Friday, October 10, 2008

అసలు మనిషి



నా యూనివర్సిటీ జీవితం ప్రారంభమై ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అయ్యింది। ఈ ఎనిమిదేళ్ళలో ఎన్నో ప్రశ్నలు, ప్రతీ పరిష్కారం తరువాత అందమైన అనుభవాలు. ప్రతీ అనుభవంలో మునుపెన్నడూ లేని జ్ఞానం. ఎంతో హాయిగా సాగి పోయే జీవితంలో ఎప్పుడూ ప్రశ్నలే.
నేను మొట్టమొదటి సారిగా విద్యార్ధి సంఘాలను ఇక్కడే చూసాను. యూనివర్సిటీ లో అడుగుపెట్టిన క్షణమే కనిపించిన విద్యార్ధి సంఘాల కరపత్రాలను చూసి "ఇందులో ఏ ఒక్కదానిలో వెళ్ళాకుండా బుద్దిగా చదువుకో" అని అన్నయ్య ఆజ్ఞ. అదే నా మొదటి ప్రశ్న.
విద్య వలన వినయము, వినయము వలన జ్ఞానము వస్తాయన్న మాట ఉన్నత విద్యలో నిజం కాదేమో అని అనిపించింది. ఎందుకంటే ఆధిపత్య వర్గాన్ని, అణచివేయబడ్డ వర్గాన్ని, అణచివేయబడ్డ వారిలో ఆధిపత్యాని, ఆధిపత్యంలో అణచివేతను కళ్ళారా చూసాను. వీళ్ళ పేరు ప్రక్కన డిగ్రీలు తప్ప, బుర్రలో ఏమీ పెరగదా అన్నది నా రెండో ప్రశ్న. మనం స్పర్సించేంత దారుణమైన ఆధిపత్యం. గొంతు పగిలిపోయేంతగా అరిచే పోరాటం. ఆ రెండింటికీ ఎప్పటికీ పోటీనే. ఎప్పుడూ కలవవు, ఎక్కడా ఆగవు.
ఇక్కడికి వచ్చేవరకూ నాకేమీ తెలియదు. నేనే కాదు నాలాంటి వారు చాలామంది వున్నారు. అంటే యూనివర్సిటీ అనేది అంత ఇరుకైన సమాజమా? దానికోసమేనా మనం ఇంత దూరం వచ్చాము. బుర్ర పగిలిపోయే ప్రశ్న. దాని సమాధానమే 'అసలు మనిషీ
ఇంతవరకూ వాస్తవాన్ని చెప్పుకోని వాడు, ఒప్పుకోని వాడు ఎంతో అన్యోన్యంగా జీవించారు. నిజాన్ని చెప్పుకోవాల్సి వస్తే దూరంగా పారిపోయారే తప్ప వాస్తవాన్ని పంచుకోలేక పోయారు. అందుకే ఇంత కాలం కనిపించనివన్నీ ఇప్పుడు ఆశ్చ్చర్యంగా, వింతగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న వాడు 'అసలు మనిషీ. ఏ అరమరికలు లేని మనిషి. తను నమ్మిన సిద్దాంతాన్ని నిక్కచ్చిగా, నిర్భయంగా పాటిస్తున్న మనిషి. తర తరాలుగా వస్తున్న వంశ పరంపర్యాన్ని నిలబెట్టడానికి ముందుకొచ్చి నిలబడ్డ ఉన్నత విద్యావంతుడు.
వినడానికి ఒకింత ఇబ్బందిగా వున్నా ఇదే వాస్తవం. ముసుగులో గుద్దులాట లేకుండా నేరుగా నీతో చెబుతున్నాడు తన చెప్పలనుకున్నదేదైనా. అందుకే వాస్తవం చాలా విలువైనది. నిన్ను తీర్చి దిద్దుకోవడానికి, నీకంటూ ఒక స్తానం ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడే అవకాశం.
అంబేద్కరు చెప్పిన సమ సమాజం రావాలంటే ముందుగా ఆసలు మనిషిని తెలుకొవాలి. వాస్తవాన్ని అంగీకరించాలి. అంగీకరించిన వాస్తవం లోనుండి ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకోవాలి. కులం వాస్తవం. కుల నిర్మూలన జరగాలంటే, మన కళ్ళముందు జరిగేవన్నీ కులం చాటున జరుగుతున్నాయని తెలుసుకోవాలి. ఆ చాటు తీస్తే తప్ప కులాన్ని తీయలేము ఎందుకంటే అదే అసలు మనిషి.
ఇక నుండి నా పని అసలు మనిషిని బయటకు తీయడం. ఎందుకంటే నా పోరాటం తనతోనే.

8 comments:

కొత్త పాళీ said...

బాగా చెప్పారు.

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగా చెప్పారు.

Srini said...

నీ బ్లాగ్ భాగుంధిర మామా..

Muralidhar said...

రేయ్, నీ బ్లాగ్ నిండా ప్రశ్నలే. అన్నీ బాధలే. వాటిలో దేనికి బదులు లేకపోయినా నిరాశే. సమస్య అది కాదు. ఆ నైరాశ్యం నీకో వికృతమైన సంత్రిప్తినిస్తుందేమోనని నా అనుమానం. నీతో మాట్లాడి చాలా రోజులయ్యింది. But believe me, there is LIGHT at the end of the tunnel. నీ నంబర్ ఇవ్వు. నేను ఫోన్ చేస్తాను.

Bolloju Baba said...

murali gaaru
i dont find any cynisism in this post. i see that the blogger is seeing the light

bolloju baba

Suresh Kumar Digumarthi said...

ra@Murali,
నా బ్లాగు ప్రశ్నలతో ప్రారంభమైనా, చివరికి నా సమాధానాన్నే చెబుతున్నాను. నాకు నిరాశలేదు. కేవలం నాభావాలను పంచుకుంటున్నాను. అంతకన్నా మంచి సమాధానం మన బ్లాగర్లు నునుడి ఆశిస్తున్నాను. అంటే నన్ను నేను ఇంకా పదును పెట్టుకొనే పనిలో వున్నాన్ను. కాంతిలో వుణ్డి చూడలేక పోతున్నామని నా అనుమానం.

@ Bolloju baba గారు
మీకు ధన్యవాదాలు

Unknown said...

I strongly feel that our dear friend Muralidhar needs some counselling from a genuine, well educated psychological counsellor. Unfortunately, the basic philosophy of inventing anything started from a "question". I dont find any cynisism in your writings. Indeed they are really thought provoking and, as Bolloju Baba has pertinently pointed out, you are not only seeing the light, but thanks my friend you are showing it to many and opening their eyes even. If Newton didnt start the question "why the apple falls down?" and 'thought positively' he would have been an idiot. Question is infact a base of the research and the beginning of all the answers.

Unknown said...

Sorry dear friends I may sound little harsh and strong in my expression. However, I just attepmted to make the other, who has millions of suggestions to everyone, understand how easy it is to accept some suggestion from anyone. Nevertheless, the suggestions I gave were true from the bottom of my heart.
Baba