నేను నిశ్శబ్దాన్ని
మౌనంగా రగులుతున్న అగ్ని పర్వతాన్ని
నీ చూపులు శూలాలై గుచ్చుతునన్నా
నీ మాటలు గుండెను కాల్చేస్తున్నా
నా సహనాన్ని నేనే పరీక్షిమంచు కుంటున్న.....లావాని నే
నునువు నమ్మిన తప్పే, తప్పు కానప్పుడు
నా నిజ0, నిజ0 కాకుండా పోతుందా
నీకున్న బలంతో ప్రపంచాన్ని మొత్తాన్ని నమ్మించినా
నా నిజ0 ....నిప్పు.....ఆగుతుందా....ఆపగలవా?
అబద్దాల ఆట నుండి తప్పుకో
సామాజిక న్యాయ0 వైపు సాగిపో
కార్చిచ్చు మొదలవ్వక ముందే
లావా మరిగిపోక ముందే
నేను నిశ్శబ్దాన్ని ఛేధించక ముందే
నిజాన్ని ఒప్పుకో
నా వాటా నుండి తప్పుకో
[ ఎస్సీల వర్గీకరణలో వెనుకబడ్డ 57 కులాల తరపున]
No comments:
Post a Comment