Monday, July 14, 2008

కడుపు మంట


కడుపు మంట
యుద్దమా?
ఎవరెవరికి, నీకూ...నాకూనా
సాధ్యమేనా?
ఐక్యతా!
ఎవరికీ... మనిద్దరికీనా
అసలుందా...
సరే, కురుక్షేత్రం నిలిపేద్దామా...
సమరభేరి ఆపేద్దామా...
నువు సుష్టుగా తిను
నేను నీ మోచేయి నాకుతాను
మిగిలిని ఎభై ఏడు మంది
మనల్ని చూసి...కడుపు నింపేసుకుంటారు
ఎంత బావుందో కదా...
అక మనం ఎప్పటికీ విడిపోము
తెలివా?
నీతో సరితూగ గలనా
నేను సామజిక న్యాయం కోసం పోరాటం చేస్తే...
నువు కడుపులో సల్ల కదలకుండానే కేసు కొట్టేయించావు
ఎందుకంటే నీకు అన్యాయం జరిగిందంట కదా
ఏం పరవా లేదు
మన ఐక్యమతాన్ని ఎవరూ పాడుచేయలేరు
వర్గీకరణ ఫలాలు చేతికందినపుడు
అన్ని దళిత ఇళ్ళళ్ళలో ఆశల పూలు పూచాయి
ఆ పూలన్నీ సుప్రీంకోర్టు పుటుక్కున తెంపేస్తే
నువ్వు సరదాగా నవ్వి - సంబరాలు చేసుకోలేదా
ఐనా పర్లేదు
మన ఐకమత్యాన్ని ఎవరూ పాడుచేయలేరు
అంబేద్కర్ సామాజి న్యాయం గురించి
మొదట చెప్పింది నువ్వే
అపుడు బాగానే అర్థమయింది...
ఎందుకో...ఆ మాట ఇపుడు మళ్ళీ చెబుతుంటే
అర్థం మారిపోయినట్టుంది
ఏం పర్లేదు
మన ఐకమత్యాన్ని ఎవరూ భంగం చేయలేరు
నువ్వు సుష్టుగా భోంచేయి
నేను నీ మోచేతిని నాకుతాను
మిగిలిన ఏభై ఏడు మంది, మనల్ని చూసి
కడుపు నింపేసుకుంటారు
ఇక పద వెళ్దాం పద
ఎవడో 'ప్రతిభాంటూ
మొరుగుతున్నాడు
మళ్ళీ మన సామాజిక న్యాయం
ఆయుధాన్ని చేపట్టు
మనలో మనువుని తరిమి
ఐక్యంగానే పోదాం పద
నువ్వు సుష్టుగా భోంచేయి...
నేను నీ మోచేతిని నాకుతాను
మిగిలిన ఏభై ఏడు మంది, మనల్ని చూసి
కడుపు నింపేసుకుంటారు

No comments: