వెనుకబడిన తన కులం అభివృద్ది కోసం ఆతురత పడుతూ, భవిష్యత్తులో కులం పోవాలని ఆశపడే వ్యక్తి, మరియు రామ్ గోపాల్ వర్మ కు అభిమాని స్పందన.
వాస్తవానికి RGV Talks about Caste Feeling ని పూర్తిగా నెగటివ్ గా నేను చూడడం లేదు. యాంకర్ స్వప్న తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఘోరమైన కుల దౌర్జన్యాలను ఉదహరించలేకపోవడం ఈ చర్చను అసంపూర్ణంగా వదిలేసింది. ఒకవేళ అలా జరిగి ఉంటే కులంపై ప్రత్యేకమైన అభిమానం ఉన్న నాకు RGV నాకు ప్రత్యేకమైన అభిమానం పోయిండేదేమో. ఈ చర్చలోని (నాకు) ఆశక్తికరమైన విషయాలను ముందుగా ఉదహరించిన తరువాత అభ్యంతకర విషయాలపై మాట్లాడుతాను.
చర్చ మొదలైన దగ్గరనుండీ RGV పై ఉన్న అభిమానం ఆ మాటలను వినవివ్వడం లేదు. అప్పటికే మది నిండా మానస ఎండ్లూరి రాతలు ఆక్రమించి ఉన్నాయి. ఇంతవరకూ RGV ఏమి మాట్లాడినా వెంటనే connect నేను, ఈసారి connect కాలేకపోతున్నాను. నామీద నాకే అనుమానం వచ్చింది. ఈ రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడుతాడో వాడికే తెలియదు అని మాట్లాడే చాలా మంది కోవలో నేను పడిపోయాననిపించింది. నా స్థాయి పడిపోయిందో, రాము నాకందకుండా వెళ్లిపోయాడో నాకర్ధం కాలేదు. కానీ కొంత సంయమనం పాటించిన తరువాత నెమ్మదిగా కోలుకుంటున్నాను.
దానవీరసూర కర్ణలో కులానికి ప్రాముఖ్యత లేదని చెప్పడం నన్ను inspire చేసింది ఆయనకు కులం మీద ఉన్న అసలైన అభిప్రాయం బయటపడింది. సిగ్గులేకుండా identity వెతుక్కునే ఈ సమాజంలో ఏ form of identity ని ఎవరు తెలుసుకోవాలని ప్రయత్నించినా వారు పశువుతోనే సమానమని చెప్పడం నాలోని పశువుని శాంతపరచినది. మనిషి ఆలోచనలను కాకుండా పుట్టిన కులాన్ని పట్టుకుని వేలాడడం మూర్ఖత్వం అని చెప్పడం నచ్చింది. similar thinking people should get together, free flow of thought is the criteria and only these people can form a pure society అని అన్నప్పుడు నిజమే.. ఇలానే బావుంటుంది అనిపించింది. సమాజం ముందుకెళ్ళాలంటే మనం గీసుకున్న గీతలు చెరిపెయ్యాలని చెప్పినప్పుడు అభ్యుదయం కనిపించింది. 'నా' అనేది మాత్రమే ఉంటే ఈ సమాజం ఇంత ముందుకు వెళ్ళేది కాదు అని చెప్పడం భలేగా అనిపించింది.
కానీ...
కులం వల్ల ఇబ్బందులు లేవు మిగతా వాటితో పోలిస్తే అన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆర్దికస్థాయి ఉంటే అంతరాలుండవని అన్న ఆయన స్థాయి ఉన్నా వచ్చే (తరతరాలుగా) అభ్యంతరాలను చర్చించలేదు. అణచివేతకు అనేక రూపాలుండవని, అది ఎక్కడ ఉన్నా దాని అమలు రూపం ఒక్కటేనని, అందులో కులం ఒక భాగమని ఆయన అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే అణచివేత కారకాలలో కులం ఆఖరి / ప్రాముఖ్యతలేని కారకం అవుతుందని అంటారు. కులం ఒక కారణంగా చూపించడానికే ఉపయోగపడుతుంది కానీ వాస్తవ రూపం అది కాదని అంటారు. అన్నింటికన్నా ప్రబలమైన కారకం ప్రాంతం అని, ప్రాంతీయ విభజనలో కులం ఎక్కడో చివరన ఉంటుందని అన్నారు.
ఈ సమయంలో ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. caste is a notion of mind (Dr. B.R. Ambedkar). కులం ఒక కారకం లాగా కాకుండా మానసిక భావన (రోగం) అని దానిని వాస్తవ రూపంలో చూపించలేమని చెప్పినపుడు నిజమే అనిపించింది. సమకాలీన సంఘటనలను పోల్చి చూసినపుడు ఈ మానసిక రోగానికి ఒక కారణం కావాలి. అది వాస్తవరూపమై ఉండాలి. ఈనాటి పరిస్తితులలో మనం కుల అమానుషాలను derive చేయాల్సిన పరిస్తితులు ఎన్నో ఎదురవుతున్నాయి. అది చాలామంది స్వంత కులం వాళ్లకే అర్ధం కాదు. దలిత ముఖ్యమంత్రి కోసం తెలంగాణా ప్రజలు పడ్డ శ్రమ వృధాగానే మిగిలిపోయింది. ఆ తరువాత ఆ దిశలో పెద్ద చర్చలేమీ జరుగలేదు. 2009 లో నేను రామచండరపురం నియోజవర్గం కోసం MRPS తరుపున ఒక pamplet M.R.P.S. రాజకీయ భవిష్యత్తు రాసాను. ఆరోజు మా పోలింగ్ బూత్ లో మా అభ్యర్దికి పడ్డ ఓట్లు కేవలం మూడు (మా ఇంట్లోవే). అప్పుడు మావాళ్ళు ఏమి ఆలోచించారో నాకు తెలియదు. Quality కావాలనుకున్నప్పుడు కులం ముందుకు రాదని ఒక సందర్భంలో జయప్రకాష్ నాయారణ అన్నారు.
ఎన్ని మాట్లాడుకున్నా, కులం మనసులో రూపొందించబడి, వాస్తవ రూపంలో నిర్మించబడినది. ఇది చాలా కాలం వాస్తవరూపాన్నే చూపించింది. వ్యవస్థను, మానసిక స్తితిని నియంత్రించింది. పరిణామ క్రమంలో వాస్తవరూపాన్ని కోల్పోతూ దొంగ దారులను వెతుకుతుంది కానీ తన పని తీరును మార్చుకోలేదు. కేవలం తప్పించుకోవడానికి కారణం మాత్రమే చూపిస్తుంది. Caste is myth or reality అనే కోణంలో సామాజిక శాస్త్రాలలో చాలా చర్చ జరిగింది. మన అనుభవంలో ఉన్న ప్రతీ వ్యవస్థకీ / అవస్థకీ notion of mind మాత్రమే కారణం.

(సశేషం)
No comments:
Post a Comment