హలో అన్న మగ గొంతు విని, సార్ ఇక్కట To-let poster కనిపించింది, నేను interested గా ఉన్నాను, కొంచెం వివరాలు చెబుతారా అంటూ short గా, smart గా చకచకా అడిగింది నికిత. సరే మనం ఆదివారం కలుద్దాం. నేను ఉదయం పది గంటల నుండీ సాయంత్రం వరకూ నేను అక్కడే ఉంటాను అన్నది ఆ మగ గొంతు. Thanku sir అని చెప్పి phone cut చేసింది నికిత. ఈ ఇల్లు ఎలాగైనా నాకే వస్తే బావుండును. రాజీవ్ స్వగృహ ambiance చాలా బావుంటుంది. సాయంకాలం ఆ చల్లటి గాలిలో walking చేస్తూ ఉంటే శరీరం తేలిక అవుతుంది. రాత్రి భోజనాలయ్యాక parking place దగ్గరలో తన భర్తతో కబుర్లు చెబుతూ ఉంటే మనసు గాలిలో తేలిపోతుందేమో అనుకుంటూ మురిసిపోతుంది.
ఆదివారం ఎట్టి పరిస్తితులలోనూ తను church కి వెళ్లడం మానదు. కానీ ఇంటి అవసరాన్ని గుర్తుంచుకొని, దేవుడి సమయాన్ని సాయంత్రానికి postpone చేసి 9.30 am కే పక్కనే ఉన్న తన friend ఇంట్లో ఉండి owner కోసం ఎదురుచూస్తూ ఉంది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు owner వచ్చాడు. వస్తూనే నికిత ను ఒకింత పరిశీలనగా చూసాడు. నుదుటన బొట్టు లేకపోవడం గమనించి, "నేను Christians కి ఇల్లు ఇవ్వను" అన్నాడు. నికిత ఒక్క క్షణం విస్తుబోయింది. వెంటనే కోలుకుని మేము converted Christians, మేము కాపులం అంది. కాలానుగుణంగా Christians అంటే Scheduled Caste అనే అర్ధాన్ని దలితులు మరియు మిగతా సమాజం తయారు చేసింది. అందుకే నికిత తన కులాన్ని బయటికి తీసింది. అయినా ఆ owner తగ్గలేదు. మరోసారి తన నిర్ణయాన్ని ఖరాఖండిగా చెప్పేసాడు.
నికిత కోపంగా బయటికి వచ్చేసింది. నా ముఖంలోకి చిరాగ్గా చూసి మీ university లో ఉద్యోగస్తులందరూ ఇంతేనా అంది. అత్యుత్తమ విశ్వవిద్యాలయం అనే చెప్పబడే చోట, అత్యున్నంతంగా పాటించే కుల, మత వ్యవస్థల గురించి ఒక్క మాటలో చెప్పలేం కదా. సర్లే ఇంకో ఇల్లు వెతుకుదాం పద అని అక్కడ నుండి కదిలాం.మన clarity ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు అని మనం నివశిస్తున్న సమాజానికి ఎందుకు అర్ధం కాదు. బయట poster లోనో లేక ఫోన్లో మాట్లాడినప్పుడో తను ఎలాంటి వారికి అద్దెకివ్వాలనుకుంటున్నాడో చెబితే సరిపోతుంది కదా. అన్ని రోజులు, అన్ని గంటలు wait చేయించిన తరువాత చావు కబురు చెప్పడంలో వారు పొందే పైశాచిక ఆనందం ఏమిటి, పైగా నేనూ University of Hyderabad లోనే పనిచేస్తాను అని గర్వంగా చెప్పడం.
Discussion:
3 comments:
మీరు పూజ చేసి గంట కొడుతారు... మాకు అది పడదు. మేము మీకు హౌస్ రెంట్ కి ఇవ్వం అని మమ్మల్ని 6 గంటలు వెయిట్ చేయించి మరీ చెప్పారు. ఒక క్రిస్టియన్ కుటుంబం. మరి దానికి ఏమి అంటారు?????????
మీరు పూజ చేసి గంట కొడుతారు... మాకు అది పడదు. మేము మీకు హౌస్ రెంట్ కి ఇవ్వం అని మమ్మల్ని 6 గంటలు వెయిట్ చేయించి మరీ చెప్పారు. ఒక క్రిస్టియన్ కుటుంబం. మరి దానికి ఏమి అంటారు?????????
Anonymous? Fine. Insult is an insult whatever may be the reason and whoever may be the person.
Can you please elaborate the full story. It adds to my theorization.
Post a Comment