దూరంగా ఆమె అందనంత ఎత్తులో
ఏదో చెప్పాలనుకుంది
కళ్లతో
సైగల్తో
రాతల్లో
అయినా . . . అర్ధం కాలేదు
కాలం వేగంలో
ఆమె ఆశగా
నేను అసహాయతగా
అలా చూస్తూ ఉండిపోయాము
**************************************************
ఆ లేత వయసులో
సైకిల్ తొక్కుతూ
ఎప్పుడు తిరగని సందులోకి నెమ్మదిగా తిరిగి
ఆ అమ్మాయినే ఫాలో అవుతుంటే
ఇంటిలోకి అడుగుపెడుతూ అనుకోకుండా
వెనక్కి తిరిగి చూసి అవాక్కయితే
నాకోసమే వెన్నక్కి తిరిగిందనుకొనే ఆ అబ్బాయికి
నిజం తెలియడానికి ఎన్నాళు పట్టిందో?
ఆ నిజం ఎవరో చెప్పేది కాదు
అనుభవం తెలియజెప్పేది
*****************************************************
మడత కాజా
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
మె: అతనంటే నాకు ఇష్టం లేదు
డు: ఎందుకు
మె: తెలీదు
################################
మె: అతను అదోలా చూస్తున్నాడు
డు: అవునా, ఎందుకు
మె: తెలీదు
డు: వార్నింగ్ ఇవ్వనా
మె: వద్దులే
డు: ఎందుకు
మె: తెలీదు, వద్దంతే
###############################
మె: అతను ఈ రోజు విషం తీసుకొచ్చాడు
డు: ఎందుకు
మె: నేను లేకపోతే చచ్చిపోతాడట
డు: అవునా రాస్కెల్
మె: పోతాడు వెధవ వదిలేయ్
డు: అదేమిటి,
మె: ప్చ్.. తెలీదు.. వదిలేయ్
################################
మె: ఈ రోజు నాకు దగ్గరగా రాబోయాడు
డు: ఇంక చెప్పకు, చిరాక్కా ఉంది
మె: ఎందుకు
డు: తెలీదు
మె: నాకు ఒళ్ళు కంపరంగా ఉంది
డు: అయితే వాడి గురించి చెప్పకు
#######################################
డు: ఏమిటీ వాడితో అంత దగ్గరగా ఉంటున్నావు
మె: నీకెందుకు
డు: మొన్నటి వరకూ problem అన్నావు, మరి ఇప్పుడు లేదా?
మె: ఉంది
డు: మరి
మె: నీకనవసరం
***********************************************
ఊరు కానీ ఊరు
భాష కాని భాష
ఎవరికో బాలేదని
ఎవరో వెళ్తుంటే
పని పాటా లేదని ఫాలో అయిపోతే
నవ్వు బావుందని
నీ మాటల్లో కొవ్వు బావుందని
కబుర్లేసుకుని
జీవితానికి బాండు రాసేసుకుందామనుకుంటే
ఆశ పడ్డవారికి ఆశ్రయమివ్వాలనుకుంటే
ఆ ఆశ్రయంలో తను తప్ప ఇంకెవ్వరూ వద్దంటే
అర్ధాంతరంగా ప్రయాణాన్ని విడచి
కనిపించనంత దూరం పారిపోవడమేనా?
No comments:
Post a Comment