ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
” యోహాను 1:1
వాక్యము అనగా మాటల కూర్పు. అంటే మనం మాటాడే ప్రతీ మాట దేవుని ఉనికిని తెలియజేసుంది. మాటను దేవుడు అనడంలో చాలా గొప్ప అంతరార్ధమే దాగి ఉంది. ఇప్పటి వరకూ మనం నమ్ముతున్నదేమిటంటే దేవుడు చాలా శక్తివంతుడని, తను తలచుకుంటే ఏమైనా కాగలదని, తనకి సాధ్యమైనదేదీ లేదని నమ్ముతాం. దేవుడు మనకు కనిపించకుండా, మనకు తెలియని ఆకారంలో ఉన్నాడని అంటాం. దేవుడిని మనం ఎన్నటికీ చూడలేమని, చూసే శక్తి మనకు లేదని, కేవలం ఆయన క్రియలను మాత్రమే చూడగలమని నమ్ముతాం. వీటన్నిటికీ సరిగ్గా సరిపోయేదే ’మాట’. అది ఎంత శక్తివంతమైనదంటే ’నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’. మనం జీవితంలో జరిగే ప్రతీ పనికి ముందు స్పందించేది మాట. ఎన్నో ఆలోచనల సమాహారం మాట. ఆలోచనలెంత గొప్పవైనా వాటిని మాటల రూపంలోకి తీసుకురావడానికి ఎవరైనా జాగ్రత్త వహించవలసిందే. ఆలోచన మాట రూపంగా మారిన మరు క్షణమే కార్యరూపం వైపు పరుగులు తీస్తుంది. “ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను...” అన్నియూ పలికినట్టుగా జరిగెను. కానీ మన ఆలోచనలను అక్కడితో హద్దులను నియమిస్తున్నాం. కానీ మనం జీవితంలో ప్రతీ క్షణం దేవుని శక్తిని చూస్తున్నాం. నేను కాకుండా నా మాటే చేరాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా టెలిఫోన్ వచ్చింది, తరువాత టెలిఫోన్ రంగంలో మనం ఖాళీ గా కూర్చుకొని, పనిలేక పలికిన ప్రతీ మాట ఈరోజు వాస్తవ రూపంలో మనద్వారా వాడబడుతుంది. మనం ఈరోజు అనుభవిస్తున్న ప్రతీ సౌకర్యం ఒకప్పుడు ఇలా జరిగితే బావుండును అనే మాట. కాలక్రమేణా అది కార్యరూపం. దేవుడనే (మాట) శక్తి నీలోనే ఉంది. ఆ శక్తిని నీవు ఎలా వాడుకుంటావు అనేది నీ ఇష్టం. నీవు ఎలా వాడినా ఫలితం మాత్రం తధ్యం.
"వాక్యము శరీరధారియై మన మధ్య సంచరించుచుండెను"
నిజం. వాక్యము (మాట) తనంతట తానుగా సృష్టించబడదు. దానిని నడిపించడానికి ఒక శరీరం కావాలి. శరీరం ద్వారానే ఇంకో శరీరానికి కార్యనిమిత్తమే చేరుతుంది. అందుకే మనం దానిని ’శరీరధారియై యుండును’ అని సూత్రీకరించవచ్చు. అందుకే బైబిల్ లో అప్పటి వరకూ లేని ఓ కొత్త సూత్రాలని బోధించడానికి ’యేసు’ అనే శరీర ధారిని సృష్టించ వలసి వచ్చింది. ఎందుకంటే మోషే విన్న ’అదృశ్య శక్తి’ కి కాలం చెల్లిపోయింది. పది ఆజ్నలను పాటించే వాడు కాదుకదా, గుర్తున్నవాడు కూడా ఆ సమాజంలో కనిపించలేదు.
జ్నానం: నీలో వున్న దేవుడి (మాట) శక్తిని ని నువ్వు గుర్తించలేనపుడు, నీకు ఏ దేవుడూ కనిపించడు, ఏది ఎందుకు జరుగుతుందో నీకు అర్ధం కాదు. నమ్మమని పదే పదే చావగొట్టటం తప్ప.
No comments:
Post a Comment