Saturday, October 15, 2011

All is not well

డైరీలో విషాదకరమైన పేజీకి రేటింగిస్తే, ఖచ్చితంగా ఈ పేజీకి టాప్ రేటింగిస్తాను. ప్రయత్నలోపం, మొహమాటం, comfort zone, భయం, కలగలిపి ఇచ్చిన పెద్ద ఫలితం.

ఆ రోజు కోసం చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నాం. ఇన్ని మంచి లక్షణాలున్న వీడికి పెళ్ళెందుకు కావడం లేదు. ప్రతీ పెళ్ళిలోన వాడిమీద జోకులే. నా కూతురు ఎదిగే వరకూ ఆగరా పెళ్ళి చేస్తాను అనే వాడు మాలో ఒకడు. ప్రతీ కలయికలోనూ, మన తరువాత కలయిక ఎవరి పెళ్ళిలోనో అన్న ప్రశ్నకు వాడూ ఒక prabability గా కనిపించేవాడూ. కానీ కుదిరేది కాదు. వాడి పేరే తలారి వెంకట వీర్రాజు. మాకు మాత్రం ముద్దుగా TV.

వాడికి పెళ్ళి కుదిరింది. రెండు నెలల ముందే అందరికీ సందేశాన్ని అందజేసాం. వీడి పెళ్ళికి వీలైనంత ఎక్కువ మంది కలవాలి. వాడు సామాన్యుడు కాదు. వాడి contribution అంత సులువైనది కాదు. ఏడు సంవత్సరాలు కలసి చదివి, పధ్నాలు సంవత్సరాల తరువాత తిరిగి కలవాలన్న ఆలోచనలో ఒక మూలం. పధ్నాలుగు సంవత్సరాలుగా దూరమైన ఉపాధ్యాయుల వివరాలను వారం రోజులలో సంపాదించి వారందరితో మాట్లాడేసిన వీరుడు. చిన్నప్పుడు ఎప్పుడో దూరమైన స్నేహితులు విదేశాలలో ఉన్నారని తెలిసి, వారిని ఫోనులో కౌగలించిన ప్రేమ పిపాసి. అత్యంత అధ్భుతంగా జరిగిన Honour the Teacher కార్యక్రమ కధ, కధనం, దర్శకత్వానికి వాడో ధైర్యం. అంత ఆనందాన్నివాడు కళ్లారా చూసుకోలేక పోయాడు. అర్జంటుగా అమెరికా వెళ్ళాలి. తప్పలేదు. వెళ్ళాడు. కాబట్టి వాడి పెళ్ళినో మరో ఆనంద నిలయం చేయాలి. ఈ ప్రేమలో వాడు తడిసిపోవాలి. ఆ క్షణం వాడితో పాటు, తన భాగస్వామి కూడా ఉండడం, అనిర్వచనీయం.

నెలరోజులముందే tickets బుక్ చేసాం. ఇంకా మరపురాని అనుభూతులు మిగలాలని మారేడుమిల్లి అడవులలోకి ప్లాన్ చేసాం. ఎందుకంటే అక్కడి forest officer కూడా మా వాడే. ఒకరోజు ముందుగానే సెగ మొదలవ్వాలని అనుకున్నాం. ఆ రోజు కోసం ఎదురుచూస్తూ (లేటయిన) నా పనులన్నీ త్వరత్వరగా ముగించేస్తున్నా. ముఖ్యంగా నా పి.హెడి. ఎందుకంటే ఒక్కసారి మా వాళ్లను కలసిన తరువాత బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది. అనుకున్నట్టే జరిగింది. గబగబా రాసిందంతా తీసుకెళ్ళి గురువుగారికిచ్చాను.

’ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావా? ఇక్కడే ఉంటున్నావా? అన్న గురువుగారి ప్రశ్నకు ’ఇక్కడే ఉంటున్నా సార్’ [1] అని ఒక అబద్దం చెప్పేసాను. ఇలాంటి సమయంలో నిజం చెప్పాలంటే ధైర్యం సరిపోలేదు. ఫలితం ఎలా ఉంటుందోనని భయం వేసింది. కానీ ఆ క్షణం నాకు తెలియలేదు నా కల భగ్నం అవ్వడానికి నేను బీజం అప్పుడే వేసానని. ’సరేనయ్యా ఈ నెల 14 తేదీన మన సెంటరు తరుపున ఒక సెమినార్ ఉంది’ అని గురువుగారు అనగానే ఒక్క క్షణం మాట్లాడలేకపోయాను. వెంటనే తేరుకొని ’o.k' సార్ అని చాలా strong గా చెప్పాను, ఆ క్షణంలో plan మార్చేసి.- పెళ్ళికి ఒకరోజు ముందు వెళుతున్నాం. నేను drop అవుతాను, పెళ్ళి వెళితే సరిపోతుందు కదా [2]-

సెమినార్ పదకొండు గంటలకు ఉండొచ్చు. తత్కాల్ తీసుకుంటే డైరెక్టుగా పెళ్ళి కి వెళ్ళొచ్చు. పరవాలేదు మనలో తెలివితేటలు బాగానే ఉన్నాయి అనుకొన్నా. కానీ అలా జరుగలేదు.
12, 13, 14 రైల్ రోకో గుర్తు చేసారు మిత్రులు.
అయినా పరవాలేదు. 14 సాయంత్రానికి అయిపోతుంది. మన ట్రైన్ రాత్రికి కదా. ఓ ధైర్యం.
మళ్ళో ఇంతలో మళ్ళీ మార్పు. రైల్ రోకో 15,16,17 కి మార్చారు. అయినా పరవాలేదు. వెళ్ళడానికి ఉండదు. వచ్చేటప్పటి సంగతి తరువాత ఆలోచిద్దాం.
ఆ తరువాత తెలిసింది సెమినార్ ఉదయం కాదు. సాయంత్రం 4.30 కి. సగం ఆశలు ఆవిరి అయిపోయాయి. అది ముగిసేదెప్పుడు, నేను బయలుదేరేదెప్పుడు. కానీ ఏదో చేయాలి. ఎలా. I wanted to be creative. సరే ఓ పనిచేద్దాం. సెమినార్ కి వెళ్ళి, సార్ కి కనిపించి చివరి వరకూ ఉండకుండా చెక్కేద్దాం. స్వామి కార్యం, స్వకార్యం రెండూ నడుస్తాయి [3].

అరగంటలో ఇంటికి వచ్చి, సాయంత్రం 7.30 MMTS పట్టుకొంటే అంతా సవ్యంగా జరుగుతుంది. ఏం పరవాలేదు. All is well అనుకుంటూ సభా ప్రాంగణానికి వచ్చాను. అప్పుడే గురువు గారు కనిపించారు. కనిపించగానే పిలిచారు. [ఉదయం నుండీ ఆయనకు కనిపించలేదు]. ’నువ్వు రికార్డింగ్ చేయాలి’ చెప్పేసారు. నేను అప్పటికి నిర్మించిన నా creativity ని చిరునవ్వుతో చిదిమేసారు. Start Action ఎవరో తరుముతున్నారు. నేను పరుగెడుతున్నాను. నేనొక్కడినే పరిగెడుతున్నాను. నాతో ఎవ్వరూ రావడం లేదు. అతిధి రాలేదు, వినేవారు రాలేదు. ఎప్పటికి వస్తారు వీళ్లంతా. నేనింగా వేగంగా పరిగెడుతున్నాను. ఎవరో ఒకరు రాకపోతారా అని. Speaker ఎలా మాట్లాడుతారు. short గానా, leghthy గానా? త్వరగా ముగించేస్తే బావుండును కదా! ఆలోచనల పరుగుపందెం.

’ఏమి తిని వెళ్తావు, pack పెట్టమంటావా’ అమ్మ ఫోను, ’నేను తినను, తీసుకెళ్లను దయచేసి నన్నోదిలేయ్’ విసుక్కున్నాను. ’బావగారూ మీకోసం ఎదురు చూస్తున్నా. మిమ్మలిని drop చెయ్యాలి కదా’ మా చెల్లెలి భర్త. చివరకు 7.10 p.m క్ ముగిసింది సభ. బయటకు వస్తుంటే ఒక సీనియర్ ప్రొఫెసర్ పలుకరింపు. మా సార్ నా గురించి చెప్పారంట. ఆమె చెప్పుకుపోతున్నారు. నాకు వినాలని లేదు. వినే టైమ్ లేదు. అర్ధమనస్కంగా నవ్వి వచ్చేసాను. బయటకు వచ్చాను. మా సార్ అతిధులను పంపిస్తునారు. సార్ నేను సోమవారం కలుస్తా. ఇప్పుడూ కారణం చెప్పలేదు. బండి వీలయినంత వేగంగా ప్రయాణిస్తుంది.

ఇంటికొచ్చేసరిక్కే 7.30 p.m. నేననుకున్న MMTS వెళ్ళి పోయింది. అమ్మ కోరిక నెరవేరింది. నేను కొంత తిన్నాను. next MMTS 8.10 pm కి ఉంది, సికందరాబాదు 8.55 కి చేరుతుంది. పరవాలేదు. గౌతమి 9.15 కి. ఎలాగూ కొంత late అవుతుంది. చేరిపోతాను. all is well. ఈ సమయంలో లింగంపల్లి స్టేషన్ కి వెళ్లకూడదు. ఒక వేళ నేనున్న platform మీదకి ట్రైన్ రాకపోతే? ఉన్న ఒక్క అవకాశమూ పోతుంది. చందానగర్ స్టేషన్ కి వెళ్తాను. తప్పకుండా ట్రైన్ దొరుకుతుంది (చోటు దొరకక పోయినా) అనుకున్నాను. అంతా జరిగింది. కానీ ట్రైన్ 8.30 కి వచ్చింది. ఏం చేయాలి. వెళ్లాలి. చివరి క్షణం వరకూ ప్రయత్నించాలి. భవిష్యత్తును నా చేతుల్లో లేదు, చేతల్లోనే ఉంది. ఎక్కేసాను. ఇప్పుడు నా మనసు గడియారం చుట్టూ తిరుగుతుంది. ఆశ ఊడలమర్రిలా పెరుగుతోంది. గౌతమి ట్రైన్ నాకోసం లేట్ గా బయలుదేరాలి. ఎన్ని సార్లు refresh కొట్టినా అదే ఆలోచన మళ్ళీ fresh గా. 9.20 కి MMTS సికిందరాబాదు చేరుకుంది. గౌతమి ఏ platform లో ఉంది? ఎనిమిది చెప్పారు ఎవరో. నాకు వీలయినంత త్వరగా నాలుగో platform నుండి foot over bridge మీదకు వచ్చి చూసాను. ఎనిమిదో నంబరు ప్లాట్ ఫాం ఖాళీ గా ఉంది. ఆమే నంబరు తప్పు చెప్పిందా. చుట్టూ చూసాను. అప్పటికే ఇరవై నిమిషాలు లేటయిన ’గౌతమి’ సగం ప్లాట్ ఫాం దాటేసింది.

భారమైన శ్వాస, కారుతున్న చెమట. ట్రైన్ దూరమైపోయే వరకూ చూస్తూనే ఉన్నాను. వేరే ట్రైన్ ఏమైనా? ఆలోచిస్తున్నాను. ఎవరో ఎనిమిది నుండి పైకొచ్చారు. వెళ్ళింది గౌతమి టైనేనా తెలిసినా అడిగాను. అబ్బబ్బ కాలు పెట్టడానికి కూడా లేదు అని బాధ పడుతూ వెళ్ళిపోయాడు. నేనిక వెళ్లలేను. పూర్తిగా నిర్ణయించుకున్నాను. తెల్లారితే బంద్. సాహసం నా వల్ల కాదు. ఓ ఫ్రెండ్ కొ ఫోన్ చేసి విషయం చెప్పి, వెనక్కి బయలు దేరా. ఇంకెవ్వరికో ఫోన్ చెయ్యడానికి లేదు, చార్జింగ్ అయిపోయింది.

ఇంటికొచ్చేసరికి రాత్రి పదకొండున్నర. చాలా సేపు ఫోన్ ఆన్ చేయలనిపించలేదు. అలాగే చార్జింగ్ పెట్టా. ఇంటర్ నెట్ ఓపెన్ చేసి, రేపు ఉదయం ప్రయాణించడానికి వీలవుతుందేమోనని ప్రయత్నించాను. కానీ నెట్ సహకరించలేదు. వదిలేసి వెళ్ళి పడుకున్నాను. తెల్లారింది. ఫోన్లు వినిపిస్తున్నాయి. నేను లేవడం లేదు. నాకు లేవాలని లేదు. ఇప్పుడు అందరికీ సంజాయిషీ చెప్పాలి. అది నాకు ఇష్టం లేదు. ఫోన్ దగ్గరకు వెళ్ళలేదు. ఆగని ఫోన్లని చూసి వెళ్ళాను. మా పెళ్ళికొడుకు.

రాత్రి నీకు ట్రై చేసాను. నీ ఫోన్ పనిచేయలేదు. నా credit card నంబరు చెబుతాను, flight try చేయి అన్నాడు. ఉత్సాహం లేసొచ్చింది. నేనెప్పుడూ ఎక్కలేదు. నాకా ఆలోచన రాలేదు. వెంటనే నెట్ తెలిచాను. రాత్రికన్నా అద్వాన్నమైన పరిస్తితి. సమయం 7.30 am. నాకు తెలిసినవాళ్ళు ఆ సమయంలో నిద్రలేవరు. నేనూ వాళ్లను లేపలేను. system అంతా కెలికేస్తున్నాను. ఎలాగైనా connection వస్తే బావుండును అని. అవ్వలేదు. 8.30 నుండి అందరినీ లేపడం మొదలు పెట్టాను. కానీ నేను వెళ్ళేంత సమయం లేదు. నాకు నెట్ కనెక్ట్ అయ్యింది. ఒక flight దొరికింది. మావాడు నంబరు పంపించాడు. కానీ బుక్ చేసుకొనే లోపులోనే sold out.

ఒక్కమాట గురువుగారికి చెబితే అన్నీ సక్రమంగా జరిగేవి. కొన్ని గంటలలో వాడి పెళ్ళి, నేను లేకుండా.



1 comment:

Krishna Chaitanya said...

its so disappointing..I am sad.