వికసించని పూలు
ఎంత చదువుకున్నా...
ఎవ్వరేమి చెప్పినా...
ఎంత చర్చినించినా....
వికసించలేదీ పూలు
మనిషికి హక్కులుంటాయని...
సంస్క్రుతి వుంతుందని...
వీడని బంధం వుంటుందని...
తెలుసుకోలేదీ...వికసించని పూలు
'అణచివేత' అంటే అర్థం చెప్పి
అది ఏ రూపమైన తప్పని చెప్పి
అవకాశాలు అందుకోవడానికి మార్గం చెప్పిన
మహనీయుడైన అంబేడ్కర్ చిత్రంపై
అసభ్యకరమైన రాతలు రాసారు
ఈ...వికసించని పూలు
అమ్మ చెప్పలేదు...
నాన్న నేర్పలేదు...
స్నేహితులకు జ్ఞానం లేదు...
బంధువులుకు బాధ్యతలేదు...
ఆచార్యులకు అవసరం లేదు...
ప్చ్...ఏమై పోతారో ఏమో...
ఈ...వికసించని పూలు
{Regarding abusive writings on Ambedkar's Poster in LH, HCU)
No comments:
Post a Comment