14.12.2017
రెప్పలు తెరిస్తే కన్నులు తెరిచినట్టేనా?
28.11.2017
నన్ను అర్థం చేసుకున్నాక నేను నీలో ఏకమైపోతాను
నువ్వే నేనయ్యాక మళీ నేనెందుకు
22.11.2017
సుమతి, కాలమతి, మందమతి అన్నింటికీ దూర దృష్టి ఉంటుంది. వాటి పరుధులు వేరంతే!
16.11.2017
ఆద్యంతాలు అహం అయినప్పుడు కనిపించేవన్నీ కల్పనలే
22.10.2017
పొట్టి కన్ను:
అణచివేత వారసత్వమైనపుడు తిరుగుబాటు సమాధానం అవుతుంది
తిరుగుబాటు స్వలాభం చూసుకున్నప్పుడు
అణచివేత ఊసరవిల్లై రంగులు మారుస్తుంది
01.10.2017
సందు దొరికితే మందుకొట్టేస్తారు
బొందు దొరికితే ముడి పెట్టేస్తారు
సందు కోసం, బొందు కోసం
గోతి కాడ నక్కల్లా ఎదురు చూస్తారు
18.09.2017
ఎదురుచూసే ఆశకన్నా ఎదురెళ్ళే శ్వాస గొప్పది
ప్రజలు
భవిష్యత్తు నమ్ముకుని
మొండిగా
చావలేక బతుకుతున్నారు
మనం ఏమీ చెయ్యలేమనుకున్నపుడు కనీసం గమనాన్ని గమనిస్తూ ఉండొచ్చు కదా
ప్రభుత్వం మరియు ఆధ్యాత్మికవాదులు సమస్యలను కొత్త కోణంలో అర్ధం చేసుకోవడం దారి తప్పించడమే అవుతుంది కానీ పరిష్కరించడం కాదు
చేతనంగానో, అచేతనంగానో మనసు పలుమార్లు ఒకే పని చేయడమే ప్రేమ.
05.11.2016
సమస్యల్లో ఉన్నప్పుడు మెదడు చుర్రుగ్గా పనిచేస్తుంది
సమస్యలను ఊహించుకున్నప్పుడు మెదడు మొద్దుబారిపోయుంటుంది
04.11.2016
మీ పాత తరాన్ని మా పాత తరం బాధించిందని
ఈతరంలో మమ్ములను బాధించడమే నీ లక్ష్యం అయితే
మనం భవిష్యత్తు తరాలకి ఏమి అందించబోతున్నాం.
-inspired from Three Laws of Performance
02.11.2016
తెలివి అంటే తెలియడం కాదు పాటించడం
31.10.2016
నేను నేను కాదు
నేను మారిపోయే అలోచనని
నేను అలుపు దగ్గరికి దూరానికి
మధ్యన నలిగే గెలుపు గుర్రాన్ని
రేయి అయిందని పగలు కోసం
పగలయిందని రేయి కోసం
సిద్దపడే ఎదురు చూపును
నేను ఉచ్వాస నిశ్హ్వాలలో
ఎక్కడా ఎక్కువ సమయం
నిలుపలేని నిర్భాగ్యున్ని
నేను చంచలుడిని
అశాస్వతాన్ని
నేను నేను కాదు
మళ్లీ మళ్లీ కలిగే ఈ భావనకు
అనాధార రూపాన్ని
నేను నేను కాదు
మళ్లీ మళ్లీ కలిగే ఆ భావన పేరు ప్రేమేనా?
25.10.2016
నా తండ్రిని జ్ఞాపకం చేసుకోవడమంటే నా కొడుకునూ జ్ఞాపకం చేసుకోవడమే. నా కొడుకుకు భవిష్యత్తులో నేనేమవుతానో?
అనుభవాలుంటే జ్ఞాపకాలుంటాయి
25.09.2016
విలువలు మాట్లాడడానికే ఉన్నప్పుడు పోట్లాటలు సర్వసాధారణం
The rationality can make the good despite bad nature
-inspiration from Thomas Hobbes
27.08.2016
మనల్ని భాధ పెట్టినోళ్లని మనం బాధ పెట్టలేక, మనకు దొరికినోళ్లని నలిపేస్తాం. ఇది 'అప్రకటిత' సామాజిక కట్టుబాటు. అణచివేతకు సమాధానం మనపైనున్న పొరకు మాత్రమే చెబితే సరిపోదు, అన్ని పొరల అంతానికి చేరుకోవాలి. అంత శక్తి ప్రతీకారం తీర్చుకునే ద్వేషంలో లేదు, మమకారం పెంచుకునే మైత్రిలోనే ఉన్నది. సోచా తో, సోచాలయ్ బనేగా!
22.08.2016
కష్టపడమని బోధించే ప్రతీవారు ఎలా కష్టపడాలో నేర్పించినపుడే ఆ ఉచిత సలహా అనుచితంగా ఉంటుంది
21.08.2016 - 15.42
Imperfect will search for perfection
Perfect will accept imperfection
18.08.2016
పడిపోవడమూ, నిలబడడమూ ఏదీ అకస్మాత్తుగా జరుగదు. అది కేవలం గమనాన్ని గమనించకపోవడం వలన కలిగే భ్రమ
17.08.2016
మనకున్న నమ్మకం బలమెంతో మనకొచ్చిన కష్టం బరువు చెబుతుంది
12.08.2016
వర్గీకరణాలెన్ని జరిగినా ఫలితాల ముందు వరుసలో ఆ వర్గపు శ్రేష్టులే ఉంటారు. వర్గీకరణలు ఏ శక్తికి వ్యతిరేకం కాదు, ఏ సమస్యకూ అంతిమ పరిష్కారం కాదు. వర్గీకరణలు అవసరాలు. ఒక గమ్యం మరో గమ్యానికి మార్గం వెతుకుతుంది. ఒకరి సౌకర్యం మరొకరి అసౌకర్యానికి తెరతీస్తుంది. ఫలితాలు వర్గాలకు పరిమితమైనంత వరకూ వర్గీక"రణా"లు అవసరమవుతూనే ఉంటాయి.
11.08.2016
గమ్యాన్ని చూడగలిగితే చాలు.. పయనం నడచిపోతుంది
11.08.2016
Whatever we are enjoying today is because of the potential thoughts of our predecessors. It is our turn now. If not, the chariot will roll back.
10.08.2016
బాహ్య పొరల నుండి వచ్చే ఏడుపుకు బరువు తక్కువ
అంతఃపొరల నుండి ఆపుకోలేని ఏడుపుకు కాఠిన్యం ఎక్కువ
7 August 2016 17:34 2016
ఆత్మ గౌరవం అర్ధం మారలేదు
నేపధ్యం మారలేదు
పోరాట స్పూర్తి, రీతి మారలేదు
మారేది మనుషులే
మార్చేది అవసరాలే
7 August 2016 11:02
స్నేహం ఆలోచనలా కాదు
అనుభవంలో ఉండాలి
ఆలోచన మారిపోతుందో గానీ
అనుభవం మిగిలిపోతుంది
7 August 2016 07:50
కొట్టుకునేంత కోపాలున్నోళ్ళు కలిసి రాజ్యాలేల్తారా? పంచుకోడానికి తట్టుకోలేనోడు పాలించడానికి అర్హుడా?
సర్టిఫికేట్ కోసం సదువుకున్నోడికి, సమాజం కోసం సదువుకున్నోడికి తేడా అదే మరి!
అర్ధం సేసుకోకపోయినా పర్లేదు గానీ, అపార్ధం సేసుకుంటే ఉన్నదీ, ఉత్తినే వచ్చిందీ రెండూ పోతాయిి
4 August 2016 11:11
మనసు నిశ్చలంగా ఉంటే వాస్తవాలు కంటికి క్లోజప్ లో కనిపిస్తాయి
3 August 2016 13:00
'నా' గురించి ముందుకెళ్ళే పయనంలో 'నావి కాని' అనుభవాలెన్నో
3 August 2016 08:46
ఢిల్లో గుండెలపై దండోరా
శ్రేయోరాజ్య ఫలాల సమ పంపీణీ కోసం
సామాజిక న్యాయ వ్యవస్థ బలోపేతం చేయడం కోసం
అట్టడుగు వర్గాల ఆకలిని, ఆక్రందనను, ఆవేదనను
దేశ వ్యాపితం చేయడం కోసం
సమ పంపిణీలోనే సమానత్వం ఉందని చాటి చెప్పడం కోసం
సమానత్వంలోనే సమైక్యత వేయిపూలు పూస్తుందని
దిక్కులు పిక్కటిల్లేలా చెప్పడం కోసం
వర్గాలు, వర్గీకరణలు లేని సమాజం
దోపిడీకి మూలబిందువతుందని
వివరించడంకోసం
దళిత విద్యార్ధి సంఘం ఢిల్లీ పయనమవుతున్న
సందర్భంగా ....
వీరులందరికీ
నీల్ సలాములు!
జాంబవ సలాములు!!
1 August 2016 11:12
ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది
ఒక్కో మబ్బు మరుగైనకొలదీ
ఒక్కో తెర తొలగినకొలదీ
అంబేద్కరుతోనో, ఆల్వా ఎడిసన్ తోనో పోల్చుకునే కష్టాలు నాకేమున్నాయి. వాళ్లకున్న కష్టమూ, కష్టపడే తత్వమూ రెండూ లేవు.

ప్రొ. ఐలయ్య - కృష్ణ మాదిగ - కోమటోళ్లు - దలితోద్దారకులు
(1)
ప్రొఫెసర్ కంచ ఐలయ గారి రచనలో వెలువడిన 'సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్లు' అనే పుస్తకం ప్రస్తుతం వివాదం. కోమట్లకు సమస్య శీర్షిక. వారిని 'సామాజిక స్మగ్లర్లు' అనడం వారి మనోభావాలు దెబ్బతిన్నాయని వారి వాదన. ఈ శీర్షిక మార్చాలని వారి నిరసన. ఈ నిరసన ధర్నాలు, బంద్ లు, దిష్టి బొమ్మ దహనాలు వగైరా రూపంలో జరుగుతుంది. అయితే ఐలయ్య గారు తన మేధస్సుతో సామాజిక శాస్త్ర పరిశోధనా పద్దతిలో రాసిన గ్రంధం నేపధ్యాన్ని అర్ధం చేసుకోవాలని, ఒక అధ్యాయాన్ని కాక పుస్తకం మొత్తాన్ని పరిగణనలోనికి తీసుకుని అర్దం చేసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. పది సంవత్సరాల క్రితం ఆంగ్లం లో రాసిన పుస్తకానికి ఇది తెలుగు తర్జుమా అని తెలియజేస్తూ, అప్పటికి ఇప్పటికి మార్పులు ఉండవచ్చని నిఖార్సయిన పరిశోధకుడి పరిభాషలో తెలియజేసారు. ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో శీర్షిక మార్చడానికి మీరు అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ఆయన అవుననే సమాధానం చెప్పారు. అయితే ఆయనకున్న సమస్యల్లా ఒక పరిశోధనా గ్రంధం పై నిరసన జరుగుతున్న తీరు. పరిశోధనకు అభిప్రాయం సమాధానం కాకూడదన్నది ఆయన వాదన. రాజ్యాంగ పరమైన ఏ పరిష్కారానికైనా తాను సిద్దమని అసమ్మతిని, సంసిద్దతను తెలియజేసారు. ఇక చట్టం తనపని తాను చేసుకుపోతుంది.
(2)
పరిణామ క్రమంలో మంద కృష్ణ మాదిక ఒక విలేఖరుల సమావేశంలో ప్రొ. ఐలయ్య గారు శీర్షిక మారిస్తే బావుంటుందని (ప్రొ. ఐలయ్యగారి తరువాతనే) అభిప్రాయ పడ్డారు. కోమట్లోనూ త్యాగాలు చేసినవారున్నారని గుర్తు చేసారు. మనోభావాలు దెబ్బతినే ప్రస్తుత పరిస్తితులలో అమర్యాదకరమైన పదజాలం వాడకుంటే బావుంటుందని ఆయన ఉద్దేశ్యం. అలాగే ప్రొ. ఐలయ్య గారికి వాక్వాస్వాతంత్రర్యం ఉందని, దానిని ఖండించడం భావ్యం కాదని తెలియజేసారు. వాస్తవంలో కృష్ణ మాదిగ మధ్యే మార్గాన్ని అనుసరించారనపిస్తుంది.

(3)
ఇప్పుడు మొదలైందండీ సామాజిక మాధ్యమాల ఉద్యమ్యం. కృష్ణ మాదిగ కోమట్లను మాత్రమే వెనుకేసుకొచ్చాడనే వాదనను తీసుకువచ్చి, ఆయనను వ్యక్తిగత దూషణలకు తెరతీసారు. ఒక్కసారిగా వారంతా మాదిగ సంస్కర్తలైపోయారు. వాస్తవానికి కృష్ణ మాదిగతో కొంతకాలం కలసి పనిచేసి, తరువాత విభేధించి విడిపోయిన వారెవ్వరూ వ్యక్తిగత దూషణలు చేయలేదు. వారంతా కేవలం సైద్దాంతిక పరమైన అసంతృప్తిని మాత్రమే వ్యక్తపరిచారు కానీ ద్వేషాన్ని చూపించలేదు. వారెవ్వరికీ ధైర్యం లేక కాదు, చేతకాక కాదు. సభా మర్యాదను పాటించారు. కానీ ఈ సామాజిక మాధ్యమ ద్వేష భాష బహిరంగా వ్యక్తిని, అంతర్గతంగా జాతిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది.

(4)
మాదిగేతరులు మాదిగ సంస్కర్తలుగా అవతరించాల్సిన దౌర్భాగ్య పరిస్తుతులలో మాదిగలు లేరు. ఎవరో వచ్చి వాస్తవ పరిస్తితులను వివరించాల్సిన అవసరం అంతకంటే లేదు. మాదిగ ఉద్యమం దశలు వారీగా ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉంది. అది సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే చూసిన వాళ్లకి అర్ధం కాదు. అభివృద్ది కాంక్ష కలిగిన ప్రతీ కులానికి మేధో మధనం ఉంటుంది. ఒకరు ముందు, ఒకరు వెనుక అంతే తేడా. మాదిగలు తమ ప్రాధ్యాన్యతలపై స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మాదిగల తరుపున వకాల్తా పుచ్చుకుని ఎవ్వరు మాట్లాడవలసిన అవసరం లేదు.
(5)
ఒక గుంపు హింసకు బయలుదేరింది. అందులో ఒకడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. వాడిని చంపేసారు.
ఒక గుంపు ప్రజాస్వామ్యం కోసం బయలు దేరింది. అందులో ఒకడు హింస గురించి మాట్లాడాడు. వాడిని వెలివేసారు.
సమయమూ, సందర్భం మాత్రమే ప్రామాణికలు కలిగిన సమాజంలో ఏది, ఎప్పుడు న్యాయం / అన్యాయం అవుతుందో ఎవరికి ఎరుక?

(6)
వేటగాడు అసమర్దుడైతే జింక నెమలిలా నాట్యం చేసిందట.
వేటగాడు అసమర్దుడైతే జింక నెమలిలా నాట్యం చేసిందట.
17.09.2017
యుద్దమంటే . .
ఒకరికి యుద్దమంటే మాట్లాడడం
ఒకరికి యుద్దమంటే సమాధానం చెప్పడం
ఒకరికి యుద్దమంటే వాదించడం
ఒకరికి యుద్దమంటే హింసకు పాల్పడడం
ఒకరికి యుద్దమంటే మౌనంగా ఉండడం
ఒకరికి యుద్దమంటే ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్య వాదుల బొమ్మ పెట్టుకుని
హింసకు పాల్పడడం యుద్దం అవదు
అవకాశం అవుతుంది
అహింసా వాదుల బొమ్మ పెట్టుకుని
అవమానానికి పాల్పడడం యుద్దం అవదు
చేతకాని అవుతుంది
చల్..
సరుకుల్ని మార్కెట్ చేయ్ ... డబ్బులొస్తాయి
సిద్దాంతాన్ని మార్కెట్ చేయకు
సిస్టం క్రాష్ అయిపోద్ది!

12.09.2017
రిజర్వేషన్ చదువుకునే అవకాశాన్ని ఇవ్వొచ్చు. తెలుగు, తమిళం, ఇంగ్లీషు, హిందీ... పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడడంలో రిజర్వేషన్ ఉండదు కదా! ఇది అన్యాయం అని చెప్పడానికి రిజర్వేషన్ ఉపయోగపడదు కదా! ఎదురొడ్డి నిలబడడానికి రిజర్వేషన్ సహకరించదు కదా! నేనింతే, నాలాగే ఉంటాను అని చెప్పడానికి ఏ రిజర్వేషన్ కావాలి. తరతరాల దోపిడీని ప్రశ్నించడానికి ఏ రిజర్వేషన్ కావాలి?
అతి తక్కువ శాతం మంది చదువుకోడానికో / ఉద్యోగం పొందడానికో రిజర్వేషన్ సౌకర్యం కల్పించి, నా మాట, పాట, ఆలోచన, నడక, నడత, ధైర్యం, భయం, (నీ నోటికొచ్చినవన్నీ) రిజర్వేషన్ వల్లనే వచ్చాయంటే నీ మెదడు పనిచేయడం మానేసుంటుంది. రిజర్వేషన్ సంకుచితంగా మాట్లాడిన వాళ్లంతా 'రిజర్వేషన్' లేకపోతే అడుగు కదపలేని అసమర్ధులు. ఇదంతా 'రిజర్వేషన్' ను 'రిజర్వ్' చేసుకునే కుట్ర.
20.07.2017
నిన్ను నువ్వు తడుముకున్నపుడు కలిగిన అనుభవమే నీ స్థాయిని, కోరికని, గమ్యాన్ని నిర్ణయిస్తుంది
ఎదురెదురుగా కూర్చుని, శూన్యంలోకి చూస్తూ, మౌనంగా టీ తాగుదాం వస్తావా
15.07.2017
వాళ్ళ ఐక్యత గురించి మాట్లాడే వాడు అనుభవం లేని వాడైనా కావాలి లేదా అవసరంలోనైనా ఉండాలి. ఉద్దారకుడు మాత్రం కాదు.
13.07.2017
సిద్దాంతం తలకెక్కాలంటే అందులో ముందుగా మునిగిపోవాలి. కొంచెం కొంచెంగా దగ్గర జరుగుతూ, నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ, అనుమాలన్నీ నివృత్తి చేస్తూ, కొంచెం కొంచెంగా కిక్కెక్కాలి. అలా కానంతవరకూ అందరూ మాంత్రికులే మాటల్లో. సమానత్వం, సమభావం, ఐక్యత .... వంటి వన్నీ మార్కెట్ పదాలే.
06.06.2017
"నువ్వో పెద్ద వెధవ్వి" అన్నాన్నేను
"నువ్వు నాకన్నా పెద్ద వెద్దవ్వి" అన్నాడు వాడు
"నువ్వు చాలా మంచోడివి" అని వాడి కళ్లల్లోకి ఆశగా చూసాను
"ఆ విషయం నాకు తెలుసు" అని వెళ్లిపోయాడు
క్షణం తరువాత అర్ధమయ్యింది
"అల్పుడెప్పుడూ అల్పుడే"
"నువ్వు నాకన్నా పెద్ద వెద్దవ్వి" అన్నాడు వాడు
"నువ్వు చాలా మంచోడివి" అని వాడి కళ్లల్లోకి ఆశగా చూసాను
"ఆ విషయం నాకు తెలుసు" అని వెళ్లిపోయాడు
క్షణం తరువాత అర్ధమయ్యింది
"అల్పుడెప్పుడూ అల్పుడే"
03.06.2017
ఇంట గెలిచి రచ్చ గెలామంటారా? ఎంత గొప్ప రాజకీయం.
22.04.2017
ప్రజల జీవితాలతో నాయకులు ఆడుకున్నప్పుడు పట్టించుకునే నాధుడే ఉండడుగానీ, నాయకుల నాటకాలను ప్రజలు కామెంట్లు చేస్తే మాత్రం తట్టుకోలేరు.
18.04.2017
కూలిపోతున్న వ్యవస్థ మూలాలు తెలుసుకోకుండా నిలబెట్టాలనుకోవడమే త్వరగా కూల్చేయడానికి మందు.
17.04.2017
నీకు సంతోషం కోసం కావలసినది నా దగ్గర బలవంతంగా వసూల్ చేసేసి ఇంకా నా సంతోషం కోసం ఎంతో కొంత ఇమ్మంటే సంతోషం అర్ధం కాని మారిపోయిందేంట్రా!
12.04.2017
ప్రేమిస్తే ఏమవుతుంది డ్యూడ్
మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతేకదా
అని చెప్పేస్తారు గానీ
ప్రేమిస్తే ప్రాణం తీస్తారని చెప్పరే?
ప్రేమించడానికి మనసుంటే చాలంటారు గానీ
ప్రేమించడానికి బలగం కావాలని చెప్పరే?
నక్కని, కుక్కని ప్రేమిస్తే లేని తప్పు
ఈ పిల్లని ప్రేమిస్తే తప్పేముందిరా అని ఎక్కేస్తారు గానీ
ప్రేమే తప్పని చెప్పే సమాజం గుట్టు విప్పరే?
ప్రేమకు హద్దులు లేవని గుద్ది గుద్ది చెబుతారు
గుద్ది గుద్ది చంపేస్తున్న కధల చిట్టా విప్పరే?
'నువ్వు లేక నేను లేను' సాఫ్ట్ వేరు మెదడంతా ఎక్కేసింది
అది వైరస్ అని తెలిసే సరికి కంప్యూటర్ క్రాష్ అయ్యింది
వాలంటైన్స్ డే జరుపుకోవడానికే బావుంటుంది
వాలంటైన్స్ చచ్చిపోయాడన్న జ్ఞానం ఎందరికుంటుంది

ఓ..నా యువ రక్తమా!
కరాటే కుంగ్ఫూ లు నేర్చుకోకుండా
ప్రేమించడానికి సిద్దపడకు
ప్రేమ కోసం ప్రాణాలిస్తా అంటావా
రెండో రోజుకే నిన్ను మర్చిపోతాం
సమాధులలో ప్రేమ సందేశాన్నిస్తావా
రెండో రాకడలో నీ జాతికి ధైర్యానిస్తావా
కరాటే కుంగ్ఫూ లు నేర్చుకోకుండా
ప్రేమించడానికి సిద్దపడకు
ప్రేమ కోసం ప్రాణాలిస్తా అంటావా
రెండో రోజుకే నిన్ను మర్చిపోతాం
సమాధులలో ప్రేమ సందేశాన్నిస్తావా
రెండో రాకడలో నీ జాతికి ధైర్యానిస్తావా
చేయి కోసుకునే కమిట్మెంటుతో నష్టం లేదుగానీ
పీక కోసుకునేది మనకెందుకు రా చిన్నా
ఈ రంగుల మాయాజాలంలో
తేనె పూసిన కత్తులని నువ్వు గుర్తించలేవురా నాన్నా
కులం లేదని అరిచే గొంతులన్నీ అబద్దాలని
తెలుసుకోవడానికి నువ్విప్పుడు బ్రతికిలేవు
నువ్వ లేక నేను లేనన్ని ఎన్ని సార్లు చెప్పావో
నువ్వే లేకుండాపోయావురా కన్నా.. వాళ్లున్నారు
నీ సమాధి మీద వారు
మరో మన్మధ సామ్రాజ్యానికి పునాదులేస్తున్నారు
సమాధులలో ప్రేమ సందేశాన్నిస్తావా
రెండో రాకడలో నీ జాతికి ధైర్యానిస్తావా
కంచికచర్ల కోటేసుని తోడుకుని వస్తావా

ముద్దుగా పలుకుతావని ముచ్చటగా ఉన్నావని
నీ అంగాలను కూడా ముద్దాడేసే పిచ్చిప్రేమరా మాది
నీ శరీరంపై చుక్క రక్తాన్నే చూడలేని ఈకంటికి
నువ్వే రక్తపు మడుగై కనిపించి
కడుపుకోత రగిలించావే
తాజ్ మహల్ చిత్రాల్లో శ్వేత సొగసులను చూసి మోసపోయావా
నైపుణ్యాన్ని నిలువునా నరికేసిన చీకటి కధ నీకెవ్వరూ చెప్పలేదు కదూ
సమాజం సమాధి చేసే కధలన్నీ కట్టుకధలుగానే మిగిలిపోతాయి

ప్రేమ ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది కాదు
రెండు సమాజాలకు సంబంధించినది
జాతుల మధ్య లేని సమన్వయం
మనుషుల మధ్య లేని సంఘీభావం
నిర్భయంగా మాట్లాడుకోలేని దౌర్భాగ్యం
ఈ గందరగోళ జీవన గమనంలో
ప్రేమకెప్పుడూ ద్వందార్ధాలే
మనల్ని వరించే అర్ధం ఎప్పుడూ 'మరణమే'
సమాధులలో ప్రేమ సందేశాన్నిస్తావా
రెండో రాకడలో నీ జాతికి ధైర్యానిస్తావా
కంచికచర్ల కోటేసుని తోడుకుని వస్తావా . . .
(నా సోదరుల పరువు హత్యలను ఖండిస్తూ)

25.03.2017
పదాలు ఎప్పటినుండో తెలిసినా అర్ధాలు మాత్రం అనుభవంతోనే తెలుస్తాయి.
08.03.2017
డబ్బు ఉన్నోడు డబ్బు ఎగ్గొట్టొచ్చు
కులము ఉన్నోడు కర్కశంగా ప్రవర్తించొచ్చు
అధికారం ఉన్నోడు దోచుకోవచ్చు
లింగబలం ఉన్నోడు ఆక్రమించుకోవచ్చు
కానీ...
గుండె ఉన్నోడు,
గుండె బలమున్నోడు
ఎప్పుడూ రాజ్యానికి విరోధే
కులము ఉన్నోడు కర్కశంగా ప్రవర్తించొచ్చు
అధికారం ఉన్నోడు దోచుకోవచ్చు
లింగబలం ఉన్నోడు ఆక్రమించుకోవచ్చు
కానీ...
గుండె ఉన్నోడు,
గుండె బలమున్నోడు
ఎప్పుడూ రాజ్యానికి విరోధే
[వికలాంగ వివక్షకు శిక్షల్లేని ఈ రోజుల్లో
వికలాంగులను శిక్షించడానికి చట్టాలున్నాయి ఈ దేశంలో]
వికలాంగులను శిక్షించడానికి చట్టాలున్నాయి ఈ దేశంలో]
మనుషుల్ని వెనక్కి నడిపిస్తూ దేశాన్ని ముందుకెలా నడిపిస్తారబ్బా?
21.02.2017
ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నోడు అనుభవజ్ఞుడు చెప్పినా వినడు
15.02.2017
మనుషుల్ని వెనక్కి నడిపిస్తూ దేశాన్ని ముందుకెలా నడిపిస్తారబ్బా?
30.01.2017
విన్నట్టే అనుకుంటాం
విననివి చాలా ఉంటాయి
మాట్లాడామనుకుంటాం
మాట్లాడనివి ఎన్నో ఉంటాయి
కనిపించినట్టే ఉంటుంది
ఎంతకీ తరగని దూరం ఉంటుంది
ఎన్ని పుటలు రాసుకున్నా
రాయాల్సి మిగిలే ఉంటుంది
ఊహలెన్నో విహరిస్తూ ఉంటాయి
కొన్ని ద్రవించేవి
కొన్ని ఘనీభవించేవి
సృష్టింపబడని
నాశనము కాని
నిరంతర
రూపాంతర
అపురూపాలు
విననివి చాలా ఉంటాయి
మాట్లాడామనుకుంటాం
మాట్లాడనివి ఎన్నో ఉంటాయి
కనిపించినట్టే ఉంటుంది
ఎంతకీ తరగని దూరం ఉంటుంది
ఎన్ని పుటలు రాసుకున్నా
రాయాల్సి మిగిలే ఉంటుంది
ఊహలెన్నో విహరిస్తూ ఉంటాయి
కొన్ని ద్రవించేవి
కొన్ని ఘనీభవించేవి
సృష్టింపబడని
నాశనము కాని
నిరంతర
రూపాంతర
అపురూపాలు
28.01.2017
అందరికీ ఆయనే దేవుడు. కాకపోతే ఒక్కొక్కరికి ఒకోలా..
ఇదే అసలు స్వరూపం. ఇంతకన్నా గొప్పగానూ ఉండదు, ఇంతకన్నా నీచంగా ఉండదు.
22,01,2017
యుద్దంతో అలసిపోయిన ఈ ప్రపంచానికి శాంతి కావాలి అన్న కోరిక నానాజాతి సమితిని, ఐక్యరాజ్య సమితిని రూపకల్పన చేసింది.
20.01.2017
బోధించడం అంటే మరోసారి నేర్చుకోవడమే!
19.01.2017
వెతుకుతూ ఉంటాం
చాలా కాలం దొరకదు
నెమ్మదిగా దొరకడం మొదలవుతుంది
చాలా గొప్పదే దొరికింది అనిపిస్తుంది
ఇంతలో మరొకటి దొరుకుతుంది
అంతలో మరొకటి దొరుకుతుంది
దొరకడం అలవాటయిపోతుంది
మనం గొప్పనుకున్నది
అందరి దగ్గరా ఉందని తెలిసిపోతుంది
అప్పుడే...అలాంటప్పుడే ..
విరమించుకుంటాడు సామాన్యుడు
పనితనం పెంచుకుంటాడు అసాధ్యుడు
దొరకనిదేదో దొరకబుచ్చుకోవడానికి ..
చాలా కాలం దొరకదు
నెమ్మదిగా దొరకడం మొదలవుతుంది
చాలా గొప్పదే దొరికింది అనిపిస్తుంది
ఇంతలో మరొకటి దొరుకుతుంది
అంతలో మరొకటి దొరుకుతుంది
దొరకడం అలవాటయిపోతుంది
మనం గొప్పనుకున్నది
అందరి దగ్గరా ఉందని తెలిసిపోతుంది
అప్పుడే...అలాంటప్పుడే ..
విరమించుకుంటాడు సామాన్యుడు
పనితనం పెంచుకుంటాడు అసాధ్యుడు
దొరకనిదేదో దొరకబుచ్చుకోవడానికి ..
14.01.2017
రావనుకోలేదు, రాలేవనుకోలేదు. వస్తే నాకేంటి ఉపయోగం అనుకున్నాను.
10.01.2017
జనవరి పది
అత్యంత చీకటి తేదీ
గుండె గుట్టు రట్టయింది
నమ్మకం నన్ను వీడిపోయింది
భయం భయంకరంగా నవ్వింది
ఆశ చచ్చి - నిరాశ బతికింది
భవిష్యత్తు మసకబారింది
పనికిమాలిక కోపం పగలబడి నవ్వింది
అసురుని శూరత్వం ఆవహించింది
నీళ్లుండాల్సిన చోట నిప్పులు
నవ్వులుండాల్సిన చోట చెప్పులు
దిమ్మ తిరిగేలా బొమ్మ చూపించి
కోలుకోలేకుండా కొట్టిన రోజుకి
ఇది సంవత్సరికం
వాన చినుకులు అంటని డేగలా
అంతఃశక్తులు వెలికితీసిన శాస్త్రవేత్తలా
మండే సూర్యుని వెలుగులా
నిలుచున్నాను భవిష్యత్తుకు సాక్షిగా!
అత్యంత చీకటి తేదీ
గుండె గుట్టు రట్టయింది
నమ్మకం నన్ను వీడిపోయింది
భయం భయంకరంగా నవ్వింది
ఆశ చచ్చి - నిరాశ బతికింది
భవిష్యత్తు మసకబారింది
పనికిమాలిక కోపం పగలబడి నవ్వింది
అసురుని శూరత్వం ఆవహించింది
నీళ్లుండాల్సిన చోట నిప్పులు
నవ్వులుండాల్సిన చోట చెప్పులు
దిమ్మ తిరిగేలా బొమ్మ చూపించి
కోలుకోలేకుండా కొట్టిన రోజుకి
ఇది సంవత్సరికం
వాన చినుకులు అంటని డేగలా
అంతఃశక్తులు వెలికితీసిన శాస్త్రవేత్తలా
మండే సూర్యుని వెలుగులా
నిలుచున్నాను భవిష్యత్తుకు సాక్షిగా!
07.01.2017
ఆగి చూస్తే.. అన్ని కోణాలు కనిపిస్తాయి
ఆగలేనివారికిదే ఆఖరి కోణం
ఆగలేనివారికిదే ఆఖరి కోణం
నిబ్బరంగా ఉండగలిగినపుడే నిజం తెలుసుకొనే అవకాశం దొరుకుతుంది
నిత్యం తోడుండే శత్రువు దూరమైనా వెలితి కనిపిస్తుంది
20.12.2016
సింహాన్ని సింహం అదుపులో పెడితే ఏముంటుంది గొప్ప
రింగ్ మాస్టర్ పెడితేనే ఉంటది
పాము పాము మెలేసుకుంటే ఏముంది వింత
పాములోడు మెళ్లో వేసుకుంటేనే ఉంటది
మచ్చిక చేసుకోవడం మానవనైజం
ఎలుకని చంపాలని పిల్లిని
మనుషుల పట్టించాలని కుక్కని
భుక్తావసరాలు తీర్చుకోవాలని ఆవుని
మచ్చిక చేసుకుంటాం
యుద్దంలో విజయం ఉందేమో గాని
శాంతి మాత్రం యుద్దం ముగించినప్పుడే!
రింగ్ మాస్టర్ పెడితేనే ఉంటది
పాము పాము మెలేసుకుంటే ఏముంది వింత
పాములోడు మెళ్లో వేసుకుంటేనే ఉంటది
మచ్చిక చేసుకోవడం మానవనైజం
ఎలుకని చంపాలని పిల్లిని
మనుషుల పట్టించాలని కుక్కని
భుక్తావసరాలు తీర్చుకోవాలని ఆవుని
మచ్చిక చేసుకుంటాం
యుద్దంలో విజయం ఉందేమో గాని
శాంతి మాత్రం యుద్దం ముగించినప్పుడే!
18.12.2017
నాకే అవసరమైన కొన్నింటిని నాకన్నా బాగా నువ్వు గుర్తిస్తావు. ఈ పరస్పర అనుబంధానికే నా ఆత్మీయ ఆలింగనం.
14.12.2017
మనం తొక్కేస్తే ఒప్పు
మనల్ని తొక్కేస్తే తప్పు
అసామాజిక న్యాయం
మనల్ని తొక్కేస్తే తప్పు
అసామాజిక న్యాయం
29.11.2016
నా శరీరం గాయాల దిబ్బ
కొన్నింటికి మాత్రం బాధ్యత తీసుకుని
మిగిలినన్నీ కాలం మీదికి నెట్టేస్తాను
కొన్నింటికి మాత్రం బాధ్యత తీసుకుని
మిగిలినన్నీ కాలం మీదికి నెట్టేస్తాను
28.11.2016
యుద్దం ముగిసింది,
ధర్మం మిగిలింది
ధర్మం మిగిలింది
జరిగిన కాలం తిరిగిరాదని తెలిసినా కొన్నింటిని కాలానికే వదిలేస్తాం.
24.11.2016
తప్పు చేసేటప్పుడు దేవుడుని, బాధలలో ఉన్నప్పుడు సిద్దాంతాలని గుర్తు చేసుకుండా ఉండడమే మంచి అనుకుంటా?
21.11.2016
అవసరం కోసమే వచ్చినోళ్ళు వెళ్లిపోతారు. అవససరం తీరందనో! అవసరం తీరడంలేదనో!
ఎదురుచూసే ఆశకన్నా ఎదురెళ్ళే శ్వాస గొప్పది
ప్రజలు
భవిష్యత్తు నమ్ముకుని
మొండిగా
చావలేక బతుకుతున్నారు
మనం ఏమీ చెయ్యలేమనుకున్నపుడు కనీసం గమనాన్ని గమనిస్తూ ఉండొచ్చు కదా
ప్రభుత్వం మరియు ఆధ్యాత్మికవాదులు సమస్యలను కొత్త కోణంలో అర్ధం చేసుకోవడం దారి తప్పించడమే అవుతుంది కానీ పరిష్కరించడం కాదు
చేతనంగానో, అచేతనంగానో మనసు పలుమార్లు ఒకే పని చేయడమే ప్రేమ.
05.11.2016
సమస్యల్లో ఉన్నప్పుడు మెదడు చుర్రుగ్గా పనిచేస్తుంది
సమస్యలను ఊహించుకున్నప్పుడు మెదడు మొద్దుబారిపోయుంటుంది
04.11.2016
మీ పాత తరాన్ని మా పాత తరం బాధించిందని
ఈతరంలో మమ్ములను బాధించడమే నీ లక్ష్యం అయితే
మనం భవిష్యత్తు తరాలకి ఏమి అందించబోతున్నాం.
-inspired from Three Laws of Performance
02.11.2016
తెలివి అంటే తెలియడం కాదు పాటించడం
31.10.2016
నేను నేను కాదు
నేను మారిపోయే అలోచనని
నేను అలుపు దగ్గరికి దూరానికి
మధ్యన నలిగే గెలుపు గుర్రాన్ని
రేయి అయిందని పగలు కోసం
పగలయిందని రేయి కోసం
సిద్దపడే ఎదురు చూపును
నేను ఉచ్వాస నిశ్హ్వాలలో
ఎక్కడా ఎక్కువ సమయం
నిలుపలేని నిర్భాగ్యున్ని
నేను చంచలుడిని
అశాస్వతాన్ని
నేను నేను కాదు
మళ్లీ మళ్లీ కలిగే ఈ భావనకు
అనాధార రూపాన్ని
నేను నేను కాదు
మళ్లీ మళ్లీ కలిగే ఆ భావన పేరు ప్రేమేనా?
25.10.2016
నా తండ్రిని జ్ఞాపకం చేసుకోవడమంటే నా కొడుకునూ జ్ఞాపకం చేసుకోవడమే. నా కొడుకుకు భవిష్యత్తులో నేనేమవుతానో?
అనుభవాలుంటే జ్ఞాపకాలుంటాయి
25.09.2016
విలువలు మాట్లాడడానికే ఉన్నప్పుడు పోట్లాటలు సర్వసాధారణం
The rationality can make the good despite bad nature
-inspiration from Thomas Hobbes
27.08.2016
మనల్ని భాధ పెట్టినోళ్లని మనం బాధ పెట్టలేక, మనకు దొరికినోళ్లని నలిపేస్తాం. ఇది 'అప్రకటిత' సామాజిక కట్టుబాటు. అణచివేతకు సమాధానం మనపైనున్న పొరకు మాత్రమే చెబితే సరిపోదు, అన్ని పొరల అంతానికి చేరుకోవాలి. అంత శక్తి ప్రతీకారం తీర్చుకునే ద్వేషంలో లేదు, మమకారం పెంచుకునే మైత్రిలోనే ఉన్నది. సోచా తో, సోచాలయ్ బనేగా!
22.08.2016
కష్టపడమని బోధించే ప్రతీవారు ఎలా కష్టపడాలో నేర్పించినపుడే ఆ ఉచిత సలహా అనుచితంగా ఉంటుంది
21.08.2016 - 15.42
Imperfect will search for perfection
Perfect will accept imperfection
18.08.2016
పడిపోవడమూ, నిలబడడమూ ఏదీ అకస్మాత్తుగా జరుగదు. అది కేవలం గమనాన్ని గమనించకపోవడం వలన కలిగే భ్రమ
17.08.2016
మనకున్న నమ్మకం బలమెంతో మనకొచ్చిన కష్టం బరువు చెబుతుంది
12.08.2016
వర్గీకరణాలెన్ని జరిగినా ఫలితాల ముందు వరుసలో ఆ వర్గపు శ్రేష్టులే ఉంటారు. వర్గీకరణలు ఏ శక్తికి వ్యతిరేకం కాదు, ఏ సమస్యకూ అంతిమ పరిష్కారం కాదు. వర్గీకరణలు అవసరాలు. ఒక గమ్యం మరో గమ్యానికి మార్గం వెతుకుతుంది. ఒకరి సౌకర్యం మరొకరి అసౌకర్యానికి తెరతీస్తుంది. ఫలితాలు వర్గాలకు పరిమితమైనంత వరకూ వర్గీక"రణా"లు అవసరమవుతూనే ఉంటాయి.
11.08.2016
గమ్యాన్ని చూడగలిగితే చాలు.. పయనం నడచిపోతుంది
11.08.2016
Whatever we are enjoying today is because of the potential thoughts of our predecessors. It is our turn now. If not, the chariot will roll back.
10.08.2016
బాహ్య పొరల నుండి వచ్చే ఏడుపుకు బరువు తక్కువ
అంతఃపొరల నుండి ఆపుకోలేని ఏడుపుకు కాఠిన్యం ఎక్కువ
7 August 2016 17:34 2016
ఆత్మ గౌరవం అర్ధం మారలేదు
నేపధ్యం మారలేదు
పోరాట స్పూర్తి, రీతి మారలేదు
మారేది మనుషులే
మార్చేది అవసరాలే
7 August 2016 11:02
స్నేహం ఆలోచనలా కాదు
అనుభవంలో ఉండాలి
ఆలోచన మారిపోతుందో గానీ
అనుభవం మిగిలిపోతుంది
7 August 2016 07:50
కొట్టుకునేంత కోపాలున్నోళ్ళు కలిసి రాజ్యాలేల్తారా? పంచుకోడానికి తట్టుకోలేనోడు పాలించడానికి అర్హుడా?
సర్టిఫికేట్ కోసం సదువుకున్నోడికి, సమాజం కోసం సదువుకున్నోడికి తేడా అదే మరి!
అర్ధం సేసుకోకపోయినా పర్లేదు గానీ, అపార్ధం సేసుకుంటే ఉన్నదీ, ఉత్తినే వచ్చిందీ రెండూ పోతాయిి
4 August 2016 11:11
మనసు నిశ్చలంగా ఉంటే వాస్తవాలు కంటికి క్లోజప్ లో కనిపిస్తాయి
3 August 2016 13:00
'నా' గురించి ముందుకెళ్ళే పయనంలో 'నావి కాని' అనుభవాలెన్నో
3 August 2016 08:46
ఢిల్లో గుండెలపై దండోరా
శ్రేయోరాజ్య ఫలాల సమ పంపీణీ కోసం
సామాజిక న్యాయ వ్యవస్థ బలోపేతం చేయడం కోసం
అట్టడుగు వర్గాల ఆకలిని, ఆక్రందనను, ఆవేదనను
దేశ వ్యాపితం చేయడం కోసం
సమ పంపిణీలోనే సమానత్వం ఉందని చాటి చెప్పడం కోసం
సమానత్వంలోనే సమైక్యత వేయిపూలు పూస్తుందని
దిక్కులు పిక్కటిల్లేలా చెప్పడం కోసం
వర్గాలు, వర్గీకరణలు లేని సమాజం
దోపిడీకి మూలబిందువతుందని
వివరించడంకోసం
దళిత విద్యార్ధి సంఘం ఢిల్లీ పయనమవుతున్న
సందర్భంగా ....
వీరులందరికీ
నీల్ సలాములు!
జాంబవ సలాములు!!
1 August 2016 11:12
ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది
ఒక్కో మబ్బు మరుగైనకొలదీ
ఒక్కో తెర తొలగినకొలదీ
అంబేద్కరుతోనో, ఆల్వా ఎడిసన్ తోనో పోల్చుకునే కష్టాలు నాకేమున్నాయి. వాళ్లకున్న కష్టమూ, కష్టపడే తత్వమూ రెండూ లేవు.
నలుపు-మెరుపు-పదును = tools for assessment;
జన్మతః వచ్చిన నలుపు, శుభ్రతతో వచ్చిన నునుపు / మెరుపు, చదువు ద్వారా నేర్చిన మాటల పదును. ఇవన్నీ కలగలిపిన వ్యక్తి ఎవరైనా కనిపిస్తే ఈ సమాజానికి వెంటనే confirmative doubt వచ్చేస్తుంది. అంత doubt ఎందుకు, confirm చేసేసుకోవచ్చు కదా. ఈ చైతన్యం అక్కడిదేనని.
Do not make Buddha and Ambedkar as gods. The other religion may develop hatred. Consider them as greatest human beings. They are very much needed for the future.
మనకు జ్ఞానం రానంతవరకే మన వెనుకబాటుకి వేరొకరు కారణం అవుతారు. మనకు జ్ఞానం వచ్చిన తరువాత వారు మన తిరుగుబాటుకు కారణం అవుతారు. వెనుకబాటుకి మరియు తిరుగుబాటు మద్య దూరాన్ని మాత్రం మీరే అంచనా వెయ్యాలి
మనం మనుషులం. మనషుల కోసమే బ్రతుకుతున్నాం. ఈ విషయాన్ని అర్ధం చేసుకోని ఏ మనిషిని భవిష్యత్తు క్షమించదు. Every action will have reaction, it is equal to the pain I have taken. Your survival is until I take the pain. ఒకవైపే చూడొద్దు, రెండో వైపు కూడా చూడు. ప్రళయం పరిగెత్తుకొస్తుంది.
we are not made for each other
we made each 'the' other
we made each 'the' other
వాగ్దానాలు అతని పెదవి చివరన ఉంటాయి
వాటి ఖండనలు ఆమె పలువరుసలలొ ఉంటాయి
అతను ఆసువుగా అస్పష్టతను సృష్టించగలడు
ఆమె చిరునవ్వుతో స్పష్టతను రప్పించగలదు
వారికి వారేమవుతారో తెలియదుగానీ
నా ధృష్టిలో వారిద్దరూ
made for each other !
వాటి ఖండనలు ఆమె పలువరుసలలొ ఉంటాయి
అతను ఆసువుగా అస్పష్టతను సృష్టించగలడు
ఆమె చిరునవ్వుతో స్పష్టతను రప్పించగలదు
వారికి వారేమవుతారో తెలియదుగానీ
నా ధృష్టిలో వారిద్దరూ
made for each other !
నేనెప్పుడూ తప్పు చేయనని వాదిస్తుంది తను
తను చేసింది తప్పెందుకు కాదో వివరిస్తున్నాడు అతను
ఎవరూ సాయమందించలేని దూరంలో ఉన్నారిద్దరూ
తను చేసింది తప్పెందుకు కాదో వివరిస్తున్నాడు అతను
ఎవరూ సాయమందించలేని దూరంలో ఉన్నారిద్దరూ
Feelings cannot shown as feelings. Feel demands actions to make others feel. Caste is a feeling and violence is an action. I have never heard about caste DNA.
కులం గురించి మాట్లాడాలంటే గ్రౌండ్ లెవల్ రియాలిటీస్ మీద అవగాహన ఉండాలి. కేవలం పెరిఫెరల్ చర్చల వల్ల లాభం ఉండదు.
1st May
రిజర్వేషన్ ఇష్టం లేని వారెవ్వరూ ఉండరు.
కష్టం అంతా వేరేవ్వరో పొందుతున్నారనే.
కష్టం అంతా వేరేవ్వరో పొందుతున్నారనే.
1st May
రిజర్వేషన్ ఇష్టం లేని వారెవ్వరూ ఉండరు.
కష్టం అంతా వేరేవ్వరో పొందుతున్నారనే.
కష్టం అంతా వేరేవ్వరో పొందుతున్నారనే.
12 March
కలవడమే ప్రయోజనమైన ప్రతీ కలయిక మధురమైనదే
11 మార్చ్
సాటియైన సహాయం దొరికినపుడు ఫలితం త్వరగా, అందంగా వస్తుంది
9 మార్చ్
తప్పు ఉన్న వ్యక్తికి గెలుపు కావాలని ఆశ, ఓడిపోతానేమోనన్న భయం రెండూ ఉంటాయి.
తప్పు లేని వ్యక్తికి ఓటమిలెన్నైనా, అంతిమ విజయం నాదే అన్న నమ్మకం ఉంటుంది.
తప్పు లేని వ్యక్తికి ఓటమిలెన్నైనా, అంతిమ విజయం నాదే అన్న నమ్మకం ఉంటుంది.
8 మార్చ్
ఇచ్చి-పుచ్చుకోవడం నేర్చినవాడు శక్తివంతుడు
తీసుకోవడం మాత్రమే నేర్చినవాడు బలహీనుడు
తీసుకోవడం మాత్రమే నేర్చినవాడు బలహీనుడు
4 మార్చ్
తల్లిదండ్రుల ప్రవర్తనకు ప్రతిరూపాలే పిల్లలు
3 మార్చ్
ఎన్ని సార్లు మోసపోయానో అని లెక్క రాసుకోవడం దౌర్భాగ్యమే కానీ మోసగాడు నిన్ను బహిరంగంగా దోషిని చేస్తుంటే చిట్టా విప్పక తప్పదు కదా
అనుభవం లేనోడికి లోపాలు కనిపిస్తాయి
అనుభవం ఉన్నోడికి సామర్ధ్యాలు కనిపిస్తాయి
అనుభవం ఉన్నోడికి సామర్ధ్యాలు కనిపిస్తాయి
28 పిబ్రవరి
మనం వేసే విత్తనాలు రాతి నేల మీద పడ్డాయని తెలిసీ, మొక్కలు వస్తాయని ఎదురు చూడడం ఎంత మూర్ఖత్వం.
కొండలను పిండి చేసి, నేలను చదును చేసి, నీటిని మళ్ళించి, ఇంకా అవసరమైనవన్నీ చేయగలిగితేనే ఆ ప్రాంతం పై ఆశను పెట్టుకోవాలి. అలా కాని పక్షంలో ఆ నేలను వదిలేయాలి.
కొండలను పిండి చేసి, నేలను చదును చేసి, నీటిని మళ్ళించి, ఇంకా అవసరమైనవన్నీ చేయగలిగితేనే ఆ ప్రాంతం పై ఆశను పెట్టుకోవాలి. అలా కాని పక్షంలో ఆ నేలను వదిలేయాలి.
బాధ్య్తతల భాష అర్ధం కానంత వరకూ జీవితం ముందుకు సాగదు
25 పిబ్రవరి
గెలుపు గమ్యమైనోళ్లకి ఓటమిలన్నీ పాఠాలే
22 ప్రిబ్రవరి
ఈ దేశంలో ఉన్న బాధల జాబితా కావాలి. ఎక్కడ దొరుకుతుంది. సమాచార హక్కు చట్టం ద్వారా పొందాలనుకుంటున్నాను.
19 ప్రిబ్రవరి
ఓ మనసా ఓ మనసా
అన్నీ తెలుసని అంటావు
అయినా తడబడుతుంటావు
చేసేదంతా ఒప్పంటావు
తప్పులెన్నో చేస్తుంటావు
చూసేదంతా నిజమంటావు
గమ్యం మాత్రం చేరుకోవు
నాలోనే ఉంటావు
నన్ను నడిపిస్తావు
నాకే తెలియకుండా
నాతో ఆడుకుంటావు
ఓ మనసా ఓ మనసా
అన్నీ తెలుసని అంటావు
అన్నీ తెలుసని అంటావు
అయినా తడబడుతుంటావు
చేసేదంతా ఒప్పంటావు
తప్పులెన్నో చేస్తుంటావు
చూసేదంతా నిజమంటావు
గమ్యం మాత్రం చేరుకోవు
నాలోనే ఉంటావు
నన్ను నడిపిస్తావు
నాకే తెలియకుండా
నాతో ఆడుకుంటావు
ఓ మనసా ఓ మనసా
అన్నీ తెలుసని అంటావు
18 పిబ్రవరి
I love the love
I hate the hate
both are my feelings
but I am not great
because I couldn’t love hate
I hate the hate
both are my feelings
but I am not great
because I couldn’t love hate
సమస్యలు పరిష్కరించడం సృష్టించినంత సులభం కాదు
16 పిబ్రవరి
మధురమైన వ్యక్తులే మధురమైన జ్ఞాపకాలను ఇవ్వగలరు
13 పిబ్రవరి
కోపం
ద్వేషం
ఆసూయ
చిరాకు
వదిలించుకుంటాం
ప్రేమైతే
అల్లుకుపోతాం
ద్వేషం
ఆసూయ
చిరాకు
వదిలించుకుంటాం
ప్రేమైతే
అల్లుకుపోతాం
12 పిబ్రవరి
Unity is a purpose in which both personal interest and self respect are upheld
11 February
విలువలు
వలువలు
ఐచ్చికాలు
నచ్చితేనే
తీసుకుంటాం
వలువలు
ఐచ్చికాలు
నచ్చితేనే
తీసుకుంటాం
10 February
Who am I does not depend on the huge terminology I use but on the small actions I do.
9 February
తీరం చేరే వరకూ
గాయం మానే వరకూ
భరించక తప్పదు
గాయం మానే వరకూ
భరించక తప్పదు
మీ పిల్లల జీవితాలను నిలబెట్టడంలోనూ, పడగొట్టడం లోనూ మీ బాధ్యత ఎంత అని అడిగితే ఎంత మంది తల్లిదండ్రులు నిజాయితీగా బాధ్యత వహిస్తారు.
4 February
యువతరానికై ఇస్తున్న ఈ సందేశం
నవతరానికై రాస్తున్న ఈమార్గం
రా.. దిగిరా..
ఇది బతికించే పాట
బతకాలనిపించే ఆట
నీ చేతల్లో మరణాన్ని
దూరం చేసే మాయాజాలం !!
నవతరానికై రాస్తున్న ఈమార్గం
రా.. దిగిరా..
ఇది బతికించే పాట
బతకాలనిపించే ఆట
నీ చేతల్లో మరణాన్ని
దూరం చేసే మాయాజాలం !!
అలసిన మనుసు సొలేస్ కావాలి వద్దంటామా
అలసిన తనువుకు నిదురే శరణం కాదంటామా
తనువు కన్నా ముందే
మనసు అలసిపోతే
కేంపస్ మొత్తం రౌండ్ కొట్టేయ్
నచ్చినోళ్లకు కన్ను కొట్టేయ్
గురువులొస్తే సలాము కొట్టేయ్
సీనియర్లొస్తే సొల్లు కొట్టేయ్
కొట్టీ కొట్టీ కొట్టీ కొట్టీ
అలుపంతా ఆరబెట్టి
కడుపుకింత బువ్వపెట్టి
గాఢనిద్రలో జారుకో
తెల్లారి నిను నువ్వు చూసుకో !! ఇది!!
అలసిన తనువుకు నిదురే శరణం కాదంటామా
తనువు కన్నా ముందే
మనసు అలసిపోతే
కేంపస్ మొత్తం రౌండ్ కొట్టేయ్
నచ్చినోళ్లకు కన్ను కొట్టేయ్
గురువులొస్తే సలాము కొట్టేయ్
సీనియర్లొస్తే సొల్లు కొట్టేయ్
కొట్టీ కొట్టీ కొట్టీ కొట్టీ
అలుపంతా ఆరబెట్టి
కడుపుకింత బువ్వపెట్టి
గాఢనిద్రలో జారుకో
తెల్లారి నిను నువ్వు చూసుకో !! ఇది!!
“Ambedkar pointed out what makes a society is not the proximity of living quarters but the existence of true and open communication. Thus untouchables needed their own electorates – ‘their right to choose their own representatives’ because there was no ‘like-mindedness’, no mutuality of respect and reverence between the caste Hindus and untouchables” - from Democratic Experimentalism (ed) by Brain E. Butler.
[Dr. Ambedkar mentioned it during Communal Award to Ramsay Mcdonald]
'like-mindedness' is the term I am reminded when I heard about court stay on Osmania university beef fest. Caste Hindus would never understand the other side. This is the high time for all the like-minded people to come together to use the power of the constitution on 'beef ban' which has many facets.
6 December 2015 17:02
There is no issue with mind. It is only with settings. Change the settings to DBRA (Dr. B.R. Ambedkar) mode. You could find the hope, build the confidence, execute the action, and dedicate yourself.
27 December 2013 12:51
డబ్బులిచ్చి తిట్టించుకోవడం ఓ గొప్ప అనుభవం
6 December 2013 10:38
“I am fundamentally an optimist. Whether that comes from nature or nurture, I cannot say. Part of being optimistic is keeping one's head pointed toward the sun, one's feet moving forward. There were many dark moments when my faith in humanity was sorely tested, but I would not and could not give myself up to despair. That way lays defeat and death.”
― Nelson Mandela, Long Walk to Freedom: Autobiography of Nelson
4 December 2013 23:20
ఈ ప్రపంచాన్ని సొంతం చేసుకొనే వ్యక్తులు ఇద్దరు. ఒకరు మార్పు కోరుకునేవారు, రెండవది మార్పును అనుసరించే వారు.
29 December 2011 21:36
నువ్వంటే తెలిసినప్పటికన్నా, ప్రేమంటే తెలిసినప్పుడే నిన్ను దగ్గరగా feel అయ్యాను
26 December 2011 14:39
సంబంధం కలుపుకోవాలన్నా, తెంచుకోవాలన్నా నేపధ్యం తయారు చేయాలి. అప్పుడే మనతో ఉన్నవారు comfortable గా వుంటారు. లేకపోతే ఆక్సిడెంట్సే. ప్రమాదం జరుగకుండా, జరుపకుండా ఉండడం అందరికీ సుఖం
25 December 2011 16:55
If we abide to constitution of India,
If our goal is egalitarian society,
If our concern is rights of 'human's
How to justify burning manusmriti today remembering Ambedkar (25.12.1927).
which part of the constitution supports it?
which Human Rights Law accepts it?
What are we gaining at the end?
25 December 2011 07:38
"పిల్లల్లు తల్లిదండ్రులను అమ్మా, నాన్నా అని పిలుస్తున్నప్పుడు, తల్లిదండ్రులెందుకు కొడుకా, కూతురా అని పిలవకుండా, పేర్లు పెట్టి పిలుస్తారు" - మా సీనియర్ ఐదేళ్ల కూతురి ప్రశ్న ఇది.
21 December 2011 08:00
సాంప్రదాయ సమాజంలో ఆధునిక ఆలోచనలతో జీవించడానికి తమపై పరిపూర్ణ అవగాహన కావాలి, ధైర్యం కావాలి. ఈ రెండు కలబోసి డోలాయమానంలో ఉన్న ప్రతీసారీ ముందుకు నెట్టడానికి ఎప్పుడూ సిద్దంగా (ఆలోచనలలో) ఉంటారు మా విజయలక్ష్మి (Geography) మేడం .
20 December 2011 13:07
ఐదో తరగతిలో ’మన దేహం’ పాఠం చెబుతూ పాల్ విశ్వాసం మాశ్టారు ముఖాన్ని చల్లటి నీటితో కడగితే ఆరోగ్యం అని చెప్పి, అందుకే నేను వేడినీళ్ల స్నానంలోనూ ముఖాన్ని మాత్రం చల్లనీళ్లతోనే కడుగుతాను అని చెప్పారు. ఆరోజునుండి, ముఖం కడిగినప్పుడల్లా మాష్టారు మాట్లాడుతూనే ఉంటారు.
19 December 2011 07:47
“హృదయాలను కదలింపజేసే మైత్రి వుదంతాలు అనేకం ప్రాచీన చరిత్రలో మనకు గోచరిస్తాయి. హృదయాలను పులకరింపజేసే ప్రాచీనుల మానవ మైత్రీ గాధలను సైతం మరపింప జేసే స్నేహ సంబంధాలను ఆ విద్వాంసులిద్దరూ సంతరింపజేసుకున్నారు”.
-మార్క్స్ మరియు ఏంగిల్స్ ను గురించి లెనిన్
17 December 2011 22:24
వ్యక్తి తన యొక్క ఆత్మ చైతన్యాన్ని ఏకాకిగా కాక, సమాజంలో జీవించడం ద్వారా విస్తృతం చేసుకుంటాడు. ఆ సందర్భంలో ఆత్మ తనను తాను తెలుసుకోవడమే కాకుండా తన యిచ్చను తానే నిర్ణయించుకొని దానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది.
17 December 2011 08:17
మానవుని హోదాను, నైతిక స్థితిని పెంపొందించే ఆనందమే మిగతా వాటికంటే ముఖ్యం
16 December 2011 18:15
మనసును దాని తోవకు దాన్ని వదిలేయండి. మంచి ఆలోచనలు ఇవ్వండి. దాన్నే మానసిక శాస్త్రవేత్తలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు.
14 December 2011 08:08
Input కి, output కి మధ్య సంధికాలమే ఎదురు చూపు. ఆ సంధికాలాన్ని అర్ధం చేసుకోవడానికే జీవితకాలం.
9 December 2011 12:08
Every brick is important for a building
Every action is important for success
సవరణలు చేసే కొద్దీ దోషాలు కనిపిస్తాయి, నీతోనున్న వారు నీలో మంచితనాన్ని చూడలేని వారయితే.
The number of apps running in mind and duration of body charge has inversely proportional relationship

యూనివర్సిటీ శ్రీమంతుడు:
మొదటి చాప్టర్, చివరి చాప్టర్ రాసేసి, అందంగా అట్టేసి వెళ్ళిపోతాననుకున్నార్రా, నా ఆబ్జెకివ్స్ అర్దాలు, అనర్ధాలు గుట్టు తేలే వరకూ ఇక్కడనుండి కదిలేదే లేదు.
యు.జి.సి. నీకు చాలా ఇచ్చింది. తిరిగి ఇచ్చేయ్యాలి లేకపోతే లావయిపోతావు.
దళితుల ఐక్యత వర్ధిల్లాలి
* conditions apply
* conditions apply
... ఆ కోరికే తప్పేమో?
కోరికలేకపోతే కాలం కలిసొస్తుందా?
కోరికలేకపోతే కాలం కలిసొస్తుందా?
No comments:
Post a Comment