Friday, June 19, 2015

మెట్రో వస్తే మనకి ఈ సమస్యలేమీ ఉండయి

ఎమ్.ఎమ్.టి.ఎస్
వికలాంగుల భోగీ
నేనొక్కడినే అర్హుడిని
భోగీ అంతా నిండుగా ఉంది.

నా ఎదురుగా ఓ పెద్దాయన. బాగా మాసి పోయిన ప్యాంటు, చొక్కా. ఆ పోలీసోడు టికెట్టు చూపించమన్నాడు. చాలా విసురుగా, కోపంగా చూపించాడు. పోలీసు శాంతించాడు. నాకెందుకో అతని సమాధానం, అతని బాడీ లాంగ్వేజ్ లో ఏదో విశిష్టత కనబడుతుంది. నెమ్మదిగా అతను చిరాకు నుండి నార్మల్ మొహం లోకి మారుతున్నాడు. ఇంతలో ఎవరి గోల వారిది. ఏవండీ మనకు గోదావరి అందుతుందా? నేను ఖమ్మం వెళ్ళాలి. ఇంకో ఆయన ఫోన్ లో ఎవరికో చెబుతున్నాడు, వరంగల్ పాసింజర్ నాంపల్లిలో బయలుదేరిందట, నేను సికందరాబాదులో క్యాచ్ చేస్తాను. అతను అందరితోనూ మాట కలపడం ప్రారంభించాడు. చాలా హుషారుగా, తెలుగు రాష్ట్రాలలో ప్రతీ ప్రాంతం తనకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మండుతున్న ఎండలు గురించి సంభాషణ జరుగుతుంది. ఏ ప్రాంతంలో ఎంత ఉష్ణోగ్రత ఉన్నదో చెబుతున్నాడు, రాజకీయం మాట్లాడుతున్నాడు. వార్తా పత్రికలన్నీ బాగా చదువుతాడనిపించిండి. నేను చాలా ఆశక్తిగా, అతని చూస్తూ, వింటూ ఉన్నాను. ట్రైను జేమ్స్ స్ట్రీట్ దగ్గర ఆగింది. టాపిక్ ట్రాఫిక్ మీదకు మళ్ళింది. రోడ్డు, రైలు అన్నీ ఈ ట్రాఫిక్ జామ్ లోనే అక్కడ సారాంశం. ఇంతలో అతను అన్నాడు "మెట్రో వస్తే మనకి ఈ సమస్యలేమీ ఉండయి". నాకు అర్ధం కాలేదు. ఎలా అని అడిగాను. అతనే చెప్పాడు "మెట్రో కి ట్రాఫిక్ జామ్ ఉండదు కదా. పోవుడు, వచ్చుడు. అంతే. జమ్మున పోతాం". నాకు నవ్వాగలేదు. సూపర్ చెప్పినవ్ భయ్యా అని సికందరాబాదులో దిగిపోయాను.


No comments: