Monday, May 30, 2011

నాకు కులం నచ్చదు... మీ కులమేంటో చెబుతారా?

అదో style. అదొక methodology. ఏ మాయ కబుర్లైనా చెప్పి, మనతో మన చేసే వాడి కులం తెలియాలి. అలా తెలియకపోతే బహుశ తిన్నది అరగదేమో? రాత్రి నిద్ర పట్టదేమో? ఒళ్ళంతా ఏదో కనిపించని పురుగు పాకినట్టవుతుందేమో. ఏమో... ఏమో... ఏమవుతుందో నాకు తెలియదు. కానీ ఇలా చాలా సార్లు జరిగింది. ప్రతీ సారీ నాకు పరీక్షే. చివరికి నా కులాన్ని చెప్పినపుడే నేను pass. నేను answer ఇచ్చే వరకూ question రకరకాలుగా మారుతూ ఉంటుంది.

“నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే, ఇంకెవ్వరినీ వేలెత్తి చూపించవు” అని చాలా సార్లు చదివాం. అది ఎవరైనా పాటిస్తారో లేదో నాకు తెలియదు కానీ, ఎదుటి వాని కులం తెలుసుకోవాలని అనిపించినపుడు మాత్రం “మా ---- కులం లో ఇలా ఉంటుంది సర్”. ఆ సందర్భం ఎక్కడినుండి వచ్చిందో, ఎందుకు వచ్చిందో నాకు అర్ధం కాదు. కానీ అకస్మాత్తుగా వచ్చేస్తుంది. ఒక సునామీ వచ్చినట్టు, ఒక ప్రమాదం జరిగినట్టు. ఈ ఆట ఆడడం నా వల్ల కావడం లేదు. నేను కూడా నా పేరు చివర నా కులాన్ని తగిలించేసుకుంటాను. నా శరీరం రంగుని, నా మాటలని, నా దుస్తులని, నేను వాడే వస్తువులని కొన్ని వందల సార్లు scanning చేసి, litmus test లో clear cut results రాక, వాళ్ల అనుమానం, నిజమో కాదో తెలియక, వారు సతమతమవుతూ, నన్ను ఇబ్బంది పెట్టే methodology కి good bye చెప్పేయ్యాలి. ఈ బాధంతా ఎందుకో తెలుసా?

Graduation Spot Valuation కి వెళ్ళాను. కొత్త. అలా.. అలా చూసుకుంటూ ఓ ఖాళీ చోటు చూసుకొని కూర్చున్నాను. పక్కాయనతో పరిచయం. ఆయన ఏ భేషజాలు లేని వ్యక్తి. నాకేదైనా సాయం చేయాలంటే దబ్బున ముందుకొస్తాడు. ఒక్క రోజులోనే ఒక deal కి వచ్చేసాం. ప్రతీ రోజూ ఇద్దరం ఇలాగే కూర్చుందాం అని. ఇద్దరూ దాదాపు ఒకే ఏరియాకి చెందడం వల్ల కలసి ఒకే బైక్ (నాది) వెళ్లడానికి ఒప్పందం కుదిరింది.

Step: 1

సార్ మీకు ---- university లో ---- professor. ------ Reddy తెలుసా అన్నాడు. [సుమరు 30 ఏళ్ళ క్రిందటి కధ]. ఆయన నన్ను చూసి నువ్వు SC వా అని అడిగాడు. నేను అవును అన్నాను, నిజానికి నేను SC కాదు. అయినా SC అయితే తప్పేంటి.

అకస్మాత్తుగా ఈ topic ఏమిటబ్బా? అనికుని, అబ్బో ఏమి ఆదర్శం అనుకున్నాను.

SC వాడికి నీ ---- పేరు ఎందుకురా. ఏ మల్లయ్యో, ఎల్లయ్యో పెట్టుకోవచ్చుకదా అన్నాడు. ఏమో సార్. మా అమ్మా, నాన్నా ఇలా పెట్టారు అన్నాను.

అలా నిజంగా జరిగి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అయితే ఈ topic ఎందుకు నడిపిస్తున్నాడో అర్ధం కాలేదు. అయితే నేను శ్రోతగా ఉన్నాను.

“మీ కమ్మోళ్ళింతేరా” అని అనేవాడు. నాకు మార్కులు చాలా తక్కువ వేసాడు. నన్ను personal గా కలిస్తే మార్కులు పెంచుతానన్నాడు. కానీ నేనే వెళ్లలేదు.

కమ్మ, రెడ్డి conflict గురించేమైనా మాట్లాడతాడేమో అనుకున్నాను. కానీ దానిమీద చర్చ నడువలేదు. మధ్యలో నాకో అనుమానం వచ్చించి. గురువుగారేమైనా నా కులం తెలుసుకోవడానికి ఈ story లన్నీ చెబుతున్నాడా అని. కందకు లేని దురద కత్తిపీటకెందుకని మౌనంగానే ఉన్నాను.

Step: 2

అది మేము కలసి ప్రయాణం చేస్తున్న రెండో రోజు.

సార్ ఇలా అడుగుతున్నానని ఏమో అనుకోవద్దు. [నాకు విశయం అర్ధమవుతుంది] Generala గా నేను ఇటువంటి వాటికి వ్యతిరేకిని. కానీ ఇండియాలో తప్పదు. పెళ్ళి సంబంధాలకోసం అడుగుతున్నాను. మీ కులం ఏమిటి?

పరిచయమయిన మూడో రోజున, నేను సహాయం అడుగకుండానే, నాకు పెళ్ళి సంబంధం చూడాలని ఆయనకి అనిపించింది. చాలా గొప్ప మనసు.

అయితే అప్పటికీ ఆయన అంతరార్ధాన్ని అర్ధం చేసుకొని కేవలం సరైన ప్రశ్న కోసం ఎదుర చూస్తున్న నేను చిన్న చిరునవ్వు నవ్వి “నేను మాదిగ” అన్నాను.

ఓహ్. మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సర్. ఆయన సంబరాన్ని వ్యక్తం చేసాడు. కాకపోతే నేనే ఇంకా పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనలో లేను.

ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ప్రతీ సారీ అదే ఆట. కేవలం మనుషులు మారతారు. Repeat. Repeat. Repeat.

అందుకే నా పేరు “సురేష్ కుమార్ మాదిగ”.

ఇప్పుడు నా ఆట మొదలు. జనాల ఆట కట్టు

4 comments:

durgeswara said...

avunu eejabbu mudurutunnadegaani taggatam ledu . jaatiki idoka raachapumdu

Praveen Mandangi said...

గిరిజనుడివయ్యుండీ పేరు చివర శర్మ అని పెట్టుకున్నావేమిటిరా అని నన్ను అడిగేవాళ్ళు ఉన్నారు మా అమ్మమ్మ గారి ఊర్లో. మాది గిరిజన కుటుంబమే కానీ మా అమ్మగారి చిన్నప్పుడే మేము మైదాన ప్రాంతంలో OBCలు ఎక్కువగా ఉండే ఒక గ్రామంలో వాళ్ళ కుటుంబం స్థిరపడిపోయింది. ఇప్పుడు ఆ ఊరూ వదిలేసి పట్టణంలో అగ్రకులాలవాళ్ళు ఉండే వీధిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. శ్రీకాకుళం SBI స్టాఫ్ కోలనీలో మా గురించి అందరికీ తెలుసు కానీ మాది ఏ కులమో తెలియదు. మొదటి నుంచి తెలిసినవాళ్ళకైతే కులం పేరు అడుగుతారు కానీ కొత్తగా ఊర్లోకొచ్చినవాళ్ళకి కులం పేరు అడగరు.

buddhamurali said...

chaala mandi artham chesukoledu kaani peru pakkana maadiga ani cherchenduku yento dairyam kaavali. mandakrishna maadigaku ee aalochana yela vacchindo telisina vaaru oka vyasam raaste baaguntundi.

Ch. Sudhams said...

You remind me of several instances in which I faced probing questions. They start off with name. if they can't 'find out' what they are looking for, next question popes up. Where do you live? Still not happy. Third one, What is your faith? Oh Christian? Yes. A bit of victory. And the questions continue...