Sunday, September 7, 2008

బాగా చదివినా తప్పేనా?

ఒక దళిత మధ్య తరగతి విధార్థిని ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయింది. తన కల. Inter అవ్వగానే Engineering చేయాలనుకుంది. ఇంట్లో డిగ్రీ చేయమన్నారు ఎందుకో మీకు అర్థమయ్యే వుంటుది. తరువాత M.sc Physics జాయిన్ అయ్యింది. B.Ed చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుందన్న లోకం పోకడలో పి.జి నుండి అమ్మాయిని మానిపించి బి.ఎడ్ లో జాయిన్ చేసారు. బి.ఎడ్ తరువాత అమ్మాయి కొంతకాలం టీచర్ గా పనిచేసి మళ్ళీ పి.జి లో seat సంపాదించుకొంది. ప్రశాంతంగా రెండు నెలలు గడిచింది. రెండు వారాల్లో Internal అప్పుడే మొదలయ్యింది కొత్త కధ.
ఓ రోజు ఓ వ్హ్రుద్ధ పంతులు అందరిని క్లాస్ లో సెమినార్ ఇమ్మన్నాడట.ఈ అమ్మాయి బాగా చెప్పింది. అంతే ఆయన వివరాల్లోకి వెల్లి, నువ్వు ఎవరు, ఏమిటి అని అడిగి, బి.ఎస్.సి లొ statistics లేకుండా నీవు ఈ కోర్స్ కి eligible కాదు అని Director, Admissions కి ఫోన్ చేసాడట. ఆయన కూడా అదే సమాధానం. అయితే ఈ అమ్మాయి ఏమి అవ్వలి అన్న విషయం మీద వాళ్ళసలు ఆలోచించనే లేదు. మని నా సంగతేంటి అని అమ్మాయి అడిగే వరకూ వాళ్ళు మౌనంగానే వున్నారు.
ఇక మొదలయ్యింది మరో కధ. M.Sc Statistics లొ అర్హత లేదని MSc Statics and Computer Science లొ జాయిన్ అవ్వమన్నారు. ఒక్కదానికే దిక్కులేదు రెండింటిని చేర్చారు. అయితే అక్కడొక చిక్కుంది, అదేమిటంటే అది డబ్బు కోర్సు. సంవత్సరానికి 30 వేలు. ఎవరు కడతారు, అమ్మాయె కట్టాలి. ఎందుకంటే తప్పు అమ్మాయిది. అందరూ అదే మాట. Eligibility సరిగ్గా చూసుకోలేదా? [Maths and Statistic (any one of them as main subject)] మనకు ఇప్పుడు main కోర్సులు లేవు కదా. అన్నీ elective courseలే కదా. అయినా వాల్లు చెప్పిండే వేదం. యూనివర్సిటీకి సీటు కేన్సిల్ చేసే అధికారం కూడా వుంది తెలుసా అని బెదరింపు. ఈ గొడవ తెగేదాకా లాగితే అమ్మాయి జీవితం పోతుందోనని మధ్యతరగతి మహాభారతం మరోపక్క.
ఆట మొదలయ్యింది, అందరూ అమ్మాయినే నిర్ణయం తీసుకోమన్నారు.కాని వాళ్ళ నిర్ణయమూ స్పష్టంగానే వుంది చెప్పక పోయినా. ఇంతలో కొత్త అధికారి ముందుకు వచ్చారు. వీళ్ళు జాయిన్ అవ్వమన్న కోర్సు కూడా అదే eligibility. వాళ్ళు నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టొచ్చు, అందుకే ఎదైనా Basic కోర్సులోకి వెళ్ళిపో, నేను రికమండ్ చేస్తాను. అమ్మాయి అనుకున్న స్తానం నుండి ఒక్కొక్క మెట్టు పడిపోతుంది. ఆలోచించి organic chemistry ఇస్తె చేస్తానంది. కేంపస్ లో ఇవ్వలేము బయట కాలేజీ లో అయితే ఇస్తాం అన్నారు. ఒప్పుకునే కొలదీ ఇంకెంత దూరం తోసేస్తారో అర్థం కాలేదు. నేను వెళ్ళను అంది. కధ మళ్ళీ మొదలు.ఎన్ని రోజులు తిప్పారో వాళ్ళకే తెలియాలి. ఒక్క ఫోన్ చేస్తే అయిపోయే పనులు. అమ్మాయినే వెళ్ళమనే వారు. వెళ్ళింది. ఎన్నిసార్లైనా తిరిగింది. ఒక్కో మాట కోసం తిరిగింది. ఇంతలొ ఇంటి నుండి భయంతో నిండిని బెదిరింపులు. సంవత్సరం వ్రుధా అయిపొతుంది. ఏదైతేనే M.Sc కాదా. మనం ఎక్కువ గొడవ చేస్తే మార్కులు తగ్గిస్తారు తెలుసా సహ విద్యార్ధుల సలహాలు.
చివరకు ఇంట్లో వాళ్ళూ డబ్బు తెచ్చి జాయిన్ అయిపో, మేము తట్టుకోలేకపోతున్నాము అని M.Sc Statistics and Computer Science జాయిన్ చేసేసారు. ఇంత సీనులో ఒక్కసారైనా యూనివర్సిటీ తప్పు చేసిందని అనుకున్నారా. వాళ్ళు rules అంత strict అయినప్పుడు, ముందుగానే ఎందుకు చూసుకోలేకపోయారు. apply చేసినప్పుడు, join అయినప్పుడు ఏమిచేసారు. ఒకవేల తను సెమినార్ బాగా చేయకపోయి వుంటే అదే class lo వుండి పోయేదా?

3 comments:

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

దారుణం....!!
ఇదీ మన "ప్రజాస్వామ్యం" ప్రసాదమే..!!
(కొంచెం సేపటి క్రితం నే చదివిన బ్లాగులో మిత్రులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నార్లెండి..!)

Anil Dasari said...

బాధాకరమైన విషయం. అయితే మీరు 'దళిత విద్యార్ధిని' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమిటో అర్ధం కాలేదు. ఇది దళితులకి మాత్రమే ఎదురయ్యే సమస్య అని మీ ఉద్దేశమా? అచ్చం ఇలాంటిదే కాకపోయినా, ఇలా చిరాకు పుట్టించే విషయాలు non-dalits విషయంలో కూడా జరగటం నేనెరుగుదును. ఆ గోల తట్టుకోలేక అసలుకే మానుకుని వెళ్లిన స్నేహితుడొకడున్నాడు నాకు.

రానారె said...

కాలే పెనం మీద కూర్చొబెడితే ... మన విశ్వవిద్యాలయాల్లోని ఏ స్థాయి ఉద్యోగి నుంచైనా సరే నిముషానికి పీపాడు కొవ్వు లభిస్తుంది.

సిఫారసుల్లేనిదే పని జరగడం... ప్రభుత్వ కార్యాలయాల్లో సాధ్యమేమోగానీ విశ్వవిద్యాలయాల్లో మాత్రం కష్టం.

ఒక చిన్న యోగ్యతాపత్రాన్ని సంపాదించడం కోసం అర్హత వున్నా సిఫారసుతో వెళ్లాల్సివచ్చినప్పుడు నాకు అర్థమైన సంగతి ఇది. ఈ పరిస్థితి ఎన్నటికి మారుతుందో ఏమో.