Sunday, September 25, 2011

తప్పు చేయడం is default quality

నా చిన్నతనంలో నేను నేర్చుకొన్న మరొక విషయం: మనిషి సాతాను ద్వారా పాడయిపోతాడు, దేవుని ద్వారా బాగుపడతాడని. కాబట్టి ఎవ్వరి జీవితంలోనైనా మంచి జరిగితే అది దేవుని కృప అని, చెడు జరిగితే సాతాను శోధన అని చాలా publicity జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సన్నివేశం నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. అదేమంటే తెల్లారి లేస్తే ప్రభువా, ప్రభువా అనే ఒక స్నేహితుడు (యుక్త వయసు) ఈ సమాజం పాడైపోతుందని, అది నెమ్మదిగా చర్చి వద్దకు చేరిందని, దాని ప్రభావం వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అప్పటికే మనం చేసే ప్రతిపనికీ వెనుక ఒక తోకను తగిలించడాన్ని భరించలేకపోతున్న నాకు, ఇది పుండుమీద కారం చల్లినట్టయింది.

ఇంతకీ విశయం ఏమిటంటే "స్త్రీలు - వస్త్రధారణ - దైవత్వం". సింగిల్ ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు స్త్రీలు బైబిలు ప్రకారం లేరని, దాని వల్ల సమాజంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నది ఆయన వాదన. సమాధానం, మీకు, నాకు తెలిసు, కానీ ఆయనకు తెలియదు కదా. ఆరోజు నా వాదనతో ఆయన ఏకీభవించలేదు. నేను యేసుని ప్రార్ధించను కాబట్టి అలా మాట్లాడుతున్నానని, నిజమైన యేసును తెలుసుకొంటే నా మాటలు మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ పోస్టు ఆయనకే అంకితం.

Leading Role: Jesus
Supporting Characters: his disciples

యేసు ఒక public meeting లో ఇలా అంటాడు: "మనుష్యుని అపవిత్రునిగా చేయునది ఏదియు లేదు గానీ, లోపలినుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయును". కధలో అన్ని సమయాలలో వలెనే మరలా శిష్యులు ఇంటికి వెళ్ళిన తరువాత clarity ఇవ్వమని అడుగుతారు. అప్పుడు యేసు "మీరు ఇంత అవివేకులై ఉన్నారా! వెలుపలినుండి మనుష్యని లోపలికి వెళ్ళేది మనుష్యుని అపవిత్ర పరచదని మీరు గ్రహించ లేక పోతున్నారా! అలా బయట నుండి వెళ్ళేది, కడుపులోకి ప్రవేశించి, బహిర్భూమిలో విడచిపెట్ట బడుతుంది అని చెప్పి, దానిని కొనసాగిస్తూ, లోపలినుండి అనగా, మనుష్యుని హృదయలోనుండి దురాలోచనలును, జారత్వములును, దొంగతనములును, నరహత్యలును, వ్యభిచారములును, లోభములును, కృత్రిమములును, కామ వికారమును, మత్సరమును, దేవ దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నియు మనుష్యుని లోపలినుండే బయలువెళ్ళి, మనుష్యుని అపవిత్రపరచును"

మార్కు సువార్త దేవుని actions లో limitation ను ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే మొత్తం scene లో సాతాను లేడు. కాబట్టి ఎవరైనా ఈ పనులను సాతాను కి attribute చేస్తే అది ఖచ్చితంగా మనకి బాగా అలవాటయిన లక్షణం "పక్కవాడి మీదకు తోసెయ్యడం".

ఇంకో ఆసక్తి కరమైన విషయమేమంటే, పైనుదహరించిన నా స్నేహితుని పాస్టర్ గారు (ప్రస్తుతం ఆయన చాలా popular), వారు సభ్యులు కొంతమంది నుండి వచ్చిన letters ఆధారంగా చేసుకొని, 'ప్రురుషుల, యువకుల మనసు పక్కదారి పట్టకుండా స్త్రీలు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి' అని మూడు సార్లు వాక్యము ద్వారా హెచ్చరించడం కూడా జరిగిందట.

లోపలి కలిగిన feelings కి బయట వాళ్లని బాధ్యులను చేయడం ఏమంత న్యాయం.
Let's take the responsibility of our actions.

Source: Mark

2 comments:

Indian Minerva said...

Let's take the responsibility of our actions.

మీ మిగిలిన పోస్టులు చదవలేదుగానీ... మీరన్న ఈ వాక్యం నాకు బాగా నచ్చింది. చదివినతరువాత నేను వ్యతిరేక వ్యాఖ్యలుచేస్తే మీరు అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించాలి సుమా!! నాకు క్రీస్తు తెలుసనుకుంటున్నాను (అంటే రోమన్లు project చేసిన బైబిల్లో చెప్పబడిన క్రీస్తుకాదు) తెలియకపోతే మీరు చెప్పాల్సుంటుంది. Okay??

Suresh Kumar Digumarthi said...

తప్పకుండా అర్ధం చేసుకుంటాను. నాకు వేరే బైబిల్స్ ఉన్నాయని తెలుసుగానీ, చదివే అవకాశం రాలేదు. నా అవగాహన నేను చెప్పాను, మీ అవగాహన మీరు చెప్పండి. Thanks