మనుష్యులనుద్దేశించి యేసు ఒక చక్కటి మాట అంటాడు. అదేమనగా ’పాపములు క్షమించుటకు మనుష్యు కుమారునికి అధికారము కలదని తెలిసికొనవలెను’ అని. నా జీవిత కాలంలో మనుష్యులకు ఈ అధికారమున్నదని ఎవ్వరూ చెప్పలేదు. అది మరి వారికి తెలియకో/ దాచవలెననో నాకు తెలియదు. అయితే ఒక్క మాట చదువగానే చిన్నప్పటినుండీ ఊపిరి పీల్చినంత సులభంగా, ప్రతీసారీ గుర్తుచేసుకొనే పరలోక ప్రార్ధన గుర్తొచ్చింది. ఆ చివరలో ఇలా ఉంటుంది "మేము మా యెడల అపరాధములను చేసిన వారిని క్షమించిన రీతిగా, నీవు/మీరు మా అపరాధములను క్షమించండి". చాలా బావుంది. నువ్వు ఎవరినైనా క్షమిస్తేనే, క్షమించబడతావు అని దారి అర్ధం. నిజానికి ఎంతమంది, ఎంతమందిని ప్రతీ రోజూ క్షమిస్తారో తెలియదు గానీ, అందరూ క్షమించానని మాత్రం దేవుడు (వారికి) కి చెబుతారు.
క్షమాపణ ఒక శక్తి అని చాలామందికి తెలియదేమో. లేకపోతే వారు నాకు ఎప్పుడో ఒకసారి దీని గురించి ఖచ్చితంగా చెప్పి ఉండేవారు. ఇంకా విచిత్రమేమంటే క్షమించడం అన్ని సార్లు వీలుకాదు అని, దేవుని ఉగ్రరూపాన్ని తట్టుకోలేమని మాత్రం చెప్పారు.
ఎవరు ఏమి చెప్పినా, యేసు క్షమించిమని చెప్పినా, వాస్తవ జీవితంలో క్షమించగలగడం గొప్ప పనే. ఇక నుండీ నా జీవితంలో క్షమించగలిగే గొప్ప వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకొంటాను. బహుశా నేను అందరినీ క్షమించేస్తానేమో.
My source for interpretation: మార్కు సువార్త.
No comments:
Post a Comment