యేసు తన కొత్త పంధాను జనంలోకి తీసుకెళ్లడానికి పరిసయ్యులు చాలా బాగా సహాయం చేసారు. వారు creative ideas తో వచ్చి, యేసు దగ్గరనుండి సమాధానాలు ఆశించే వారు. యేసు చాలా జాగ్రత్తగా మోషే ధర్మ శాస్త్రాన్ని amend చేస్తూ, logical అందరినీ సంతృప్తి పరచేవాడు. అలాంటి వాటిలో భార్య భర్తల సంభంధం ఒకటి.
"ఒకడు భార్యను విడనాడుట న్యాయమా" అని పరిశయ్యులు అడిగిన ప్రశ్నకు యేసు మోషే ధర్మశాస్త్రాన్ని reference గా తీస్తాడు. "పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని" చెప్పినని గుర్తుచేస్తారు. అయితే ఆ ప్రశ్నకు యేసు సంతృప్తిపడినట్టుగా కనిపించదు. దానికి కొనసాగింపుగా ఇలా interpret చేస్తాడు. "ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి ఇలా వ్రాసి ఇచ్చెను" గానీ సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురు షునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను. ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను.
అయితే నేనిక్కడ రెండు విషయాలను అర్ధం చేసుకొన్నాను.
1. మోషే ఈ విషయం తెలిసి, అప్పటి ప్రజానీకం పాటించడానికి సిద్దంగా లేరని, విడిచిపెట్టడానికి చట్టబద్దత కలిగించి ఉండాలి.
లేదా
2. మోషే కి ఆ విశయం తెలియక పోయినా, ఆదికాండాన్ని base గా చేసుకొని, మోషే argument ని యేసు extend చేసి ఉండాలి.
యేసు ఈ extension లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. చట్టబద్దతను దాటి నైతికతను, దైవికతను జోడించాడు. ఈ చర్చ ఇలా సాగించడానికి అతని శిష్యులు అతనికి సహకరించారు. పరిశయ్యులతో జరిగిన చర్చ వీరికి అర్ధం కాదు. ఇంటికి వచ్చిన తరువాత వారు యేసుని మరలా అడుగగా "తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను". బహుశా పది ఆజ్నలులోని వ్యభిచారాన్ని గుర్తు చేస్తే భయపడతారని ఆశపడి ఉండవచ్చు. అయితే పది ఆజ్నలు పాటించకపోతేనే ఈయన రావలసిన అవసరం ఏర్పడిందన్నది అసలు విశయం. ఓహ్.. సారీ.. పది ఆజ్నలు మరో సారీ revise చెయ్యడానికి వచ్చాడన్నది అంగీకరించవలసిన విశయం. అయితే ఇది revise అయ్యిందో లేదో పాటించే వారు చెప్పాలి.
ముఖ్య గమనిక:
నేను చిన్నప్పటి నుండి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను. అయితే ఆ సిద్దాంతాలతో ఇమడలేక నాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాను. ఆ రోజు నుండీ ఈ రోజు వరకూ నాపై ఎన్నో pressures, blackmailings, ఇంకా ఎన్నో. అయితే నాకు ఏమతం అన్నా ఒకటే. నాకు దాని చారిత్రకతతో తప్ప, వాస్తవాతీతమైన విషయాలతో నాకు సంబంధం లేదు. ప్రతీ సిద్దాంతంలోని కొంత వాస్తవికత ఉంటుందని నమ్ముతాను. దానిని స్వీకరించడానికి ఎప్పుడూ సిద్దమే. ఆ క్రమంలోనే నా అవగాహనను నా బ్లాగులో రాసుకొంటున్నాను. నన్ను enlighten చేయాలనుకొనే వారికి ఎప్పుడూ స్వాగతం. Emotional గా తీసుకొనే వారు మాత్రం నా post లలోకి రావొద్దని మనవి.
4 comments:
అన్నయ్యా... proud of you..
నాకు నచ్చినట్టు గా బ్రతుకుతున్నా highlight...
I remember the discussion we had few years ago at the Bday circle.. regarding caste and culture.. No one could explain their view to me better than you did... You are my idol ever since then.,....
Love you bro
hmmm... తమ్ముడూ.. thanx. love you
అన్నయ్య మార్క్ సువార్త ఒక్కటే తీసుకొని యేసు ప్రభువుకే భొద చేస్తే ఎలా? మత్తయి సువార్త కూడ చదివి అప్పుడు నీ అభిప్రాయము చెపితే సంతోషిస్తాం. " వ్యభిచార నిమిత్తమే" తప్ప తన భార్యను విడనాడి మరియోకతెను పెండ్లి చేసికొనువాడు. ( మత్తయి 19 :9 ) అంటె భార్య వ్యభి చారము చేస్తే ఆ వ్యక్తి నిస్సందేహముగా తన భార్యను విడనాడమనే గా దీని అర్ధం. దీనికేందుకన్నయ్య చట్టబద్దత, నైతికత, దైవికత.
Dear Juda Lion Tribe
1. నేను ఎవ్వరికీ బోధ చేయడం లేదు. మార్కు సువార్త నుండి అర్ధం చేసుకున్నది వివరించాను. నేనుదహరించినవన్నీ ప్రస్తుతానికి మార్కు సువార్తకే పరిమితం.
2. వ్యభిచారము చేస్తే వదిలి వేయ వచ్చు అని మీరు చెప్పారు. నేనిక్కడ చట్ట బద్దత, నైతికత ఉదహరించడం నా ఉద్దేశ్యం కాదు. భార్య భర్తల మధ్య సంబంధం ఎలా వుండాలి అన్నది యేసు ఎలా వివరించాడో తెలిపాను.
౩. మరొక్కసారి ఈ పోస్టును చదవండి. "దీనికేందుకన్నయ్య చట్టబద్దత, నైతికత, దైవికత" అనేంత వైరాగ్యం నాకు లేదు. మీరు ఉదహరించిన దానికన్నా లోతుగా, బలంగా నేను ఆలోచిస్తున్నాను.
Post a Comment