http://chirb.it/yArD3d
ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం
ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం
గుండె బరువంత – గొప్ప పులకింత
మనసంతా – నమ్మలేనంతగా . . .
ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం
తొలిసారి నిను చూసినా
నా చేతుల్లో నిను తాకినా
గాలే ధూళై పోతుందేమో
స్పర్శే మలినం కానుందేమో
నా శ్వాసే అడ్డై నిలిచిందేమో
అనుకుంటూనే నేనూ . . .
నీ రక్షణ కవచం అయిపోతుంటే
ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం !!
గజ గజ వణికే చలిలో
ముచ్చెమటలు పడుతూ ఉంటే
మీ అమ్మ అలిసింది నీ జన్మతో
మీ నాన్న చల్లబడే ఆ వార్తతో
ముచ్చటగా మూడో మనిషి
వెచ్చగా చేరిన సంతోషంలో
ఆ క్షణం.. ఆ..ఆ.. క్షణం !!
No comments:
Post a Comment