Monday, December 1, 2008

'గౌరవం' హక్కు


'గౌరవం' ప్రతీ మనిషీ కోరుకునేది. ప్రతీ మనిషికీ అవసరమైనది. అది దొరకని నాడు మనం పడే బాధ ఎంతో 'హెడొలనిస్టిక్" కొలమానంతో కొలవడం కూడా కష్టమే. చాలామందికి గౌరవం ఆశించినంత ఆశక్తి ఇవ్వడంలో వుండదు. అలా వుండడానికి వాళ్ళు చాలా సాధన చేస్తారేమో అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారులలో కనిపిస్తూ ఉంటాయి. బహుశ వాళ్ళు పోటీ పరీక్షలలో వల్ల అందరికన్నా గొప్పవారై ఉండడం కావచ్చు. 1994 లో ప్రపంచ ప్రతినిధులందరూ జపాన్ లో ఒక సభలో వికలాంగులందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలు కల్పించడం మరియు వారి హక్కుల రక్షణకై ప్రత్యేక చట్టాలు చేయాలని నిర్నయించుకొన్నారు. దాని ఫలితమే భారత వికలాంగుల చట్టం 1995. చట్టం అమలు అధికారుల దగ్గరనుండి ప్రజలందరికీ చేరి,అందరూ వికలాంగులకు గౌరవాన్ని ఇవ్వడం లో వివక్ష చూపకూడదు అన్న భావాన్ని పెంపొదించాలి. కాని ఈ పన్నెండేళ్ళలో ఎప్పుడూ ఈ విషయాన్ని అంత తీవ్రంగా తీసుకున్నట్లుగా కనిపించలేదు. నేను పెద్ద లేక నా ఉద్యోగం పెద్ద అన్న అహంభావం ముందు ఎదుటి వారు కూడా మనలాంటివారే అన్న చిన్న విషయాన్ని మరచిపోతారు. అందుకే మనం ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా సామాన్య మానవులెవ్వరూ కూర్చోవడానికి అర్హులు కారు. అందుకే నిలబడే మాట్లాడించి పంపించేస్తారు. ప్రజా సేవలో ఉన్న వారి దగ్గరికి ఆ ప్రజలలో ఒకరు వచ్చి మాట్లాడితే వారిని కూర్చొమంటే పోయేదేమిటి అహం తప్ప.

ఒకాయన నడువలేడు, నిలబడలేడు. కష్టపడి ఒక అధికారి దగ్గరకు వెళ్తాడు తనకు రావలసినదేదొ అడగడం కోసం. అక్కడకు వరకు వెళ్ళడమే ఓ ప్రహసనం. ఇది ఏ మాత్రం అర్ధం చేసుకోనట్టుగా ఆ అధికారి నిలబడలేక పోతున్న వారిని కూడా నిలబెట్టే సమస్య పరిష్కారం గురించి విచారిస్తారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది అధికారులు, ఉన్నతోద్యోగులు అలాగే వున్నారు.
ఏది ఏమైనా సరే అందరికీ సరైన గౌరవం దక్కాల్సిందే. గౌరవం అందరి హక్కని గుర్తించాల్సిందే.

No comments: