Showing posts with label సామాజకీయం. Show all posts
Showing posts with label సామాజకీయం. Show all posts
Saturday, November 9, 2019
Saturday, July 23, 2016
మీ క్యాస్ట్ అడగడం మర్చిపోయాను 2016
చాలాకాలమయింది నేను,
సుందరయ్య
కలిసి. క్యాప్రీలో కూర్చున్నాం. రాజ్యాంగంమీద చర్చ ఒక స్థాయి దాటి మరో స్థాయిలోకి
దాటిపోతున్న తరుణంలో ఒక పెద్దాయన మా వైపే ఆశక్తిగా చూస్తున్నాడు. నవ్వుతో ఆయనను
స్వాగతించగానే చర్చలోకి రాకెట్ లాగా దూరిపోయాడు. ప్రారంభంలో తెలుగు సామాజిక
శాస్త్ర పదజాలాన్ని ఆసువుగా వాడుతున్నాడు. రాజనీతిశాస్త్రం విశ్రాంత అధ్యాపకుడేమో
అని అనుమానం వచ్చింది. అడిగితే కాదన్నాడు. నెమ్మదిగా చర్చ సుందరయ్య
భౌతికశాస్త్రానికి, నా
రాజనీతిశాస్థ్రానికి దూరంగా ఆయన తీసుకెళ్తున్న మార్గంలో పయనిస్తుంది. మేమిద్దరం
(ఎక్కువగా సుందరయ్య) ఆయనతో ఢీకొనే ప్రయత్నం చేస్తున్నాం. చివరికి అర్ధమయ్యింది ఆయన
'ఆత్మ-పరమాత్మ'
మార్గంలోనికి
తీసుకెళ్ళాడు.
మరింత ఆశక్తికరమైన
అంశమేమిటంటే సుందరయ్య రంగు మరియు మాటను బట్టి ఆయన జన్మతః బ్రాహ్మణుడు అని నమ్మి,
బ్రాహ్మణుల
గొప్పతనాన్ని పొగిడి, వారికి
ప్రస్తుత సమాజంలో ఉన్న బాధ్యతను గుర్తు చేసాడు. నేను అవేమీ పాటించను అని అన్నా
వదలలేదు. యాభై నిమిషాల చర్చ. ఎలాగో ముగించాం. పెద్దాయన ఏదో షాపుకెళ్ళాలని,
కాస్త
డ్రాప్ చేయమన్నారు. నేను సరే అని వెళ్ళాను. బండి దిగినాక ఆయన నా వైపు ఆశగా చూసి
"ఇంతకీ నేను మీ క్యాస్ట్ అడగడం మరచిపోయాను" అన్నాడు. పెద్దగా నవ్వి,
అవన్నీ
దాటి ఇక్కడికొచ్చాం సర్. ఇక దానితో పనిలేదు లెండి. వస్తాను అని చెప్పి బయలు దేరాను.
కానీ నా రంగు+మెరుపు+పదును చూసి నేనెవరి వారినీ వారికి తెలియలేదా?
నేను
నమ్మను. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్థము సాధ్యమని ఎవరి చెబితే నాకేంటి.
Sunday, August 18, 2013
బాధాతప్త ’తెలంగాణా’– భయం నిండిన ’సమైక్యాంధ్రా’
ఆంధ్రా ప్రాంతలో పుట్టి పెరగడం,
తెలంగాణంలో నివసించడం వలన ఇరు ప్రాంతాలలో జరిగే ఉద్యమాలను దగ్గరగా చూసే అవకాశం,
అనుభవం ఉంది. ఈ మొత్తం ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది, తిరుగుతూనే ఉంది. ఇరు
ప్రాంతాలలోనూ నాపై కొంత వ్యతిరేక భావన ఉండడం గమనార్హం. ఆంధ్రా ప్రాంతంలో వ్యతిరేకత
ఎందుకంటే నేను తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం కావడం. తెలంగాణా ప్రాంతంలో
వ్యతిరేక భావన కలుగడానికి కారణం నేను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడను కావడం.
ఆంధ్రా వాడు ఎప్పటికైనా ఆంధ్రావాడే అవుతాడు కాబట్టి అనేది సాధారణ అవగాహన అయి
ఉండవచ్చు. ఏది ఏమైనా అవి నా మీద కలగిన భావనలే అయినప్పటికీ, నాలో కలిగిన భావనలు
కాదు కాబట్టి నేను పెద్దగా బాధ పడవలసిన అవసరం లేదు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు
మార్గం సుగమం అయిన సందర్భంలో సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా సాగుతున్న తరుణంలో కొన్ని
అనుభవాలు భలే గమ్మత్తుగా అనిపించాయి. అవేవనగా
(1) బహుశా నాలుగేళ్ళ క్రితం
అనుకుంటా? Hair saloon కి వెళ్లాను. అక్కడ Barber కి నాకు జరిగిన సంభాషణ ఇలా వుంది.
బా: ఈ తెలంగాణా గొడవ జరుగుతుంది కదండీ? మీ కెలా వుంటుందండీ? Problem ఏమీ లేదా?
నేను: అబ్బే మాకలాంటి సమస్యలేమీ రాలేదు? అయినా నేను తెలంగాణా రాష్ట్రానికి
వ్యతిరేకిని కాను.
బా: అదెలాగా? మీరు ఈ ప్రాంతానికి చెందిన వారై, వాళ్లకు ఎలా support చేస్తారు.
నే: నేను support చేసేది ప్రాంతాన్ని బట్టికాదు.
వాళ్ళ demand లో సామాజిక న్యాయం ఉంది. అందుకే నా నైతిక మద్దత్తు
ఆ ఉద్యమానికి ఉంది.
బా: (గట్టిగా నవ్వి) మీరు భలే తెలివైన వారండీ? ఏ ఎండకా గొడుగు పడతారన్న మాట.
ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట మాట్లాడుతున్నారా?
నే: నాకు అంత భయం లేదు సార్. నా మద్దత్తు ఇవ్వడానికి సరిపడా అన్ని కారణాలు
అక్కడ ఉన్నాయి. అంతే.
బా: మీకు తెలంగాణా వాళ్ల గురించి మీకు తెలియదు సార్. అక్కడ తెలంగాణా
ఇచ్చేస్తే మనం ఆకలితో చచ్చిపోతాం.
నే: అవునా ఏమిటది (నేను అప్పటికి 10 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నాను)
బా: అవునండీ! వాళ్ళుమనకి నీళ్ళు రానివ్వరు. ఈ సస్యశ్యామలమైన ఈ నేలలో మీరు
కరువు చూడవలసి వస్తుంది. మనం తిండి లేక చనిపోవాల్సి వస్తుంది.
(నేను గట్టిగా నవ్వేను)
బా: మీరు నవ్వకండి. మీకంత వయసులేదు. మీకు ఇప్పుడు అర్ధం కాదు.
నేను: రాష్ట్రం రెండుగా విడిపోవడం వలన మీరు నడిపే ఈ బిజినెస్ కి ఏమైనా నష్టం
వస్తుందా?
బా: రాదు, కానీ, హైదరాబాదుని మనమే develop చేసాము.
నే: ఏమోనండి నాకు తెలియదు. మా కుటుంబం నుండి హైదరాబాదు వెళ్ళినోడిని
నేనొక్కడినే. నేను వెళ్ళింది చదువుకోవడానికి మాత్రమే. హైదరాబాదు అభివృద్ది చేయడంలో
నాకు గానీ, మా కుటుంబానికి గానీ ఏ విధమైన పాత్ర లేదు.
బా: (కళ్లల్లో కోపం) మీకంత వెటకారం అవసరం లేదు. మీకసలు సమస్యే అర్ధం కావడం
లేదు (మాటల్లో చెప్పలేని చిరాకు). [అప్పటికే అతని కత్తి నా గడ్డం గీస్తూ ఉంది. ఈ
మాటల సందర్భంలో అది నా గొంతు దగ్గర ఉంది. రాష్ట్రం కన్నా ప్రాణం ముఖ్యం
అనిపించింది. నేను ఇక అతనితో మాట్లాడలేదు. నాతో నేను మాట్లాడుకోవడం మొదలెట్టాను
“ఇంత భయాన్ని పోగొట్టెదెలా?”.
(2) ఈ వారంలో నేను మా అమ్మకు ఫోన్
చేసాను. ఎక్కడున్నావు అంటే ’చర్చిలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము’ అంది. ఎందుకో
అని కాకతాళీయంగా అడిగిన నాకు ’సమైక్యాంధ్ర కోసం, శాంతి కోసం’ అన్న సమాధానం నాలో
అశాంతిని రేకెత్తించింది. నేను మళ్ళీ అడిగాను “అమ్మా! సమైక్యాంధ్రా కోసమా? శాంతి
కోసమా?’. బహుశా ఇది చాలా పిచ్చి ప్రశ్నలా మా అమ్మకి అనిపించి ఉండవచ్చు. “అదేమిటి
బాబు, సమైక్యాంధ్ర వస్తే శాంతి వచ్చినట్టే కదా’ అంది. అప్పుడు నేను తమాయించుకొని
ఇలా చెప్పాను, “సమైక్యంగా ఉండడం వలననే గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో అశాంతి
నెలకొని ఉంది. ఆ అశాంతిని తొలగించి, శాంతిని నెలకొల్పడానికే రాష్ట్రాన్ని
విభజించాల్సి వచ్చింది. నువ్వు/ మీరు ఉపవాస ప్రార్థనలతో సమైక్యాంధ్రాను తెచ్చేస్తే
పోయిన అశాంతిని తిరిగి తెచ్చినట్టే కదా అమ్మా” అన్నాను. మా అమ్మకేదో
అర్ధమయ్యినట్టుంది. ’అలాగా! మరి హైదరాబాదు నుండి మన వాళ్లను పంపించేస్తారట?’ అని
అడిగింది. బహుశ ఇది వారి ప్రార్థనలో రెండో అజెండా అయి ఉండవచ్చు. ఇక నుండీ మా
సంభాషణ కొంత ఆశక్తికరంగా జరిగింది.
నేను: చాలా మంచి ప్రశ్న అమ్మా. అదే నిజమైతే నేను ఇప్పటికే వచ్చేసి ఉండాలి
కదా?
అమ్మ: అవును, కానీ నువ్వు రాలేదు
నేను: పోనీ శరీన్ (సోదరుడు) వచ్చేసాడా?
అమ్మ: లేదు
నేను: మమ్మల్ని వదిలేయ్. పార్వతి కుటుంబం (carpenters
in hyd) ఎవరైనా వచ్చారా?
అమ్మ: లేదు
నేను: ఇవన్నీ కాకపోయినా, నీకు తెలిసున్న వాళ్ళు ఏ ఒక్కరైనా వచ్చేసారా?
అమ్మ: లేదు
నేను: అలాంటప్పుడు ఇక్కడనుండి అందరినీ పంపించేస్తారన్న మాట వాస్తవమేనా?
అమ్మ: కాదు, మరి అందరూ అలా ఎందుకు చెబుతున్నట్టు
నేను: రాజకీయం మమ్మీ. భయాన్ని నిర్మిస్తున్నారు. ఈ మొత్తం విశయాన్ని అర్ధం
చేసుకోవడానికి నీకు మనకు బాగా తెలిసిన ఒక ఉదాహరణ చెబుతాను. మనం మరియు మరికొన్ని
కుటుంబాలు ఉద్యోగ రీత్యా జీవితంలో సింహ భాగం మన జిల్లా ఆదివాసీల ప్రాంతంలో
గడిపాము. మీరు ఆ ఊరికి వెళ్ళే సరికి కరెంటు కూడా లేదు. అలాంటి ఊరిలో పీటర్
(తాతయ్య) గారు ప్రతీ కార్యక్రమంలో ముందుండి ఆ ఊరి అభివృద్దికి తన వంతు సాయాన్ని
అందించారు. దానికి అక్కడున్న ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్ధులు సహకరించారు.
పీటర్ గారు ఒక స్థాయి గౌరవాన్ని అనుభవించారు. ఇలాంటి సమయంలో ఆయన ఈ ఊరిని నేనే
అభివృద్ది చేసాను. ఈ ఊరు నాది అని అంటే ఎవరైనా ఊరుకుంటారా?
అమ్మ: ఎందుకు ఊరుకుంటారు
నేను: కదా! ఆ ఊరులో ఇల్లు కొనుకున్నారు, పొలం కౌలుకి తీసుకున్నారు. ఉద్యోగ
విరమణ సమయం వరకూ అక్కడే ఉన్నారు. విరమణ తరువాత తమ సొంత ప్రాంతానికి వచ్చేసారు.
అలాకాకుండా అక్కడే ఉండిపోయినా సమస్య ఏమీ ఉండదు. కానీ ఇది నాది, నేను మాత్రమే
అభివృద్ది చేసాను అంటేనే సమస్య మొదలవుతుంది. హైదరాబాదు సమస్య అలాంటిదే? పెద్ద
కొట్టు బాబూరావు, చిన్ని కృష్ణ, జ్యోతుల వెంకట్రావు, సైకిల్ షాపు రాంబాబు లాగా
సమాజానికి అవసరమైన వస్తువులను అందించే వ్యాపారం చేసినంత వరకూ ఎవ్వరూ ఏమీ అనరు. మా
వల్లే ఈ ఊరు అభివృద్ది చెందింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ’అశాంతి’ వస్తుంది.
లాజిక్ అర్ధమయ్యింద అమ్మా?
అమ్మ: అర్ధమయ్యింది బాబూ. వీళ్లందరూ చెబుతుంటే అదే నిజమనుకున్నాను.
నేను: హ హ హ. ఇప్పుడర్ధమయ్యిందిగా. ఈ శుభవర్తమానమును సర్వలోకమునకు
తెలియజేయండి. వెళ్లండి.
Tuesday, October 11, 2011
నేనో ’నావికుడిని’
ఆమె: సముద్రాలే చూసారు, మహా సముద్రాలు చూడలేదు
అతను: అయితే మహాసముద్రాలు ఐదు కాదన్నమాట
ఆమె: జాగ్రత్త.. మునిగిపోగలరు
అతను: నేనో ’వాస్కొడిగామా’. సముద్ర ప్రయాణం నాకు చాలా ఇష్టం. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి నేనెప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటాను, రత్నాలు రాసులుగా పోసి అమ్మే ఓ దేశం కోసం.
Tuesday, August 18, 2009
నిజం చెప్పు... నేనెవరో తెలీదా?

తాట తీసిన బంగారు తల్లి
ప్రేమించానని, కాపురం చేసి, abortion చేయించి, చివరకు పెళ్ళి చేసుకుందామనుకొనే సరికి కులం గుర్తొచ్చిందో మహానుభావుడికి. అందరూ ఆడవాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోరని, తాట తీస్తారని నిరూపించిందో బంగారు తల్లి. ఇంత చేసినా తనే కావాలని ప్రేమగా అతడికోసం ఎదురు చూస్తున్న నా ’మాదిగ’ బంగారు తల్లి అసలు కధ కోసం ఈ క్రింది లింక్ లు చదవండి.
ప్రేమించాడు...వంచించాడు
[http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/dist/aug/19egd3]
పదేళ్ల ప్రేమను కాదన్న ప్రబుద్దుడు
http://www.eenadu.net/district/districtshow1.asp?dis=eastgodavari
ముఖం చాటేసిన ’మగభీర’
http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=299455&subcatid=20&Categoryid=3
ప్రేమించడం, అవసరం తీరిపోయాక వంచించడం, కోర్టులో ఏళ్ళుగా వాదించుకోవడం వీటికి ధీటుగా, ఇకనుంచీ ప్రేమించాలంటే వంద సార్లు ఆలోచించాలి, ఒక్క సారి commit అయితే వందసార్లు commit అయినట్టే అని సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత
నేటి సహోదరీమణులదే
మళ్ళీ అడుగుతున్నా "నిజం చెప్పు...నేనెవరో తెలీదా"
Sunday, March 15, 2009
M.R.P.S. రాజకీయ భవిష్యత్తు
పదిహేనేళ్ళ సామాజిక ఉద్యమం, రాజ’కీయ’ అడుగులు ప్రారంభించింది. రాష్ట్రంలోనే అధిక జనాభాకు ఒక ’రాజ’కీయ గొంతు రాబోతుంది. అందరికోసమనిం చెప్పి, కొంతమందికే కొమ్ముకాసే ’గొంతు’ కాదది. నిక్కచ్చిగా, నిర్భయంగా వాటాలగురుంచి మాటాడే ధైర్యం ఉన్న M.R.P.S. పది శాతం జనాభా ఇన్నాళ్ళూ ఎవరో ఒకరి చెంతన చేరి, తమకు రావాల్సిన ఫలాల కోసం ఎదురుచూడడం కన్నా, తమ అవసరాలు తామే తీర్చుకుంటామని, మందకృష్ణ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీసుకున్న నిర్ణయం హర్షణీయం. సమాజంలో అణగారిన వర్గాలకు (ఎవరైనా) ప్రత్యేక వసతులు కల్పించాలని అంబేద్కర్ చూపిన బాటలో, అణగారిన వారిలో అట్టడుగు వారున్నారని కొత్త భాష్యం చెప్పిన కృష్ణ మాదిగ, రాజ్యాధికారంతోనే అన్ని మార్గాలను సాధించగల శక్తి ఉందని తేల్చి చెప్పిన బాబాసాహెబ్ బాటలో మరో అడుగు ముందుకు వేశాడు.
M.R.P.S రాజకీయ నిర్ణయాన్ని కొంతమంది 'కృష్ణ మాదిగ' కోణంలోనూ, మరికొంత మంది 'మాదిగ' కోణంలో చూస్తున్నారు. ఎవరు ఏ కోణంలో చూసినా భవిష్యత్తులో మాదిగల జీవితాలు ఓ కొత్త కోణంలో సాగబోతున్నాయన్నది వాస్తవం. ఇప్పటి వరకూ విద్య, ఉద్యోగం మరియు ఇతర రంగాలలో మా వాటా ఇవ్వండి అంటూ బ్రతిమాలిన మాదిగలు, ఇక నుండి ఎవరి వాటాలు వారికి పంచే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. నిన్నటి వరకూ ఎస్సీల వర్గీకరణోద్యమంలో మందకృష్ణ ఒక్కడేనా అన్న ప్రశ్నకు, కాదు, ఇకనుండీ 294 మంది శాసన సభకు, 42 మంది పార్లమెంటుకు అర్హత కలిగిన నాయకులు పోటీలో నిలబడతారు. ఇప్పుడున్న రాజకీయాటనే ప్రాతిపదికగా తీసుకున్నా, దానికి మరిన్ని రెట్లు నాయకులు తయారయ్యే సావకాశం మెండుగా వుంది. ఇంతమంది కొత్త తరం నాయకులు, తమ జాతిని పునాదిగా చేసుకొని నిలబడడం అనేది, వర్గీకరణోద్యమ ఫలితమే. ఒకనాడు ’వీళ్ళెంత?’ అన్న ప్రతీ రంగంలోనూ మాదిగలు రాణించడం, M.R.P.S ఘనతే.
ఇన్ని గొప్ప మార్పులను తీసుకు వచ్చిన ఉద్యమం ప్రధాన సమస్యను, ఇన్నాళ్ళుగా రాజకీయ పార్టీలు, మాదిగ (రాజకీయ) నాయకులు పరిష్కరించ లేకపోయారు. కనీసం, నమ్మకాన్ని కూడా ఇవ్వలేకపోయారు. ఎ.బి.సి.డి మాత్రమే కాదు, ఎ నుండి జెడ్ వరకూ అయినా అవసరాన్ని, అభివృద్దిలో వెనుకబాటు తనాన్ని ప్రాతిపదికతో వర్గీకరణ చేయాలన్న M.R.P.S దృక్పధం తప్పకుండా రాజకీయాలను ఓ కొత్త కోణంలో చూపిస్తుంది. అది ’ఇందిరమ్మ రాజ్యమో’, ’అన్నగారి’ రాజ్యమో లేక ’శాస్త్రీయత ముసుగుల రాజ్యమో’ కాదు, ’మన’ రాజ్యం అవుతుంది.
ఇంతవరకూ డబ్బే ప్రధాన లక్ష్యంగా నడచిన రాజకీయాలు, అణగారిన వర్గాల అధికారం దిశగా నడక ప్రారంభిస్తాయి. వడ్దించే వాడు మనవాడైతే, బంతిలో ఎక్కడ కూర్చున్నా పరవాలేదని, M.R.P.S రాజకీయ నిర్ణయం తరువాత ఎస్సీల వర్గీకరణ కాదు, సమాజ వర్గీకరణకు శ్రీకారం చుట్టబోతుంది. దామాషా పద్దతిలో ఎవరి వాటాను వారికే ఇచ్చి అసలు సిసలైన సమాజాన్ని M.R.P.S నిర్మిస్తుంది. ఏ సమస్యకైనా పరిష్కారం ఆలస్యమవుతుందేమో గాని, అసంభవం మాత్రం కాదని, వర్గీకరణకి మోకాలడ్డిన నాయకులంతా తెలుసుకోవాలి. నిరంతర అణచివేత ఎన్నటికీ సాధ్యం కాదని మరోసారి నిరూపించింది M.R.P.S. బలంగా అణచిదేదైనా ఉన్న స్తాయికన్నా ఎక్కువ ఎత్తు ఎగురుతుంది అన్న మాటకు సాదృశ్యమే M.R.P.S రాజకీయ నిర్ణయం.
ఇప్పటికే తన కార్యకలాపాల ద్వారా సామాజిక ఉద్యమం కోసం అనేక మంది నాయకులను తయారు చేసిన ఎం.ఆర్.పి.యస్, వారినే రాజకీయోద్యమంలో పాలు పంచుకొనేలా చేయడం, తనకున్న కృతజ్నతను, నిబద్దతను తెలియజేస్తుంది. వర్గీకరణని ఆపడం ద్వారా మాదిగల అభివృద్దిని ఆపగలిగామని మాలలు, మాల మాదిగలను విడదీసామని అగ్రవర్ణ రాజకీయా పార్టీలు సంబరపడినా, ఐక్యత, సామాజిక న్యాయం అనే పేర్లతో ఇంకా వెనుకబడి వున్న 58 కులాలను ప్రధాన స్రవంతిలోకి రాకుండా ఆపగలిగారని గుర్తించాలి. సమాజంలో అన్ని ఉద్యమాల పరిధి వారి వారి అవసరాల మేరకే ఉన్న తరుణంలో, తన వారిందరికీ న్యాయం జరగాలని పోరు ప్రారంభించిన M.R.P.S, తన రాజకీయ ప్రయాణంలోనూ తనలాంటి వారెందరికోసమో తప్పకుండా ఆలోచిస్తుంది.
ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంత విమర్శించినా, మాదిగలు, దాని ఉపకులాలు M.R.P.S మీద, దాని నాయకత్వం మీద నమ్మకాన్ని కోల్పోలేదు. రానున్న మహా యజ్నంలో సంఘటితమైన మాదిగలను ఎదుర్కొనే శక్తి ఎవరికీ ఉండదు. మాదిగ అనే పదం ప్రధాన స్రవంతిలో భాగమయినట్టుగానే, సామాజిక న్యాయం కూడా సర్వసాధారణం కావాలని M.R.P.S ఆశిస్తుంది.

Wednesday, December 3, 2008
ప్రపంచ వికలాంగుల దినోత్సవం
పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసంబరు ౧౩) వికలాంగుల గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.
సాధ్యమైనంత వరకూ మనం వికలాంగులు అనే పదం మన వాడుక భాషలో వాడడం లేదు. ఇంగ్లీషు లో మాత్రం హేన్డికాప్పుడు, డిసబుల్ద్, ఫిసికాల్లీ చాలేన్జ్ద్ అని రక రకాల పదాలలో వాడుతూ ఉంటాము. కాని చాలా మందికి ఎందుకు ఎ పదాన్ని వాడుతునామో తెలియదు. అలాంటి సమయాల్లో ఒక్కోసారి మంచి ఉద్దేశ్యాన్ని చెడ్డగాను, చెడ్డ ఉద్దేశ్యం మంచిగాను చెప్పే ప్రమాదము వుంది. కాబట్టి ఈ పరిస్తితి నుండి బయటపడే ప్రయత్నానికి ఈరోజే నాంది పలుకుదాం.
ప్రపంచం లో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైన వల్లే ఉండరు. తెలివికి, తెలివిలేని తనానికి మధ్యనే జీవితం. చేయడానికి చేయలేకపోవడానికి మధ్యలోనే మనం. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేక పొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వ సాధారణమైపోయింది. అయితే వికలాంగులను అర్ధం చేసుకోడానికి ఐరిస్ అనే ఆవిడ ఏమంటారంటే "కూర్చున్న చోటినుండి లేవలేక పోవడం శారీరక సమస్య ఐతే, అలా లేవలేక పోవడానికి సరైన సహకారాన్ని అందించక పోవడమే అసలైన వైకల్యం అంటారు". అందుకే సమాజం లో ఎవరు ఎ పని చేసినా, చేయలేక పోయినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. ఆ సహకారం, ప్రోత్సాహం తో ఎవరైనా ఎంత ముండుకైన వెళ్ళగలం అనే సత్యాన్ని తోటి వారు అవగాహన చేసుకోవాలి. నిజమైన సామర్ధ్యం గురుంచి చర్చించు కుంటే ఎవరు ఎవరినీ తక్కువగా చూడలేము. అలా అర్ధం చేసుకోలేక కొన్ని తరాలుగా కొంత మందిపై నిర్లజ్జ గా సామర్ధ్యం అని చెప్పి, చేయగలిగినవాళ్ళను కూడా అసమర్ధులుగా మార్చిన సమాజం నుండి బయటికి వచ్చి అందరినీ అర్ధం చేసుకొనే సమాజం వైపు మన పెద్ద వాళ్లు ప్రారభించిన అడుగులు ముందుకు తీసుకు వేల్లిదానికి ఈరోజే నిర్ణయం తీసుకుందాం.

Monday, December 1, 2008
'గౌరవం' హక్కు
'గౌరవం' ప్రతీ మనిషీ కోరుకునేది. ప్రతీ మనిషికీ అవసరమైనది. అది దొరకని నాడు మనం పడే బాధ ఎంతో 'హెడొలనిస్టిక్" కొలమానంతో కొలవడం కూడా కష్టమే. చాలామందికి గౌరవం ఆశించినంత ఆశక్తి ఇవ్వడంలో వుండదు. అలా వుండడానికి వాళ్ళు చాలా సాధన చేస్తారేమో అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారులలో కనిపిస్తూ ఉంటాయి. బహుశ వాళ్ళు పోటీ పరీక్షలలో వల్ల అందరికన్నా గొప్పవారై ఉండడం కావచ్చు. 1994 లో ప్రపంచ ప్రతినిధులందరూ జపాన్ లో ఒక సభలో వికలాంగులందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలు కల్పించడం మరియు వారి హక్కుల రక్షణకై ప్రత్యేక చట్టాలు చేయాలని నిర్నయించుకొన్నారు. దాని ఫలితమే భారత వికలాంగుల చట్టం 1995. చట్టం అమలు అధికారుల దగ్గరనుండి ప్రజలందరికీ చేరి,అందరూ వికలాంగులకు గౌరవాన్ని ఇవ్వడం లో వివక్ష చూపకూడదు అన్న భావాన్ని పెంపొదించాలి. కాని ఈ పన్నెండేళ్ళలో ఎప్పుడూ ఈ విషయాన్ని అంత తీవ్రంగా తీసుకున్నట్లుగా కనిపించలేదు. నేను పెద్ద లేక నా ఉద్యోగం పెద్ద అన్న అహంభావం ముందు ఎదుటి వారు కూడా మనలాంటివారే అన్న చిన్న విషయాన్ని మరచిపోతారు. అందుకే మనం ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా సామాన్య మానవులెవ్వరూ కూర్చోవడానికి అర్హులు కారు. అందుకే నిలబడే మాట్లాడించి పంపించేస్తారు. ప్రజా సేవలో ఉన్న వారి దగ్గరికి ఆ ప్రజలలో ఒకరు వచ్చి మాట్లాడితే వారిని కూర్చొమంటే పోయేదేమిటి అహం తప్ప.
ఒకాయన నడువలేడు, నిలబడలేడు. కష్టపడి ఒక అధికారి దగ్గరకు వెళ్తాడు తనకు రావలసినదేదొ అడగడం కోసం. అక్కడకు వరకు వెళ్ళడమే ఓ ప్రహసనం. ఇది ఏ మాత్రం అర్ధం చేసుకోనట్టుగా ఆ అధికారి నిలబడలేక పోతున్న వారిని కూడా నిలబెట్టే సమస్య పరిష్కారం గురించి విచారిస్తారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది అధికారులు, ఉన్నతోద్యోగులు అలాగే వున్నారు.
ఏది ఏమైనా సరే అందరికీ సరైన గౌరవం దక్కాల్సిందే. గౌరవం అందరి హక్కని గుర్తించాల్సిందే.
ఏది ఏమైనా సరే అందరికీ సరైన గౌరవం దక్కాల్సిందే. గౌరవం అందరి హక్కని గుర్తించాల్సిందే.
Sunday, September 7, 2008
బాగా చదివినా తప్పేనా?
ఒక దళిత మధ్య తరగతి విధార్థిని ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయింది. తన కల. Inter అవ్వగానే Engineering చేయాలనుకుంది. ఇంట్లో డిగ్రీ చేయమన్నారు ఎందుకో మీకు అర్థమయ్యే వుంటుది. తరువాత M.sc Physics జాయిన్ అయ్యింది. B.Ed చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుందన్న లోకం పోకడలో పి.జి నుండి అమ్మాయిని మానిపించి బి.ఎడ్ లో జాయిన్ చేసారు. బి.ఎడ్ తరువాత అమ్మాయి కొంతకాలం టీచర్ గా పనిచేసి మళ్ళీ పి.జి లో seat సంపాదించుకొంది. ప్రశాంతంగా రెండు నెలలు గడిచింది. రెండు వారాల్లో Internal అప్పుడే మొదలయ్యింది కొత్త కధ.
ఓ రోజు ఓ వ్హ్రుద్ధ పంతులు అందరిని క్లాస్ లో సెమినార్ ఇమ్మన్నాడట.ఈ అమ్మాయి బాగా చెప్పింది. అంతే ఆయన వివరాల్లోకి వెల్లి, నువ్వు ఎవరు, ఏమిటి అని అడిగి, బి.ఎస్.సి లొ statistics లేకుండా నీవు ఈ కోర్స్ కి eligible కాదు అని Director, Admissions కి ఫోన్ చేసాడట. ఆయన కూడా అదే సమాధానం. అయితే ఈ అమ్మాయి ఏమి అవ్వలి అన్న విషయం మీద వాళ్ళసలు ఆలోచించనే లేదు. మని నా సంగతేంటి అని అమ్మాయి అడిగే వరకూ వాళ్ళు మౌనంగానే వున్నారు.
ఇక మొదలయ్యింది మరో కధ. M.Sc Statistics లొ అర్హత లేదని MSc Statics and Computer Science లొ జాయిన్ అవ్వమన్నారు. ఒక్కదానికే దిక్కులేదు రెండింటిని చేర్చారు. అయితే అక్కడొక చిక్కుంది, అదేమిటంటే అది డబ్బు కోర్సు. సంవత్సరానికి 30 వేలు. ఎవరు కడతారు, అమ్మాయె కట్టాలి. ఎందుకంటే తప్పు అమ్మాయిది. అందరూ అదే మాట. Eligibility సరిగ్గా చూసుకోలేదా? [Maths and Statistic (any one of them as main subject)] మనకు ఇప్పుడు main కోర్సులు లేవు కదా. అన్నీ elective courseలే కదా. అయినా వాల్లు చెప్పిండే వేదం. యూనివర్సిటీకి సీటు కేన్సిల్ చేసే అధికారం కూడా వుంది తెలుసా అని బెదరింపు. ఈ గొడవ తెగేదాకా లాగితే అమ్మాయి జీవితం పోతుందోనని మధ్యతరగతి మహాభారతం మరోపక్క.
ఆట మొదలయ్యింది, అందరూ అమ్మాయినే నిర్ణయం తీసుకోమన్నారు.కాని వాళ్ళ నిర్ణయమూ స్పష్టంగానే వుంది చెప్పక పోయినా. ఇంతలో కొత్త అధికారి ముందుకు వచ్చారు. వీళ్ళు జాయిన్ అవ్వమన్న కోర్సు కూడా అదే eligibility. వాళ్ళు నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టొచ్చు, అందుకే ఎదైనా Basic కోర్సులోకి వెళ్ళిపో, నేను రికమండ్ చేస్తాను. అమ్మాయి అనుకున్న స్తానం నుండి ఒక్కొక్క మెట్టు పడిపోతుంది. ఆలోచించి organic chemistry ఇస్తె చేస్తానంది. కేంపస్ లో ఇవ్వలేము బయట కాలేజీ లో అయితే ఇస్తాం అన్నారు. ఒప్పుకునే కొలదీ ఇంకెంత దూరం తోసేస్తారో అర్థం కాలేదు. నేను వెళ్ళను అంది. కధ మళ్ళీ మొదలు.ఎన్ని రోజులు తిప్పారో వాళ్ళకే తెలియాలి. ఒక్క ఫోన్ చేస్తే అయిపోయే పనులు. అమ్మాయినే వెళ్ళమనే వారు. వెళ్ళింది. ఎన్నిసార్లైనా తిరిగింది. ఒక్కో మాట కోసం తిరిగింది. ఇంతలొ ఇంటి నుండి భయంతో నిండిని బెదిరింపులు. సంవత్సరం వ్రుధా అయిపొతుంది. ఏదైతేనే M.Sc కాదా. మనం ఎక్కువ గొడవ చేస్తే మార్కులు తగ్గిస్తారు తెలుసా సహ విద్యార్ధుల సలహాలు.
చివరకు ఇంట్లో వాళ్ళూ డబ్బు తెచ్చి జాయిన్ అయిపో, మేము తట్టుకోలేకపోతున్నాము అని M.Sc Statistics and Computer Science జాయిన్ చేసేసారు. ఇంత సీనులో ఒక్కసారైనా యూనివర్సిటీ తప్పు చేసిందని అనుకున్నారా. వాళ్ళు rules అంత strict అయినప్పుడు, ముందుగానే ఎందుకు చూసుకోలేకపోయారు. apply చేసినప్పుడు, join అయినప్పుడు ఏమిచేసారు. ఒకవేల తను సెమినార్ బాగా చేయకపోయి వుంటే అదే class lo వుండి పోయేదా?

Subscribe to:
Posts (Atom)