నడపడం రాక అనుకున్నారా! కాదు కాదు. రూల్స్ ఒప్పుకోవు అంతే. వింత ఏమిటి అనుకుంటున్నారా. దాని వెనుక చాల ఏళ్ళ కధ ఉంది. నాకిప్పుడు ౩౦ సంవత్సరాలు. నాకు రెండో ఏడు మొదటి రోజున జ్వరం వచ్చి, క్రమేణా పోలియోగా మారిపోయింది. ఇప్పుడు నేను న ఎడమ కాలుకి ఏ రకమైన ఆధారం లేకుండా నడువలేను. ఐతే చిన్నప్పటినుండి నేను పెరిగిన వాతావరణంలో ఇది చేయలేవు అని నన్ను ఎవరూ అనలేదు, నేను అనుకోలేదు.
గత ఎనిమిది సంవత్సరాలుగా నేను హైదరాబాదులో ఉండడం వల్ల బయటికి వెళ్ళాలంటే తప్పకుండా నాకూ ఒక టూ వీలర్ కావాలి. మూడో తరగతి నుండే నాకు సైకిల్ తొక్కడం తెలుసు. ఇంటర్మీడియట్ లో లూనా తో మొదలు పెట్టి హోండా ఏక్టివా వరకు నేను నడపని బండి లేదు. (హైదరాబాదు లో కూడా)
ఇక లైసెన్స్ తీసుకోవాలని మావూరి ఆర్.టి.ఓ ఏజంటు దగ్గరకు వెళ్లాను. మీకు త్రీ వీలర్ ఇప్పించేస్తాను అన్నాడు. నేను కుదరదు, నేను టూ వీలర్ నడపగలను, నాకు అదే కావాలి అన్నాను. దాదాపు మూడు సంవత్సరాలు ఆ విషయం మీద ఎంత చర్చ జరిగిందో. కాని ఏ ఒక్కరూ నన్ను ఆర్.టి.ఓ దగ్గరకు తీసుకు వెళ్ళలేక పోయారు. లెక్కలేనన్ని వాయిదాలు. చివరకు నేనే నేరుగా వెళ్దామని నిర్ణయించుకుని వెళ్లాను. నా కోరికను విన్న గుమాస్తాలు మీరు పక్కన కూర్చోండి, మీది ప్రత్యేకం కదా అని దాదాపు నాలుగు గంటల సేపు నావైపు కూడా చూడలేదు. చివరకు నన్ను దూరం నుండి గమనించిన ఇంకో ఆయన నీ ప్రాబ్లం ఏమిటి అని అడిగాడు. అంతే అవకాసం కోసం ఎదురుచూస్తున్న నేను ఆయన ముందు నా కోపాన్ని వెల్ల గ్రక్కాను. అయన ఇచ్చిన అవకాశంతో లోపలికి వెళ్ళిన నేను నా కోరికను చెబితే, నన్ను అర్ధం చేసుకున్న ఆ అధికారి రూల్స్ ఒప్పుకోవని త్రీ వీలర్ తీసుకోమన్నాడు.
అందరి అర్హతలను పరీక్షించే వాళ్లు నా అర్హతను కూడా పరిక్షంచ వచ్చుకదా, కాని ఎందుకో రూల్స్ ఒప్పుకోవడం లేదు.
3 comments:
physically challenged అదీ ముఖ్యంగా కాలికి సంబంధించిన ఏదైనా సమస్యవుంటే వాళ్ళ రూల్స్ అలావున్నాయేమో!
కానీ, inclusion & equal opportunity గురించి మాట్లాడుతున్న ఈ తరుణంలో వారు మీ సమర్ధతని గౌరవించి ద్విచక్రవాహన లైసెన్స్ ఇవ్వడమే సరైనది. ఇంకా ఈ రూలు మార్చకపోతే ఒక ఉద్యమం చేసెయ్యొచ్చు.చెయ్యాలికూడా.
మావూరి ఆర్.టి.ఓ ఏజంటు దగ్గరకు అన్నారు,అసలు ఇంతకూ ఏఊరు మీది?ఈ ఏజంట్లకు మరో పేరు ఉంది బ్రోకర్లూ అని.అసలు ప్రభుత్వకార్యాలయాలు అంటేనే ఒకనిబంధనల పుట్ట,కాబట్టి ఏ రూలు ఎవరికి వర్తిస్తుందో ఎవరూ చెప్పరు.మీరు ఆర్.టి.ఓ ను కలవలేకపోవచ్చు,కానీ పత్రికా విలేఖరులను కలవవచ్చు.వారి ద్వారా ప్రయత్నించండి.హైదరాబాద్ లో గనుక మీరుంటే ముఖ్యమంత్రి ని కలిసి మీ సమస్య,మీశక్తి సామర్ధ్యాలు ఆయనకు వివరించండి.సచివాలయములో కష్టం కానీ క్యాంపు కార్యాలయములో కలవండి,ముందుగా అప్పాయింట్మెంట్ తీసుకుని,ఆల్ ది బెస్ట్.
సమచార హక్కు వుపయోగించి ముందు ఆ రూల్సు ఏమిటో కనుక్కోండి. ఆ తరువాత వాటిని అధిగమిచే దారి చూడొచ్చు.
Post a Comment