నేను 'దేవుని బిడ్డని'. మా అమ్మ 'ఒంటి గొడ్రాలు' ౧౦ సం. లు బాధ పడ్డ తరువాత దేవుడిచ్చిన వరప్రసదాన్ని. ఎ దేవుడో తెలుసా? మనవాళ్ళ బ్లాగుల చర్చనీయమ్సమైన ఆ 'క్రైస్తవ దేవుడే'. మా అమ్మ పుట్టిన వాళ్ళని దేవుడికే ఇచ్చేస్తానని మొక్కుకుంది అట. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు నన్ను చర్చ లో దేవుడికి ఇచ్చేసింది. ఐతే దేవుడు నాతో ఏమీ మాట్లాడలేదు. నన్ను రమ్మని అనలేదు. నాకేమి చేయాలో చెప్పలేదు. పాస్తారుగారు ఈ దేవుని బిడ్డని వేలం వేసారు. మళ్ళీ మా అమ్మే నన్ను కొనుకుంది. నేను దేవుని బిడ్డని.
దేవునితో నాకెప్పుడూ పోరాటమే నాకెందుకు కనిపించలేదని. చాలా కాలం చూసాను, కనిపించలేదు. ఎందుకు కనిపించలేదా అని ఆలోచించడం మొదలు పెట్టాను. ఇప్పుడు కాదు ఎప్పుడో. చివరకు తెలిసింది కనిపించదని లేదా కనిపించాడని అనుకోవాలని. దేవుడితో పాటు మొదలైన ఈ ప్రశ్న మానై ఈరోజు దేవుని బిడ్డ దూరమై పోయాడు. దేవునికి దూరంగా ఉన్నా అప్పుడు ఇప్పుడు ఒకలానే వున్నాడు. అప్పుడు దేవుడు అవసరం లేదేమో అనిపించింది. బాధగా వున్నప్పుడు నాకెవరో కావాలని అనిపించలేదు, సంతోషంగా వున్నప్పుడు ఎవరో వున్నారని అనిపించలేదు. హాబ్స్ చెప్పినట్టు మనిషిలోని కదలికలే స్పందనలు కలుగ జేస్తాయి అనిపించింది.
మతం నైతికతను బోధిస్తునదని ఎన్ని సార్లు అనుకున్నా, నాకు తెలిసిన భక్తులంతా తమను తాము మతంతో సమర్దించుకొనే వాళ్ళే తప్ప అందులో పాటిస్తున్నవి చాలా తక్కువే అనిపించింది. ఒక వేళ ఈ మాట చెబితే ఆరోజు మూడో ప్రపంచ యుద్దమే. చాలా సార్లు చేశాను లెండి. నేను నీతిమంతుడిని కాదు పాపినే కాని అందరు నాలాగే వున్నారు అయినా వాళ్ల దృష్టిలో నాపై ఎందుకంత చిన్న చూపో ఇన్నాళ్ళైనా తెలియడం లేదు. ఈ పాపిని మార్చాలని, నన్ను పరలోక రాజ్యం పంపించాలని ఎంతమంది కష్టపడుతున్నారో తెలిసినప్పుడు నా సారీరా కదలికల స్పందన నాకే అసహ్యం గా వుంటుంది. ఓ కొత్త బిచ్చగాడి గురుంచి చెబుతాను. ఇది జరిగి ఇంకా పదిహేను రోజులు కాలేదు.
పన్నెండేళ్ళ తరువాత ఒక స్నేహితుడు నా బ్లాగు చదివాడు. నా జీవితం లో వెలుగు చూపించాలనుకున్నాడు. అందులో బొల్లోజు బాబా గారు తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేసారు. ఓ ఆదివారం ఉదయం ఆరున్నరకి ఫోను చేసి, నలభై కిలోమీటర్ల దూరంలో వున్నా తనదగ్గరకు వెంటనే రావాలని అడిగాడు. నాకెందుకో చాల అవసరం అనిపించి వెంటనే బయలుదేరాను. బజాజ్ స్పిరిట్ మీద అరవై కిలోమీటర్ల స్పీడుతో సుమారు గంట పది నిమిషాలలో గమ్యాన్ని చేరుకున్నాను. వాడు చెప్పిన మొదటి మాట ఇప్పుడు మనం చర్చికి వెళుతున్నాము. ఏమీ మాట్లాడకు అన్నీ తరువాత చెబుతాను అన్నాడు వెంటనే. ఎందుకంటే నాకు ఏమీ తెలియని రోజుల్లో ఇవన్ని మాట్లాడింది వాడే. అప్పుడు తనమాటే వినమన్నాడు ఇప్పుడు అదే చెయ్యాలనుకున్నాడు. జీవితం మారిందేమో గాని విధానం ఐతే మారలేదు. వాడేమి మారేదో అ దేవుడికే తెలియాలి.
మతం అనే వ్యవస్థ అలానే వుండి. దానిని దాటి ఆలోచిస్తే వాల్లెప్పుడు బయటే వుంటారేమో నేనున్నట్టుగా. నాకూ 'దేవుడు' కావాలి, నన్ను ఇబ్బంది పెడుతున్న వాల్లన్దిరికి నన్ను వదిలేయమని చెప్పడానికి. నా మానాన నాన్ను బ్రతుకనివ్వడానికి, నేను 'దేవుని బిడ్డను' కాను చెప్పడానికి.
7 comments:
మీ మూడోప్రపంచయుద్ధాలు మనమూ ప్రతిరోజూ చేస్తాం. అర్థవంతమైన టపా..ఆలోచింపజేసే టపా!
i read all your posts. very thought provoking and reveal the bitter truth. if you turn your experiences to fight against system, by being with-in the system, you will definitely make a difference.
సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం నాకూ ఇలానే అనిపించింది.
మంచి టపా.
Your posts are always hard hitting.
మీ ప్రొత్సాహానికి నా ధన్య వాదాలు
@ భవాని: నాకు ఐదు సంవతస్రాల నుంచి ఆగకుండా సాగుతుంది
@ నావన్నీ నా అనుభవాలండీ. మీ ప్రోత్సాహం నాలో ఉత్సాహం నింపుతుంది.
Edo oka experience tesukoni andariki vartimpacheyatam eerojullo fashion avvipoindi.. I agree what he did was wrong but attributing it to all chirstians is even wrong.
@ Steven,
you are absolutely right. every theory has exceptions. In my life there innumerable experiences like this post
Post a Comment