మా తాత..ఏపుగా పెరిగిన దాన్ని -
నేర్పుగా కోత్తంటేమా నానమ్మ ఒబ్బుడిగా పోగెట్టి
ఎంచక్కా ఆరెట్టేది
మా తాతకి సేత్రం తెలుసు - మా నానమ్మకి అలంకారం తెలుసు
పేటలో ఆడోళ్ళోంతా - గుంపుగా కూసూని గుసగుసలాడుకుంటుంటే
మీ కూర ఏంటని అడిగితే
అందరూ వంకాయ, బీరకాయ, బెండకాయ అంటుంటే మా సిన్నత్త..
కిసుక్కున నవ్వి - గెడ చిక్కుళ్ళుఅంది..
ఆడోళ్ళంతా గొల్లున నవ్వారు
మా సిన్నత్తకి శాత్రకం తెలుసు
అసలు పేరు చెబితే పెద్ద కులమోల్ని చిన్నగా సూత్తారని
ఆ పేరెట్టారంట
ముద్దలా ఉన్న ముక్కల్ని - నార లాగా చీరేసి
గెడ పొడుగునా ఆరెడితే
ఎండకి ఎండి
చిక్కుడు పాదు గెడెక్కింట్టుందని
గెడ చిక్కుల్లు అనేసారంట
ఎండిన ముక్కల్ని నీటిలో నానేసి కూరోండుకుంటే
ఆ రుచికి బెమ్మ దేవుడైనా దిగి రావాలంతే...
ఈ తెలివిలేని సన్నాసోళ్ళు ఎన్ని కూతలు కూత్తే మాత్రం
నేర్పరితనం నాశనమైపోద్దా
రుచి సప్పబడిపోద్దా
ఆళ్ళ నోటిలో ఓ ముక్కెట్టేసే దాకా
ఇలా మొరుగుతానే వుంటారు

No comments:
Post a Comment