విశ్వవిద్యాలయం
పేరుకే అది పెద్ద విశ్వవిద్యాలయం
దీని కన్నా మా ఊరే నయం
మా ఊరి పెద్దకాపు
మా పేట చివర నిలబడి
మా తాతని...
ఏరా పెద్ద మాదిగి, పనిలోకొస్తున్నావా? లేదా?
అని అడిగితే...విలువలేని ఈ ఊరి నుండి పోవాలని
కష్టపది చదివి ఈడికొచ్చాను
అందరూ బాగా చదువుకున్నోళ్ళే కదా...
కులం మదలోకి రాదనుకున్నా...
కాని ఇక్కడ.
హాయ్ అని సొగసుగా పలకరించినా
చాటుగా వీడు దలితుడు అనుకుంటారు
మా ఊర్లో ఐతే మేమేం తిన్నా ఎవరూ అడగలేదు
కానీ ఇక్కడ...అమ్మో...ఇదేం లోకం రా బాబూ
నేనేం చేసిన చర్చే.
నేనొక్కడినే బాగా చదివితే..
ఇంకే మీకు రిజర్వేషన్ ఎందుకు అంటారు
నేనొక్కడిని చదవకపోతే..
వీళ్ళింతే బద్దకస్తులు అంటారు
నేను బాగా పని చేస్తే బండోడు అంటారు
పనిచేయకపోతే బతుకెందుకు అంటారు
చివరకు నా తిండిని... నా తిండిని కూడా వద్దంటారు
చ్హీ.. నా తిండిని నేను తినడానికి కూదా
వేరొకడి అనుమతి కావాలా?
ఏమో.. చదువులేని మా ఊరు పెద్దకాపు కూడా
ఎప్పుడూ అడగలేదు
{Regarding Beef fight in HCU)
1 comment:
you expressed the point perfectly.
congrats
bollojubaba
Post a Comment