Monday, July 14, 2008

హైకూలు

హైకూలు
బ్యాంకు దగ్గర క్యూ లో నేను
ఎవరో నన్ను తోసుకుని వెళ్తున్నారు
నేను నిలబడలేనని తెలిసీ

చెప్పాలనే అనుకున్నాను
నువ్వంటే ఇష్టమని
అతనిని చూసి మాట రాలేదు

దేశం మారి పోయింది
ప్రజలంతా మంచోళ్ళే
రాత్రి నా కలలో

అతడు చెప్పాడు
తను కాదంది
అతడు మళ్ళీ మాట్లాడలేదు

సామాజిక న్యాయం కావాలి
అందరూ కలసి పోదాం
వర్గీకరణ మర్చిపోదాం

ఎన్నిసార్లైనా భంగపడతాను
చిన్ని 'ఆశ ' కోసం
కలలోనైన కనిపిస్తుందని

బస్సెక్కాను కష్టంగా
ఆమె లేచింది
నిష్టూరంగా

నెమ్మదిగా నడుస్తున్నా
డ్రైవర్ నన్ను చూసాడు
బస్సు స్పీడు పెంచేసాడు

బస్టాపులో ఆటో వాడు
నన్ను చూసి
రేటు పెంచేసాడు

టీచర్ గా ఇంటర్వ్యూ
నడువలేనని సానుభూతి
ఉద్యోగం ఇవ్వలేదు

1 comment:

Bolloju Baba said...

మంచి భావప్రకటన
మంచి పదచిత్రాలు (కాదు కాదు జీవితచిత్రాలు)
తడి చెలమ గుండెలో ఉబికింది.

నాక్కొంచెం నమ్మకాన్ని ఇవ్వ్వు కొండల్ని పిండి చేస్తానంటాడో కవి.

నేను నమ్ముతున్నాను.

నీలో మంచి కవితా పటిమ ఉంది.
సన్నివేశాన్ని ఆర్ధ్రంగా పలికించే దమ్ము ఉంది.
స్వప్నించే ధైర్యం ఉంది.
కాలుతున్న నెగడు ఉంది.
పుండు మీద తేలుకుట్టిన బాధ ఉంది.
అన్నింటినీ అక్షరీకరించు

నేను నమ్ముతున్నాను
నువ్వు చెయ్యగలవని.

గొ అహెడ్
అభినందనలతో
బొల్లోజు బాబా