Wednesday, December 3, 2008

ప్రపంచ వికలాంగుల దినోత్సవం

పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసంబరు ౧౩) వికలాంగుల గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.
సాధ్యమైనంత వరకూ మనం వికలాంగులు అనే పదం మన వాడుక భాషలో వాడడం లేదు. ఇంగ్లీషు లో మాత్రం హేన్డికాప్పుడు, డిసబుల్ద్, ఫిసికాల్లీ చాలేన్జ్ద్ అని రక రకాల పదాలలో వాడుతూ ఉంటాము. కాని చాలా మందికి ఎందుకు ఎ పదాన్ని వాడుతునామో తెలియదు. అలాంటి సమయాల్లో ఒక్కోసారి మంచి ఉద్దేశ్యాన్ని చెడ్డగాను, చెడ్డ ఉద్దేశ్యం మంచిగాను చెప్పే ప్రమాదము వుంది. కాబట్టి ఈ పరిస్తితి నుండి బయటపడే ప్రయత్నానికి ఈరోజే నాంది పలుకుదాం.
ప్రపంచం లో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైన వల్లే ఉండరు. తెలివికి, తెలివిలేని తనానికి మధ్యనే జీవితం. చేయడానికి చేయలేకపోవడానికి మధ్యలోనే మనం. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేక పొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వ సాధారణమైపోయింది. అయితే వికలాంగులను అర్ధం చేసుకోడానికి ఐరిస్ అనే ఆవిడ ఏమంటారంటే "కూర్చున్న చోటినుండి లేవలేక పోవడం శారీరక సమస్య ఐతే, అలా లేవలేక పోవడానికి సరైన సహకారాన్ని అందించక పోవడమే అసలైన వైకల్యం అంటారు". అందుకే సమాజం లో ఎవరు ఎ పని చేసినా, చేయలేక పోయినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. ఆ సహకారం, ప్రోత్సాహం తో ఎవరైనా ఎంత ముండుకైన వెళ్ళగలం అనే సత్యాన్ని తోటి వారు అవగాహన చేసుకోవాలి. నిజమైన సామర్ధ్యం గురుంచి చర్చించు కుంటే ఎవరు ఎవరినీ తక్కువగా చూడలేము. అలా అర్ధం చేసుకోలేక కొన్ని తరాలుగా కొంత మందిపై నిర్లజ్జ గా సామర్ధ్యం అని చెప్పి, చేయగలిగినవాళ్ళను కూడా అసమర్ధులుగా మార్చిన సమాజం నుండి బయటికి వచ్చి అందరినీ అర్ధం చేసుకొనే సమాజం వైపు మన పెద్ద వాళ్లు ప్రారభించిన అడుగులు ముందుకు తీసుకు వేల్లిదానికి ఈరోజే నిర్ణయం తీసుకుందాం.

No comments: