జీవిత కాల అభ్యసనంలో ఎప్పుడో, ఎక్కడో, తెలిసో, తెలియకో, కొన్ని విషయాలను నేర్చేసుకుంటాం. అలా నేర్చుకొన్న విశయాలు ఎక్కడనుండి, ఎప్పుడు నేర్చుకొన్నామో తెలిసినప్పుడు, మెదడులోనుండి ఎక్కడో చిరునవ్వు మొదలయ్యి, మనసంతా తేలిపోయినట్టు అనిపిస్తుంది. అలా నా జీవితంలో ప్రభావాన్ని చూపిస్తున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారో అని గుర్తుచేసుకొని ఇలా రాసుకోవడం ఇంకా బావుంటుంది.
1. ఐదో తరగతిలో ’మన దేహం’ పాఠం చెబుతూ పాల్ విశ్వాసం మాశ్టారు ముఖాన్ని చల్లటి నీటితో కడగితే ఆరోగ్యం అని చెప్పి, అందుకే నేను వేడినీళ్ల స్నానంలోనూ ముఖాన్ని మాత్రం చల్లనీళ్లతోనే కడుగుతాను అని చెప్పారు. ఆరోజునుండి, ముఖం కడిగినప్పుడల్లా మాష్టారు మాట్లాడుతూనే ఉంటారు.