Saturday, July 16, 2016

ఓడినా! గెలిచినా!

కళ్ళతో చూస్తే మార్గం కనిపిస్తుంది
మనసుతో చూస్తే గమ్యం కనిపిస్తుంది
గమ్యం చేరడానికి కళ్ళు / కాళ్ళు అవసరం లేదు
కార్యదీక్ష ఉంటే చాలు

తలదించుకుంటే కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి
కానీ అడుగులు కదలవు
తల ఎత్తితే దారి కనిపిస్తుంది
కాళ్ళు కనిపించవు, అడుగులు తడబడవు
గమ్యం నిర్దేశితమైతే
కళ్ళతో పనిలేకుండా కాళ్ళు పని చేస్తాయి

కళ్ళు నెత్తికెక్కితే ఆకాశం కనిపిస్తుంది
ఆ శూన్యంలో అడుగులు తడబడతాయి
ఆకాశం సరిహద్దు ఆలోచనలకే తప్ప
కళ్ళు చేరుకోవడానికి కాదు

కళ్ళున్నా లాభాలున్నాయి నష్టాలున్నాయి
కళ్ళు లేకున్నా లాభాలున్నాయి నష్టాలున్నాయి
కళ్ళున్నా లేకున్నా కన్నీళ్ళున్నాయి
గెలిచినా! ఓడినా!


No comments: