చాలాకాలమయింది నేను,
సుందరయ్య
కలిసి. క్యాప్రీలో కూర్చున్నాం. రాజ్యాంగంమీద చర్చ ఒక స్థాయి దాటి మరో స్థాయిలోకి
దాటిపోతున్న తరుణంలో ఒక పెద్దాయన మా వైపే ఆశక్తిగా చూస్తున్నాడు. నవ్వుతో ఆయనను
స్వాగతించగానే చర్చలోకి రాకెట్ లాగా దూరిపోయాడు. ప్రారంభంలో తెలుగు సామాజిక
శాస్త్ర పదజాలాన్ని ఆసువుగా వాడుతున్నాడు. రాజనీతిశాస్త్రం విశ్రాంత అధ్యాపకుడేమో
అని అనుమానం వచ్చింది. అడిగితే కాదన్నాడు. నెమ్మదిగా చర్చ సుందరయ్య
భౌతికశాస్త్రానికి, నా
రాజనీతిశాస్థ్రానికి దూరంగా ఆయన తీసుకెళ్తున్న మార్గంలో పయనిస్తుంది. మేమిద్దరం
(ఎక్కువగా సుందరయ్య) ఆయనతో ఢీకొనే ప్రయత్నం చేస్తున్నాం. చివరికి అర్ధమయ్యింది ఆయన
'ఆత్మ-పరమాత్మ'
మార్గంలోనికి
తీసుకెళ్ళాడు.
మరింత ఆశక్తికరమైన
అంశమేమిటంటే సుందరయ్య రంగు మరియు మాటను బట్టి ఆయన జన్మతః బ్రాహ్మణుడు అని నమ్మి,
బ్రాహ్మణుల
గొప్పతనాన్ని పొగిడి, వారికి
ప్రస్తుత సమాజంలో ఉన్న బాధ్యతను గుర్తు చేసాడు. నేను అవేమీ పాటించను అని అన్నా
వదలలేదు. యాభై నిమిషాల చర్చ. ఎలాగో ముగించాం. పెద్దాయన ఏదో షాపుకెళ్ళాలని,
కాస్త
డ్రాప్ చేయమన్నారు. నేను సరే అని వెళ్ళాను. బండి దిగినాక ఆయన నా వైపు ఆశగా చూసి
"ఇంతకీ నేను మీ క్యాస్ట్ అడగడం మరచిపోయాను" అన్నాడు. పెద్దగా నవ్వి,
అవన్నీ
దాటి ఇక్కడికొచ్చాం సర్. ఇక దానితో పనిలేదు లెండి. వస్తాను అని చెప్పి బయలు దేరాను.
కానీ నా రంగు+మెరుపు+పదును చూసి నేనెవరి వారినీ వారికి తెలియలేదా?
నేను
నమ్మను. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్థము సాధ్యమని ఎవరి చెబితే నాకేంటి.
No comments:
Post a Comment