను. కొంతసేపటికి అతను ప్రసంగించటం మొదలుపెట్టాడు. అతని ప్రసంగంలో చోటు చేసుకున్న కొన్ని ఆశక్తికరమైన అంశాలు.. "నాది సాధారణ రైతు కుటుంబం. పుట్తుకతోనే అవిటివాడిగా పుట్టిన నన్ను చిన్నపటి నుండి అలాగే చూసారు. అంటే అపురూపంగా చూసారు అని దాని అర్ధం. వాళ్ళు చూపించిన ఆ అపురూపంలో నేను ఎన్నో చూసాను. నేను ఏమైపోతానో అనే భయం కనిపించేది. వాళ్ళ మాటల్లో నా మీద ప్రేమ ఎలా ఉన్నా జాలి కనిపించేది. వాళ్ళ కళ్ళల్లో నేను ఏమీ చేయలేను అనే నిరాశ కనిపించేది. నన్ను చదువు ఆపేయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయినా కాని నేను వినలేదు. అందరినీ ఇబ్బంది పెట్టాను. నన్ను కాలేజ్ కి తీసుకుని వెళ్ళడానికి వారి పనులు మానాల్సి వచ్చేది. ఇలా ఎన్నో అవస్తలు పడ్డాను. చివరికి ఈరోజు ఇలా ఉన్నాను. ఆరోజు నన్ను చూసి జాలి పడిన కన్నీరు కార్చిన అవే కాళ్ళు ఈరోజు నన్ను చూసి గర్వంతో ఆనందబాష్పాలు కారుస్తున్నాయి. ఎవరో నన్ను చూసి జలి పడాలి అని కొరుకోలేదు. నన్ను చూసి గర్వపడాలి అని కోరుకున్నాను" ఆ మాటలు విన్న నాలో ఏదో తెలియని గర్వం. ఒక గొప్ప వ్యక్తిని కలిసాను అని అనందంతో పొంగిపోయాను.
టీచర్ నేర్పిన పాఠం:
సరిగ్గా పది ఏళ్ళ క్రితం సంగతి ఇది. నేను హై-స్కూల్ విద్యను అభ్యసిస్తున్న రోజుల్లో సురేష్ అనే అధ్యాపకుడు పరిచయం అయ్యారు. ఆయన పుట్టిన మూడు ఏళ్ళ వయసు నుండి పోలియోతో బాధపడుతున్నారు. చాలా తక్కువ రోజుల్లోనే ఒక గురువు - విధ్యార్థి అనే బంధాన్ని దాటి మంచి స్నేహితులం అయ్యాము. అనుకోకుండా ఒక రోజు ఆయన నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆరోజు నేను ఎప్పటికి మర్చిపొలేను. ఆ ఇంటికి వెళ్లిన నేను అక్కడి వాతావరణం చూసి కొన్ని క్షణాలు మూగబోయాను. మనమెక్కడో వింటూ ఉంటాం "సినిమా కష్టాలు" అని. నిజంగా ఆయన కుటుంబాన్ని చూస్తే కంట తడి పెట్టని వాడు ఉండడు. ఏమి చేయలేని స్థితిలో వున్న తండ్రి. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న తల్లి. చదువుకోవాల్సిన వయసులో ఉన్న తమ్ముడు. అది చూసి అయనని నేను అడిగాను. "మీరు డిగ్రీ ఎలా చదివారు??" అని. దానికి ఆయన నుంది వచ్చిన సమాధానం ఇంకా న చెవిలో మారుమ్రోగుతుంది. "చదువంటే నాకు ఇష్టం హర్ష. ఆ ఇష్టంతోనే చదుకున్నాను. నా తల్లిదండ్రులు ఎప్పుడూ నా ఇష్టానికి అడ్డు చెప్పలేదు. నా ఇష్టాలని గౌరవించేవాళ్ళు. నన్ను ప్రోత్సహింహింది నా తల్లే. పగలంతా చదువుకుంటూ, రాత్రంతా భూస్వాముల భుములకి కాపలా కాస్తూ, తెల్లవారు ఝమునే పాలేరుతనం చేస్తూ ఇదిగో ఇలా ఉన్నాను. మనకి ఏదో దేవుడు ఇవ్వలేదు అని బధపడకూడదు హర్ష. మనకు ఇచ్చినదానినే ఆయుధంగా మార్చుకుని లేనిదానిని సంపాదించుకోవాలి. అందరికి అన్నీ ఇచ్చేస్తే మనిషి దేవుదిని లెక్క చేయడు హర్ష. అందుకే ప్రతీ మనిషికి ఏదో ఒక లోపం పెడతాడు. తల్లి తండ్రి లేకపోవటమో, పిల్లలు లేకపోవటమో, డబ్బు లెకపోవటమో, అవయువాలు లేకపోవటమో. కాని అత్యంత బాధాకరం అయినది ఏంటో తెలుసా?? మంచి బుద్ధి, మనసు లేకపోవటం. నిజంగా బాధపడాల్సింది వీళ్ళే"
నిజంగా ఆరోజు ఆ మాటలు నన్ను కదిలించాయి. నిజమైన అవిటితనం అంటే ఏంటో అర్ధం చేసుకున్నాను.
ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్న విషయాలు రెండు...
ఇక్కడ నేను మాట్లాడేది శారీరక అవిటివాళ్ళ గురించి కాదు. మానసికంగా అవిటితనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఉద్ధేసించి మాట్లాడుతున్నా. నిజమైన అవిటితనం అనేది మనసుకి కాని శరీరానికి కాదు. మానసిక శక్తి లేని ప్రతీ వ్యక్తి అవిటివాడే. నేను చేయలేను అనుకుని ముందే ఓడిపోతున్నావు. నీలోని బలహీనతే నిన్ను ఓడిస్తుంది. ఎవరో ఏదో చెప్పారని అది చెయ్యకు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. చేసే పని ఏదైన ఇష్టపడి చెయ్యి. కష్టపడి చేసే పనిలో గెలుపు ఒక్కటే ఉంటుంది కాని ఇష్టపడి చేసే పనిలో గెలుపుతో పాటూ తృప్తి ఉంటుంది. ఒకరితో పోల్చుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు చులకన చేసుకుంటున్నావు అని అర్ధం. నీకు నువ్వే పోటీ. నీతో నువ్వే పోటీపడు. లోపమే లేని మనిషే లేడు. జీవితంలో విజేతగా నిలబడటానికి కావలసింది మానసిక శక్తి (willpower) మత్రమే అని నిరూపించారు ఏంతోమంది. నీలో వున్న లోపాన్ని నీలో కసిని పెంచే పెట్టుబడిగా మలుచుకో. ఇప్పుడు నువ్వు గెలిచేవి ఓడేవి అన్నీ చాలా చిన్నవి. కాబట్టి గెలుపు - ఓటమి గురించి మర్చిపో. అంతిమంగా నువ్వు గెలవాల్సింది జీవితం అనే యుద్ధంలో. చీకటి లేకపొతే వెలుగుకి విలువ లేదు. బాధ అనేది లేకపోతే సంతోషానికి విలువ లేదు. అలాగే ఓటమి అనేది లేకపొతే గెలుపుకి విలువ లేదు. నీకు వచ్చిన ప్రతీ ఓటమిని అంతిమ గెలుపుకి ఒక పునాది రాయిగా మలుచుకో.
"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..." అన్నాడు ఓ మహాకవి.
నీకోసం ఎవ్వరు రారు. ఎవరి జీవితం వాళ్ళది. ఎవరి బ్రతుకుబండిని వాళ్ళు లాగాలి. నీకు నువ్వే. నువ్వు ఒంటరి వాడివే అనుకుని చేసేది చెయ్యి. నీ జీవితం నీది.
ఇక నేను చెప్పాలి అనుకునే రెండవ విషయం.
"మానవసేవే మధవసేవ" అన్నాది మదర్ ధెరెస్సా...
ఈ రోజుల్లో ఎవరి జీవితం వాళ్ళది అయ్యిపోయింది. మానవత్వం అనేది మర్చిపోయి మనుషులమనే అర్ధాన్నే మార్చేస్తున్నాం. యంత్రాల్లాగ మారిపోతున్నాం. సహాయం అనేదానికి అర్ధం పుస్తకాల్లో చదువుకుని వెతుక్కోవాల్సిన స్థితికి దిగజారిపోతున్నాం. అసలు మన తరువాతి తరం వాళ్ళకి సహాయం అనే పదమే కనపడకుండా చేసేస్తున్నాం.
తన స్నేహితుడి కోసం అంధుడు అయినా కూడా సహాయం చేసిన సురేష్ ప్రజాపతిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి???
అంధుదు అయిన కూడా తనలాంటి వికలాంగులు కోసం ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఆషిష్ గోయల్ ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి???
చేతనైన సహాయం చేయడనికి కూడా చేతులు రావడం లేదు మనకి.
ఇదే నిజమైన అవిటితనం అంటే. కష్టకాలంలో ఉన్న ఒక మనిషిని ఆదుకోలేకపోయిన ప్రతీ మనిషి అవిటివాడే. వాళ్ళ మనసులు కుంటిపడిపోయాయి. మనలో 98% మంది మానవత్వంగా వికలంగులము అయ్యిపోయాము. నివారించే మందేలేని మానసిక రోగంతో బాధపడుతున్నాము. అందుకే శారీరక వికలాంగులుని చూసి బాధపడటం మానేసాను. నిజంగా మనం చూసి బాధపడాల్సింది వీళ్లని. అందుకే సహాయం చేసే మనస్తత్వం లేని ప్రతీ వికలాంగుడిని చూసి నేను జాలి పడతాను.
సేవ చేయటానికి ఎన్నో సంస్థలు పుట్టుకుని వచ్చాయి. ఎన్నో సంస్థలు ఎంతో చక్కగా సేవా కర్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరెన్నో సంస్థలు మొదట్లో బాగానే చేసినా మెల్లిగా అవినీతిలో కూరుకుపోయాయి. ఇక్కడ సేవ అనేది సంస్థకి సంభందించినది కాదు. ప్రతీ వ్యక్తిలోనూ సేవ చేయాలి అనే ధృక్పతం కలగాలి. అవిటితనంతో కుంటిపడిపోయిన మన మనసులు మారాలి. వ్యక్తిగతంగా అయినా సరే సేవ చేసే గొప్ప మనసు మనలో రావాలి.
అందుకే నా దృష్టిలో శారీరక లోపాలు ఉన్న ఏ ఒక్కరూ అవిటివారు కారు...
అనుకున్నది చేయడానికి కావల్సిన మానసిక శక్తి (willpower) లేని ప్రతీ వ్యక్తీ అవిటివాడే...
ఆపదలో "అన్నా" అని సహాయం కోరి వచ్చిన వాళ్ళని పట్టించుకోని ప్రతీ ఒక్కడూ అవిటివాడే...
ఇప్పటి వరకు నేను చెప్పింది అంతా ఒక్క మాటలో ముగిస్తాను...
"ఒకరి అవిటితనం ని బాగుచేయగలిగే శక్తి నీకు లేనప్పుడు... అతనిని చూసి జాలి పడే హక్కు కూడా నీకు లేదు..
కాని అతని భవిష్యత్తుకి ఉడుత సహాయం చేసి గోరంత ప్రోత్సాహం ఇచ్చే మనసు నీకు ఉంటే... ఎన్నో శిఖరాలను దాటే కొండంత బలం అతనిలో ఉంది.."
This is My theory.., And it is called to be...
HARSHAS THEORY
Note: Please feel free to give your comments/feedback about the post / blog here itself. Also tweet this or share this if you like this theory via twitter or facebook respectively.
- Harsha
ముంజేతులు లేవు
ముంజేతులు లేవు, ఐనా స్పిన్ బౌలింగ్‌లో ఘనాపాటి ఈ బాలుడు -వీడియో లింక్
బ్రిటన్‌కి చెందిన కీరన్ టంగ్-గిబ్స్ కి పుట్టుకతోనే ముంజేతులు లేవు. ఒక చేతికి మోచేయి తర్వాత కొద్ది భాగం ఉండగా, రెండో చేతికి మోచేయి కూడా లేదు. అయినా ఒక చేతికి ఉన్న మోచేయిలో క్రికెట్ బంతిని ఇరికించుకుని ఖచ్చితంగా లైన్ అండ్ లెంగ్త్ ప్రకారం స్పిన్ ని జతచేసి మరి బంతులు విసురుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అవే చేతుల్తో బ్యాటింగ్ చేయగలుగుతూ అంగ వైకల్యాన్ని గేలి చేస్తున్నాడు. బ్రిటన్ దేశానికి ఆడాలని కలలు గంటున్న ఈ బాలుడు బౌలింగ్ చేస్తున్నప్పుడు గానీ, బ్యాటింగ్ చేస్తున్నపుడు గానీ ఎటువంటి కృత్రిమ అవయవాలను ఉపయోగించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చేత ఈ బాలుడు గుర్తింపుని సాధించాడు. అంగవికలుర ఆటల పోటీలలో భవిష్యత్తులో స్టార్ ఆటగాడిగా మారగలడని ఆ బోర్డు కీరన్‌ని గుర్తించింది. ఇపుడా బాలుడు ‘ఏస్ట్‌వుడ్ బ్యాంక్ క్లబ్’ తరపున ఆడుతున్నాడు. క్రమం తప్పకుండా వార్‌విక్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ లో శిక్షణకు హాజరవుతున్నాడు. ఈ బాలుడి బౌలింగ్, బ్యాటింగ్ విన్యాసాలను చూపే కొద్ది సెకన్ల వీడియోను సన్ వెబ్ సైట్ ప్రచురించింది. దానిని ఇక్కడ చూడవచ్చు.
“ఆట పట్ల కీరన్ చాలా ఇష్టాన్ని కనబరుస్తున్నాడు. క్రికెట్ ఆటపైనే అతని మనసంతా. జీవితంలో విజయవంతం కావడానికి అదే కదా కావలసింది. రాను రానూ పరిణతి చెందుతున్నాడు” అని కీరన్ తల్లి కేరీ గిబ్స్ మురిపెంగా చెబుతోంది. 7 సంవత్సరాల వయసులో సెలవుల్లో బీచ్ క్రికెట్ ఆడుతుండగా బాలుడి ప్రతిభను గుర్తించినట్లు అతని తల్లిదండ్రులు చెప్పారు. ‘వెల్‌ఛైల్డ్స్ హెల్పింగ్ హేండ్స్’ అనే సంస్ధకి చెందిన వాలంటీర్లు బాలుడి ఇంటి వెనక ఉన్న ఖాళీ స్ధలాన్ని బాగు చేసి క్రికెట్ నెట్స్ ఏర్పరిచి ఆటను ఇంటివద్ద కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
వైకల్యం వైఫల్యం కాదు
ప్రపంచంలో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైన వాళ్లే ఉండరు. తెలివికి, తెలివి తక్కువ తనానికి మధ్యనే జీవితం. చేయడానికి, చేయలేకపోవడానికి మధ్యలోనే మనం. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేకపొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వ సాధారణమైపోయింది. అయితే వికలాంగులను అర్థం చేసుకోడానికి ఐరిస్ అనే ఆవిడ ఏమంటారంటే ‘‘కూర్చున్న చోటి నుండి లేవలేకపోవడం శారీరక సమస్య ఐతే, అలా లేవలేక పోవడానికి సరైన సహకారాన్ని అందించకపోవడమే అసలైన వైకల్యం’’ అంటారు. అందుకే సమాజంలో ఎవరు ఏ పని చేసినా, చేయలేకపోయినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. ఈ వికలాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా మనం వారికి ఎంతవరకు సహాయపడుతున్నాం. ప్రభుత్వాలు వారి ఏ విధమైన న్యాయం చేకూర్చుతున్నాయి వంటి పలు అంశాలను తెలుసుకుందాం...
సాధ్యమైనంత వరకు మనం వికలాంగు లు అనే పదం మన వాడుక భాషలో వాడడం లేదు. ఇంగ్లీషులో మాత్రం హేన్డీ క్యాప్డ్, డిజేబుల్డ్, ఫిజికల్లీ చాలెన్జ్‌డ్ అని రకర కాల పదాలలో వాడుతూ ఉంటాం. కాని చాలామందికి ఎందుకు ఏ పదాన్ని వాడుతు న్నామో తెలియదు. అలాంటి సమయాల్లో ఒక్కోసారి మంచి ఉద్దేశ్యాన్ని చెడుగాను, చెడు ఉద్దేశ్యం మంచిగాను చెప్పే ప్రమాదం వుంది. కాబట్టి ఈ పరిస్థితి నుండి బయటపడే ప్రయ త్నానికి ఈరోజే నాంది పలుకుదాం.
వికలాంగులకు సహకారం, ప్రోత్సాహం అం దిస్తే... ఎవరైనా ఎంత ముందుకైనా వెళ్ళగల రు అనే సత్యాన్ని మనమంతా తెలుసుకోవాలి.
నిజమైన సామర్థ్యం గురించి చర్చించుకుంటే ఎవరు ఎవరినీ తక్కువగా చూడలేం. అలా అర్ధం చేసుకోలేక కొన్ని తరాలుగా కొంత మంది పై నిర్లక్ష్యంగా సామర్థ్యం అని చెప్పి, చేయగలిగిన వాళ్ళను కూడా అసమర్థులుగా మార్చిన సమాజం నుండి బయటికి వచ్చి అందరినీ అర్థం చేసుకొనే సమాజం వైపు మన పెద్ద వాళ్లు ప్రారభించిన అడుగులు ముందుకు తీసుకు వెల్లడానికి ఈరోజే నిర్ణయం తీసుకుందాం.
1992 లో యునైటెడ్ నేషన్స్ వికలాంగుల సహాయార్థం వికలాంగుల దినోత్సవాన్ని ప్రా రంభించింది. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తం గా జరుపుకుంటున్నాం. వికలాంగులు మాన సికంగా ఆధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలి. వికలాం గులకు ఈ రోజు క్రీడలను నిర్విహస్తున్నారు. వికలాంగ క్రీడాకారులు సాధారణ క్రీడాకా రులకు ఏమాత్రం తీసిపోకుండా ఆత్మస్థైర్యం తో క్రీడలలో పాల్గొనాలి.
వికలాంగుల పట్ల మన బాధ్యత!
పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాం. మరి ఈరోజు (డిసెంబరు) వికలాంగుల గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాం.
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశం లోని వికలాంగుల సంఖ్య 2 కోట్ల 19 లక్షలు. మొత్తం జనాభాలో 2.1 శాతం వికలాంగులు న్నారు. వికలాంగులు తమ దైనందిన కార్య క్రమాలు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదు ర్కొనువారు, వికలాంగులను ప్రస్తుతం 11 రకాలుగా వర్గీకరించవచ్చు. పూర్తి అంధత్వం, పాక్షిక అంధత్వం, చెవిటి మూగ, భాషణలో పం, శారీరక వికలాంగులు, బుద్ధిమాద్యం, కండరాల క్షీణత, బహుళ వైకల్యం, అభ్యసన లోపం, ఆటోస్టిక్ స్పెక్ట్రం డిజార్డర్. 1981 ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది.
వికలాంగుల కోసం పార్లమెంట్‌లో వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 1995 చేయబడింది. ఇది 1996 ఫిబ్రవరి 7 నుండి అమల్లోకి వచ్చింది. వికలాంగులు జిల్లా మెడికల్ బోర్డు వారిచే జా రి చేయబడిన వికలాంగ ధ్రువపత్రం తీసుకో వాలి. ప్రభుత్వం విద్యాపరంగా అందిస్తున్న సేవలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ర్యాంపు సౌకర్యం, వికలాంగులందరికి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, వికలాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఇతరుల సహాయంతో పాఠ శాలకు వచ్చే వారికి ఎస్కార్ అలవెన్సు, తీవ్ర వికలాంగత్వంతో ఉన్న వికలాంగులకు ఇంటి వద్ద విద్య బోధన, వికలాంగులకు అవసరమై న పరికారాలు. ఉదాహరణకు వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ పలకలు ఉచితంగా పంపిణీ.
వికలాంగులకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లింపులో మినహాయింపు, బధిరులు, అంధులకు పాస్ మార్కులు 20 మాత్రమే. ఇతర సదుపాయా లు ఇంటి నిర్మాణం కోసం రుణం, ఇంటి నిర్మాణం కోసం ఖాళీ స్థలం పంపిణీ, 50 శాతం రాయితీతో బస్‌పాస్ సౌకర్యం, 75 శాతం రాయితీతో రైల్ పాస్ సౌకర్యం, ఉద్యో గాలలో 3 శాతం రిజర్వేషన్, వివాహ ప్రోత్సా హక బహుమతులు. వికలాంగుల కోసం ప్రభుత్వ ఉత్తర్వులు జిఓ ఎంఎస్ నెంబర్ 198 ఎడ్యూకేషన్, బధిరులకు ఒకే భాషను అభ్యసించును, జిఓ ఎంఎస్ నంబర్ 33 ఎడ్యుకేషన్ 19-3-2001 పరీక్ష ఫీజు నుండి మినహాయింపు, జిఓ ఎం.ఎస్. నంబర్ 42 - 19-10-2011 ఉద్యోగాలలో ప్రమోషన్లకు రిజర్వేషన్లు.
వికలాంగులకు తక్షణమే అవసరమైనవి బధిరులకు ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల, అన్ని ప్రభుత్వ కా ర్యాలయాలకు, ప్రముఖ హాస్టళ్ళకు, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు ర్యాంపు సౌక ర్యం, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా అన్ని పోలీస్ స్టేషన్, కోర్టులలో సంజ్ఞల భాష, ట్రాన్స్‌లేటర్‌ల నియామకం, నిరుపేద వికలాంగులకు ఎటువంటి నిబంధన లు లేంకుడా పావలా వడ్డీ రుణాలు మంజూ రు, ప్రతి టీవీ ఛానల్‌లో బధిరులకు సైగల భాషలో వార్తలను ప్రసారం చేయాలి.
వికలాంగులు - ప్రభుత్వ సంక్షేమ పథకాలు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగుల పునరా వసం, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాల ను అమలు చేస్తోంది. 1995వ సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేయబడి 7-2-96వ తేదీన అమలులోకి తేబడిన విక లాంగుల సమాన అవకాశాలు, హక్కుల పరి రక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం చట్టం, 1995 ఒకటవ చాప్టర్‌లో వికలాంగుల నిర్వచనం ఈ విధంగా ఇవ్వబడి అమలులో ఉంది.
ఎ) అంధత్వం, తక్కువ కంటిచూపు: ఈ క్రింద తెలిపిన పరిస్థితులకు లోనైన ఏ వ్యక్తి అయిన ఈ పరిధిలోకి వస్తాడు.
1) పూర్తిగా చూపు కనిపించకపోవడం లేదా
2) కళ్ళద్దాలు ధరించినప్పటికీ కొంచెం మెరు గ్గా ఉండే కంటిచూపు 6/60 లేదా 20/200 (స్నెలెన్) మించినట్టయితే లేదా,
3) కంటిచూపు పరిధి 20 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, తక్కువ కంటిచూపు కలిగిన వ్యక్తి అంటే దృష్టిదోషాన్ని చికిత్సతో సరిచేసిన అనంతరం కూడా ఆ వ్య క్తి దృష్టిలోపం కలిగి ఉండటం, అయితే తగిన సహకార సాధనంతో ఒక లక్ష్యాన్ని నెరవేర్చ డానికి లేదా ప్రణాళిక రూపందించడానికి అవసరమైన దృష్టి, శక్తి కలిగి వున్నప్పటికి తక్కువ కంటిచూపు కలిగి వ్యక్తిగానే పరిగణించబడుతుంది.
బి) కుష్ఠు వ్యాధిగ్రస్తులు - వ్యాధి నయమయినవారు: కుష్ఠువ్యాధి నయమయిన వ్యక్తి అంటే కుష్ఠు వ్యాధి నయమైన తర్వాత ఈ క్రింది కారణాలతో బాధపడే వ్యక్తి.
1) అరికాళ్ళు, అరిచేతులు, కంటిలో పూర్తిగా గాని పాక్షికంగా కాని స్పర్శ లేకుండుట, కంటిలో పాక్షికంగా కాని, పూర్తిగా కాని చచ్చుబడినట్లుగా బయటకు తెలియని వైకల్యం లేకపోవుట.
2) అంగవైకల్యముతో చచ్చుబడిన చేతులు, కాళ్ళు కదిలిక కలిగి, దైనందిత కార్యకలా పాలు నిర్వహించగలగడం.
3) పూర్తి అంగవైకల్యం, వయస్సు పై బడిన కొద్దీ, దైనందిన కార్యక్రమాల్లో మార్పు కాని, వృత్తిలో ప్రావీణ్యతతో పాల్గొన లేకపోవుట.
సి) వినికిడి లోపం: వినికిడి లోపం అంటే సంభాషణల తరంగాల పరిధిలో చెవికి సంబంధించి 60 డిసిబుల్స్ లేదా అంతకంటే ఎక్కువ వినికిడిని కోల్పోవడం.
డి) కదలిక లేకపోవడం లేదా చలనశక్తికి సంబంధించిన వికలాంగత: చలనశక్తి వైక ల్యం అంటే ఎముకలు, కీళ్ళు, కండరాలు వైక ల్యం వల్ల చలనాంగముల కదలిక తగినంతగా లేకపోవడం లేదా ఏ రకమైన సెరిబ్రల్ పాల్సీ (మెదడుకు పక్షవాతం) అయినా.
ఇ) బుద్ధి మాంద్యం: మానసిక వికలంగత అంటే బుద్ధి మాంద్యతే కాకుండా మానసిక ఇతర మానసిక అస్వస్తత, బుద్ధిమాంద్యం అంటే ఒక వ్యక్తి మానసికంగా అసంపూర్తిగా ఎదగడం లేదా ఎదుగుదల ఆగిపోవడంతో ప్రత్యేకంగా అతి తక్కువ తెలివితేటలు కలిగి ఉండటం.
వికలాంగత గల వ్యక్తి అంటే ఒక వ్యక్తి 40 శాతానికి తక్కువ లేకుండా వైకల్యం కలిగి ఉన్నట్లుగా మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం. అయితే మెడికల్ బోర్డు ప్రతినెల నిర్ణీత సమ యాల్లో జిల్లా వైద్యశాలలో సమావేశమై సర్టిఫి కెట్లు ఉచితంగా అందజేస్తుంది.
వికలాంగుల పునరావాసం నిమిత్తంఆంధ్రప్రదే శ్ ప్రభుత్వంచే 1981 సం ఆంధ్రప్రదేశ్ విక లాంగుల సహకార సంస్థ. 1983 సంవత్సరం వికలాంగుల సంక్షేమ శాఖ స్థాపించడం జరి గింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమ లు పరిచే నిమిత్తం సహాయ సంచాలకుల కా ర్యాలయాలు పనిచేస్తున్నవి. వికలాంగుల సహకార సంస్థ కార్యకలాపాలు పదవిరీత్యా జాయింటు కలెక్టరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా, సహాయ సంచాలకులు పదవిరీత్యా విక లాంగుల సహకార సంస్థ జిల్లా మేనేజరుగా వ్యవహరిస్తారు. మొత్తం మీద జిల్లా కలెక్టరు అధికార పర్యవేక్షణలో వికలాంగు సంక్షే మం కొరకు నిర్దేశించబడిన పునరావాస కార్యక్రమాలు అమలుపరచబడు తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు పునరావాసం, అభివృద్ధి కోసం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా విభజించబడినవి.
విద్య...
అంధ, బధిర, మూగ బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలకు నడుపబడుచున్నవి. వికలాంగ లు సంక్షేమ శాఖ, ప్రాథమిక విద్యాశాఖ ఆధ్వ ర్యంలో ఈ పాఠశాలలు నడుపబడుచున్నవి. భారత ప్రభుత్వం ద్వారా సహాయం పొంది, పొందుండా కూడా ఉన్న ప్రభుత్వేతర సంస్థలు విద్యారంగంలో తమ వంతు సహాయం అంది స్తున్నవి. ప్రత్యేక పాఠశాలల్లో ప్రవేశ నిమిత్తం ఆయా పాఠశాల ప్రిన్సిపాల్స్ / హెడ్ మాస్టర్ల ను సంప్రదించాలి. ప్రతి సంవత్సరం మే నెల నుంచే తమ, తమ పిల్లలను చేర్పించడానికి చ ర్యలు తీసుకోవాలి. అంగవైకల్య శా తం, తల్లి దండ్రుల ఆదాయ పరిమితికి లోబడి పాఠశా ల స్క్రీనింగ్ కమిటీ విద్యార్థులను ఎంపిక చే స్తుంది.
ఇది గాక విద్యాశాఖ ద్వారా సమీకృత విద్యా విధానం కూడ ప్రవేశపెట్టబడినది. ప్రతి జిల్లాలో బధిరులకు, అంధులైన విద్యార్థుల కోసం ఒక్కొక్క తరగతి గుర్తించిన పాఠశాలలో ప్రారం భించబడినది. అందరి కీ విద్య లక్ష్యంతో అవ సరమైన ప్రతి చోట ఇటు వంటి విద్యా విధా నం అమలుకు విద్యా శాఖ దశల వారీగా చర్యలు తీసుకుంటున్నది.
విద్యాపరంగా ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు...
ఎ) అన్ని రకాల విద్యా సంస్థలలో ప్రవేశానికి వికలాంగులయిన విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించబడినది. విశ్వవిద్యాలయాలు, సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు వగైరాలతో సహా ప్రతి యొక్క వికలాంగుడు తమకు అన్ని టా సమాన అవకాశాలు, సంఘంలో ప్రత్యే కించి ప్రభుత్వ యాజమాన్య సంస్థలో కల్పిం చబడాలి అనే ప్రాతపదిక గుర్తుంచుకొని జీవి తంలో వారి హక్కుల సాధనకు ముందుకు పోవాలి. డాక్టరు కోర్సులలో 0.25% ఇంజనీ రింగు కోర్సులలో 0.50% ప్రవేశంలో రిజర్వేషను కలదు.
బి) వికలాంగుల ఆశ్రమ పాఠశాలలే కాకుం డా, వసతి గృహాలలో కూడా ఉండి చదువుకొ నేందుకు వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా 3 అవకాశాలు కల్పించబడినవి. వికలాంగులైన బాలబాలికలు తమ దగ్గరలో గల రాష్ట్ర సంక్షే మ శాఖ ఏ వసతి గృహంలోనయినా వారి నిబంధనలకు లోబడి ప్రవేశం పొందవచ్చు.
సి) ప్రభుత్వ గుర్తింపు, సహాయం పొందిన విద్యాసంస్థలో చదివే వికలాంగ విద్యార్థులకు వారి విద్యా స్థాయిననుసరించి ఉపకార వేతనం మంజూరు చేయబడుతుంది. చలన సంబంధమైన వైకల్యం కల వారికి ప్రయాణపు అలవెన్స్, చలన పరికరాలను నిరంతరం ఉపయోగంలో ఉంచేందుకు (మెయింటెనెన్స్ అలవెన్సు), అంధులకు రీడర్స్ అలవెన్స్ మంజూరు చేయబడతాయి.
డి) ప్రిమెట్రిక్ (1 నుంచి 8 తరగతి వరకు) పోస్టు మెట్రిక్ (9వ తరగతి నుంచి ఆపైన) చదువులకు చెల్లించే ట్యూషన్ ఫీజులు వసతి గృహంలోని విద్యార్థులకు కొన్ని పరిమితుల కు లోబడి చెల్లించబడతాయి.
ఇ) మానిసిక వికలాంగులకు ఉపకార వేతనాలు చెల్లించబడతాయి.
ఎఫ్) మెట్రిక్ పూర్వపు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచిత సరఫరా (1 నుంచి 10వ తరగతి వరకు) (ప్రస్తుతం విద్యాశాఖ ద్వారా సరఫరా చేయబడుతున్నవి) అంధ విద్యార్థుల కు రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా బ్రెయిలీలో పాఠ్యపుస్తకాలు ముద్రించి సరఫరా చేయబడుచున్నవి.
జి) రీసెర్చి స్కాలర్లుకు ఉపకారవేతనాలు చెల్లించబడతాయి.
హెచ్) ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకారం సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు టేప్ రికార్డులు, క్యాసెట్‌లు చదువుకొనే నిమిత్తం ఉచిత సరఫరా.
ఐ) అంధులు, చలన సంబంధమైన వైకల్యం కలవారికి పబ్లిక్ పరీక్షల సమయంలో 30 ని అదనంగా అనుమతిస్తారు.
జె) బధిర విద్యార్థులకు పబ్లిక్ 10వ తరగతిలో రెండు లాంగ్వేజెస్ వ్రాయకుండా ఇంటర్‌లో ఇంగ్లీషు లాంగ్వేజి వ్రాయకుండా మినహాయింపు.
కె) వికలాంగులైన 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు రాయితీ.
ఎల్) అంధ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల సమయంలో స్కైబ్‌ని ఇస్తారు.
శిక్షణ...
వికలాంగుల కోసం వికలాంగుల సహకార సంస్థ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిం చబడుచుండేవి. ప్రస్తుత తరుణంలో పారిశ్రా మిక శిక్షణ సంస్థలు, బీఈడీ, టి.టి.సి, కో ర్సులలో వికలాంగులకు ప్రవేశానికి రిజర్వేష న్లు ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులలో ట్యూష న్ ఫీజు తిరిగి ఇచ్చే పథకం ఉన్నది. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ సంస్థలు 1995 విక లాంగులకు సమాన అవకాశాలు. సంపూర్ణ భాగస్వామ్యం చట్టం అనుసరించి ఎంపిక చేసిన ఐ.టి.ఐలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పిం చింది. అయితే ప్రభుత్వం, మారుతున్న పరిస్థి తులలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్‌లో శిక్షణలాంటి క్రొత్త కోర్సులలో ప్రవేశానికి చర్యలు తీసుకొంటుంది. ఐ.టి.ఐ సీట్లలో 2 శాతం, టి.టి.సి.లో 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అన్ని కోర్సులలో రిజర్వేషన్లు వికలాం గులకు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ. కాలానుగుణంగా సమాన అవకాశాలు, ప్రత్యేక అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఏ అంశాన్నయినా ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చు.
ఉపాధి అవకాశాలు...
వికలాంగుల పునరావాసం నిమిత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం పోస్టులు వికలాంగులకు కేటాయించబడినవి. (1 శాతం అంధులకు, 6వ రోష్టరు పాయింటు, 1 శాతం మూగ బధిరులకు, 31వ రోష్టరు పాయింటు, 1 శాతం చలన సంబంధమైన అంగవైకల్యం గల వారికి 56వ రోష్టరు పాయింటు) వికలాంగుల కొరకు గుర్తించిన పోస్టులు 3 సంల వరకు ఖాళీగా ఉంచాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వయో పరిమితి అర్హత, వికలాంగుల కొరకు 10 సంవత్సరాలు సడలించారు.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో వికలాం గులకు కేటాయించబడిన ఉద్యోగాల నియా మకం ఆ పోస్టు స్థాయిననుసరించి ఉపాధి కల్పన కార్యలయం ద్వారా గాని, పేపరు ప్రక టనలు, సర్వీస్ కమీషను ద్వారా గాని జరుగు తాయి. లేజి సర్వీసు మిషన్ నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, అభ్యర్థికి రూ. 180/- పరీక్ష రుసుము ఇవ్వబడుతుం ది. ఆదాయ పరిమితి సం రూ. 3600/-
స్వయం ఉపాధి...
అందరికి ఉద్యోగాలు లభించవు. కానీ జీవ నం సాగించాలి. అందుచేత ప్రజల విస్తృత ప్రయోజనాలు, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయాణం సాగించేటట్లు చేయటానికి స్వ యం ఉపాధి పథకాలు ప్రవేశపెట్ట బడినవి. స్వయం ఉపాధికి నిర్దేశించిన అన్ని గ్రామీణా భివృద్ధి, పట్టణాభివృద్ధి పథకాలలో వికలాంగు లకు 3 శాతం కేటాయించారు. అలాగే సి.యం.ఇ.వై., పి.యం.ఆర్.వై. అన్ని బలహీ న వర్గాల ఆర్థిక సహాయ సంస్థలలో వికలాం గులకు ప్రత్యేక కేటాయింపు ఉంది.
యన్.హెచ్.యఫ్.డి.సి. ద్వారా బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వమే స్వయం ఉపాధికి అప్పులిచ్చే పథకం ప్రవేశపె ట్టింది.
వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా సబ్సి బీ యిచ్చే పథకం అమలులో ఉంది. దీని ద్వా రా చిన్న, చిన్న వ్యాపారాలకు బ్యాంకులు అప్పు మంజూరు పత్రం ఇవ్వనిచో ప్రత్యేక పరిస్థితులలో నేరుగా రూ.3,000 మంజూరు చేయవచ్చు. అయితే వికలాంగులు స్వయం ఉపాధిపథకం కోరే ముందు ఆ పథకం గురిం చి సరైన అవగాహన ఉండాలి. ఆ ఉపాధి పథ కం వివరాలు పూర్తిగా తెలుసుకొని అందులో అవసరమయిన శిక్షణ పొంది ఉంటే ఆ పథకం సద్వినియోగానికి తోడ్పడుతుంది.
ఇవి గాక అనేక ఉపాధి పథకాలు రాష్ట్ర ప్రభుత్వంచే అమలు చేయబడుతున్నవి.
ఎ) వికలాంగులయినటువంటి లా కోర్సు చదివిన పట్టభద్రులు లా పుస్తకాలు కొనుగోలు, ఎన్‌రోల్‌మెంటు ఫీజు నిమిత్తం రూ. 1,700 మంజూరు అవుతున్నాయి.
బి) సివిల్ సప్లయిస్ వారి రేషన్ షాపులలో 3 శాతం వికలాంగుల నిమిత్తం కేటాయించాలి.
సి) స్టాంపుల అమ్మకం వ్యాపారం మంజూరు చేయునపుడు వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
డి) ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సహాయ సంస్థ అంద చేసిన రుణాలలో వికలాంగులైన లబ్దిదారుల నిమిత్తం రూ. 50,000 వరకు తక్కువ వడ్డీతో అప్పు మంజూరు చేయబడుతుంది.
విద్య, చలనన సంబంధమైన పరికరములు సరఫరా...
వికలాంగుల పునరావాసానికి, చలనం అతి ముఖ్యమైన అంశం, వారు పరికరాల సహా యంతో ఇతర మార్గాల ద్వారా క్రొత్త క్రొత్త ప్రాంతాలకు వెళుతున్నట్లయితే ఎన్నో విషయాలు తెలుసుకోవడం, విద్యసభ్యసించ డం ద్వారా వారి స్వయం పునరావసాన్ని మా ర్గం సుగమం చేసుకుంటారు. అందుచేత చలన పరికరాలు వికలాంగుల పునరావసం లో విడదీయలేని అంశం.
ఈ పరికరాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా సరఫరా చేయబడుచున్నవి. అయితే రాష్ట్ర ప్రభుత్వ కూడా ముందుకు వచ్చి, వికలాంగు లందరికీ చలన పరికరాలు అందచేయాలనే ఉద్దేశ్యంతో వారి అవసరాలను గుర్తించి దశల వారీగా వాటిని తీర్చే ప్రయత్నం చేయుచున్న ది. ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ ఈ చలన పరికరాలు అందచేసే బాధ్యత తీసు కొన్నది. వికలాంగుల సహకార సంస్థ పరిధి తో గల మూడు చక్రాల బళ్లు, సరఫరా కేం ద్రాలు, కృత్తిమ అవయవములు, కాలిపర్లు, వినికిడి యంత్రాల సరఫరా కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం అమలు పరచబడుతోంది. అంధులకు చేతికర్రలు కాసెట్స్, టేపురికార్డర్స్ బ్రెయిలీ పలకలు, టైపురైటర్లు, ఇతర విద్యసభ్యసించేందుకు అవసరమైన అన్ని పరికరాలను సరఫరా చేస్తుంది. పోలియో సోకిన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయబడుచున్నది.
సాంఘిక భద్రత...
వికలాంగుల కొంత బలహీనులు కావటం వలన వారికి సాంఘిక భద్రత కల్పించే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు పరుస్తోంది.
ఎ) వికలాంగులకు పెన్షన్ నెలకు రూ.500/-
బి) సకలాంగుల, వికలాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే రూ.10,000/-లు ప్రోత్సాహక బహుమతి.
సి) బలహీనవర్గాల ఇండ్ల కేటాయింపులో లబ్దిదారుల వాటా వికలాంగులు 3 వాయిదాలలో కట్టే సౌకర్యం.
డి) ఎ.పి. హౌసింగు బోర్డు ద్వారా కట్టి మంజూరయ్యే ఇళ్ళలో 2 శాతం వికలాంగులకు కేటాయింపు.
వైకల్యం నుండి జీవన సాఫల్యంవైపు
apr - Wed, 28 Nov 2012, IST
- సృజనకు ఆకాశమే హద్దని నిరూపిస్తున్న నాట్యగురువు
- మానసిక, శారీరక వికలురకు నృత్యంలో శిక్షణ
- కళకు వైకల్యం అడ్డురాదని ప్రపంచానికి చాటిచెప్పిన అనన్య కృషి
- దేశాధ్యక్షుల చేత సైతం కంటతడి పెట్టించిన కళాసృష్టి
మానసిక అంగవైకల్యం - సమాజానికి, ప్రపంచానికి కాస్త దూరంగా ఉండే జీవితాలు వీరివి. ఇలాంటి వారికి నృత్యంలో శిక్షణనిచ్చి కళాకారులుగా ప్రపంచానికి పరిచయం చేయవచ్చనే ఆలోచనలోనే పదునైన సృజనాత్మకత ఉంది. అంతేనా ఆ ఆలోచనలో అంతులేని ఓరుð, సహనం, మానవత, సవాళ్లను ఎదుర్కొనే తత్వం ఇవన్నీ మిళితమై ఉండాలి. అపðడే అది సాధ్యమవుతుంది. మెంటల్లీ డిజేబుల్డ్ వారే కాక శారీరక అంగవైకల్యం ఉన్న పిల్లలు, యువతీయువకులు కూడా పాషా నేతృత్వంలో నృత్య కళాకారులుగా తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నారు. వైకల్యం అనే ముద్ర నుండి కృషి ఉంటే ఏదైనా సాకల్యమే- అనే దిశగా వారిని నడిపిస్తున్న సయ్యద్ సలావుద్దీన్ పాషా మరెంత మందికో ఒక కొత్త మార్గాన్ని చూపారనవచ్చు. చక్రాల కుర్చీలోంచి కిందకు దిగలేని వ్యక్తి అద్భుతమైన నాట్య విన్యాసం ప్రదర్శిస్తే చూసేవారు విభ్రాంతికి గురవటం ఖాయం. అక్కడ మరో కొత్త లోకం ఆవిష్కృతం అవుతుంది. నాట్యంతో పాటు పోటీపడుతున్న సామర్ధ్యమూ, ఆత్మవిశ్వాసంతో వీక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తారు వారు. డిజేబుల్డ్ డ్యాన్స్ థియేటర్ సంస్థని స్థాపించివేలాదిమంది మానసిక, శారీరక అంగవికలురని నృత్య కళాకారులుగా తీర్చిదిద్దిన పాషాని ఇటీవల హైదరాబాదులో ప్రదర్శన ఇచ్చిన సందర్భంగా ఆంధ్రప్రభ లైఫ్ పలకరించింది ఆ విశేషాలు
మీరు నృత్యం పట్ల ఎలా ఆకర్షితులు అయ్యారు?
చిన్నప్పటినుంచే నాకు పాటలన్నా, సంగీతమన్నా, మనసుని పరవశింపచేసే నృత్యమన్నా చాలా ఇష్టం. ఆ క్రమంలోనే నృత్యం నేర్చుకోవాలనే తపన కలిగింది. నా తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో నృత్యం నేర్చుకోగలిగాను.
మీరు ఏఏ నృత్యాలు నేర్చుకున్నారు? వైకల్యం ఉన్నవారిని నృత్య కళాకారులుగా తీర్చిదిద్దాలని ఎందుకు అనిపించింది?
భారతీయ నృత్య రీతులపై అత్యంత ఆసక్తి ఉండటంతో బెంగళూరులోని నాట్యగురు మాయారావు వద్ద కథక్ నృత్యాన్ని నేర్చుకునే అదృష్టం కలిగింది. అలాగే చెన్నైలోని నాట్యగురు కిట్టప్ప పిళ్లౖెె వద్ద భరతనాట్యాన్ని, కూచిపూడిని నేర్చుకున్నా. ముస్లిం మతంలో, ఆ మతం చెప్పే మానవతా విలువలను కచ్ఛితంగా పాటించే కుటుంబంలో పుట్టటం వలన ఇలాంటి ఆశయం వైపు మొగ్గు చూపాను. వికలాంగులు, మానసిక వికలాంగులను చూసినపుడు వారికి కావలసింది కేవలం జాలి కాదని కాస్త చేయూతనిస్తే వారిలో ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలపవచ్చని అనిపించేది. ఈ ఆలోచనే వీల్ ఛైర్ నృత్య రూపకల్పన వైపు అడుగులు వెెయించింది.
వీల్ ఛైర్ డ్యాన్సు ఎలా చేస్తారు?
సాధారణ నృత్యరీతులకు భిన్నంగా ఉంటుంది ఇది. ఇందులో భారతీయ నృత్యరీతులతో పాటు సూఫీ నాట్యం, సంగీతం, భారతీయ సాహిత్య సంపద కూడా సమపాళ్లలో మేళవించి ఉంటాయి. మా పూర్వీకులు మైసూరు మహారాజుల ఆస్థానంలో వైద్యులుగా పనిచేసి గౌరవం పొందినవారు. అందుకే నాపై నృత్య కళలతో పాటు యోగా ప్రభావం కూడా ఉంది. యోగాని కూడా నా నృత్యరీతుల్లో భాగం చేశాను. కుర్చీతో నృత్యం చేసేటపుడు క ళాకారులు గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో కుర్చీలతోనే పరుగులు తీస్తారు. అలాగే చక్కని నటనని కూడా ప్రదర్శిస్తారు. చూస్తున్న ప్రేక్షకులు ఆ సమయంలో తమనితాము మరచిపోయి నృత్యంలో లీనమైపోతారు.
వికలాంగులకు సాధనతో నేర్పించే అవకాశం ఉంది...కానీ మానసిక వికలాంగుల విషయంలో నృత్యంలో శిక్షణనివ్వటం మీకు కష్టంగా అనిపించలేదా?
మీరన్నది నిజమే. వాళ్లు స్థిరంగా ఒకచోట కూర్చోలేరు. కొంతమంది గట్టిగా అరవటం, దగ్గరకొచ్చినవారిని తోసేయటం, కొట్టటం లాంటి పనులు చేస్తారు. అయితే ఆ సమయంలో మనం కూడా కోపాన్ని ప్రదర్శించి తాళ్లతో బంధించడం లాంటి పనులు చేయకూడదు. వారికి మంచిగా నచ్చచెప్పి మనమాట వినేలా చేసుకోవాలి. అంతకుమించి వారికి అర్థమయ్యేలా శిక్షణనివ్వాల్సి ఉంటుంది. ఇదంతా కష్టంతో కూడుకున్న పనే. అయితే ఆ సమయంలో మనం చూపించే కాస్త మానవత్వం కొన్ని జీవితాలకు వెలుగునిస్తుందంటే ఆ శ్రమ పెద్దగా లెక్కలోకి రాదు. మంచిమార్గంలోకి రానున్న వారి భవిష్యత్తుని తలచుకుంటేనే ఎంతటి కష్టాన్నయినా మర్చిపోగలం. అదే నన్ను నడిపించే శక్తి.
వీల్ ఛైర్‌లో చేసే నృత్య ప్రదర్శనలు ఎలా ఉంటాయి?
సాధారణంగా కుర్చీలో కూర్చుని నృత్య విన్యాసాలు చేయాలంటే ఎవరికైనా కష్టమే. అందునా వేగంగా కదిలే చక్రాల కుర్చీలో కూర్చుని వికలాంగులు చేసే విన్యాసాలు చూపరుల్లో ఉత్కంఠని రేపుతాయి. వీల్ ఛైర్ డ్యాన్సులో సూఫీ డ్యాన్సులు, మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు కూడా ప్రదర్శిస్తాము. చిన్నారులను సైతం ఆకట్టుకునేలా పంచతంత్ర కథలు, రాముడు, హనుమంతుడు, కృష్ణుడు లాంటి పాత్రలు ప్రదర్శిస్తున్నపుడు వారు చక్రాల కుర్చీల్లో ఉన్నారని, అంగవైకల్యం ఉన్నవారనే విషయమే మర్చిపోతాం. ప్రతి కళాకారుడు తమదైన నటనని, నృత్య విన్యాసాలను ప్రదర్శిస్తారు.
భారతీయ సాహిత్యాన్ని వీల్ ఛైర్ డ్యాన్స్‌తో ఎలా మిళితం చేశారు?
అవును...నృత్యమంతా భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది. చిన్నతనం నుంచే నృత్యం పట్ల ఆసక్తి ఉండటం వలన రామాయణం, మహా భారతంలాంటి అద్భుత కావ్యాలను ఆసక్తిగా చదివాను. మనిషి తన జీవన ప్రస్థానంలో భగవద్గీతని ఎలా అన్వయించుకోవాలో కూడా అర్థం చేసుకున్నాను. అలాగే పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు అన్నింటినీ చదివాను. వాటి ప్రభావంతోనే వీల్ ఛైర్ నాట్యంలో కొత్త ప్రయోగాలు చేశాను. సూఫీ సంగీతంతో కూడిన కలగలిసిన నృత్యరీతులను కూడా రూపొందించాను. అయితే ఇదంతా నా ఒక్కడి విజయంగా చెప్పలేను. నాభావాలను సరిగ్గా అర్థం చేసుకుంటూ, వాటిని ఆచరణలో పెడుతూ తమదైన శైలితో విజయంవైపు అడుగులు వేస్తున్న నాశిష్యులది కూడా. అలాగే ఈ ప్రస్థానంలో నాకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది చెందుతుంది.
ఇప్పటివరకు ఎన్ని దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు?
ఇంగ్లండ్, ఇటలీ, మలేషియా ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు తిరిగి పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాం. ఎన్నో దేశాలలో దేశాధినేతలు, రాజకీయ వేత్తలు, నృత్య నిష్ణాతులు, అంతకు మించి కోట్లాది ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాము. వికలాంగులను చిన్నచూపు చూడరాదన్నదే నా లక్ష్యం. అదినేరే దిశగా చేస్తున్న నా ప్రయత్నం ఫలిస్తున్నది.
మీకు సంతృప్తినిచ్చిన ప్రదర్శనలు?
ఒరిస్సా రాజధాని నగరం భువనేశ్వర్‌లో దాదాపు 20వేలమంది ఆదివాసీల సమక్షంలో నిర్వహించిన వీల్ ఛైర్ నృత్యాన్ని జీవితంలో మర్చిపోలేను. ఆ ప్రదర్శన పూర్తి కాగానే ఆదివాసీలు స్పందించిన తీరు నా మనసులో ఒక తీయని అనుభూతిగా మిగిలిపోయింది. వారు నృత్యం చేసిన ప్రతి కళాకారుడినీ తమ గుండెలకు హత్తుకుని మరీ అభినందనలు తెలిపారు. అలాగే ఇంగ్లండులో అందునా పార్లమెంటులో ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకులనే కాదు, దేశాధ్యక్షుడే కళ్లనీళ్లతో ఉద్వేగానికి గురయ్యేలా చేసింది.
ఇప్పటి వరకు మీరు ఎంతమందికి వీల్‌ఛైర్ నృత్యాన్ని నేర్పి ఉంటారు?
ప్రపంచవ్యాప్తంగా నాకు ఐదువేలపైన శిష్యులున్నారు. ఉత్తర ఆఫ్రికాలో ఒక మారుమూల గ్రామంలో బట్టలుతికే రజక కుటుంబంలో పుట్టి ఒక్క నిముషంలో వీల్ ఛైర్‌ని అరవైసార్లు తిప్పి గిన్నిస్ రికార్డు సాధించిన గుల్షర్ నా శిష్యుడే.
మీకు నచ్చిన శిష్యులెవరు?
ఎవరని చెప్పను? ప్రతి ప్రదర్శనకూ పురిటి నొప్పులు పడతాం....అది పూర్తి కాగానే బిడ్డపుట్టిన ఆనందంతో పరవశించిపోయే స్త్రీ పరిస్థితే నాది కూడా. మీ ప్రశ్నకు ఏ గురువైనా ఇచ్చే సమాధానమే.... అందరూ నాకు నచ్చినవారే.
మరి మీరు సాగిస్తున్న ఈ బృహత్కార్యానికి, వికలాంగుల సేవకు నిధులెలా?
ప్రపంచంలో వికలాంగుల శాతం పెరుగుతూ వస్తోంది. ఇది ఆందోళన చెందాల్సిన విషయమే. వీరికోసం స్థాపించిన 'ఎబిలిటీ అన్ లిమిటెడ్ ఫౌండేషన్' పేరుతో ప్రారంభించిన సంస్థ ఢిల్లిd కేంద్రంగా, మరో రెండు బ్రాంచిలతో పనిచేస్తోంది. దీనికి నిధులను ప్రదర్శనల ఏర్పాటు ద్వారానే సమకూర్చుకుంటున్నాం.
మీ లక్ష్యం నేరవేరుతుందని అనుకుంటున్నారా?
ఖచ్చితంగా! వికలాంగుల సత్తా ప్రపంచానికి చాటాలన్నదే నా లక్ష్యం. అది నెరవేరేందుకు తొలి అడుగు వేశామనుకుంటున్నాం. పదివేల ప్రదర్శనలు ఇవ్వటం ద్వారా లిమ్కా బుక్ రికార్డుని అందుకున్నారు నా శిష్యులు. అలాగే భారత రాష్ట్రపతి సహా అనేక దేశాధ్యక్షుల ప్రశంసలు అందుకోవటమూ మరువలేనిది. గత 37 సంవత్సరాలుగా వికలాంగుల సేవలో తరించటంతో నా జీవతం ధన్యమైందని, ఇది నాకు దేవుడిచ్చిన వరమని భావిస్తున్నాను. భవిష్యత్తులో మరింతమందికి శిక్షణనిస్తాను.
-దుగ్గు రఘు
సిటీ కల్చర్ ప్రతినిథి, హైదరాబాద్
Subscribe to:
Posts (Atom)