Sunday, April 24, 2011

గుంటూరోల్లూ సూపర్

సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు. నేను రాజమండ్రి నుండి రామచంద్రపురం ఆటోలో ప్రయాణిస్తున్నాను. డ్రైవర్ మాట విధానం చూసి, ఎక్కడా గుంటూరా? అని అడిగాను. అవునన్నా ’నల్ల చెరువు’ అన్నాడు. కొంత పరిచయం నడిచాక, ’మా గోదారోల్లు సూపరు’ అని గుర్తుకు వచ్చి, గుంటూరోల్లు తెలివైనోళ్లా, గోదారోల్లు తెలివైనోళ్లా అని అడిగాను. మనోడు అనుకున్నదే తడవుగా, "నేను ప్రకాశం, క్రిష్ణా, గుంటూరు, కర్నూలు, హైదరాబాదు, ఇన్ని జిల్లాలు తిరిగా.. కానీ అన్నా! ఈ జిల్లావోళ్లంతా తెలివైనోల్లిని నేనెక్కడా చూడలేదన్నా’ అన్నాడు. అది పాజిటివ్ గానో నెగటివ్ గానో నాకు అర్ధం కాలేదు. కానీ ఉత్సుకత పెరిగింది.

నిజమా! అయితే ఒక్క ఉదాహరణ చెప్పు. చాలాసేపు వీళ్ళు మామూలోళ్ళుకాదు అని చాలా సేపు చెప్పాడు. చివరికి నా బాధ పడలేక ఒక ఉదాహరణ చెప్పాడు.

ఫైనాన్స్ ఎవరైనా బండి తీసుకుంటే మా గుంటూరులో రెండు నెలల పదిహేను రోజుల వరకూ ఫైనాన్సర్ రాడు, కానీ ఇక్కడ నెలరోజులకే ఇబ్బంది పెడతాడు. ఇది రూల్ కి చాలా వ్యతిరేకం. అలా అడ్డంగా సంపాదించేస్తారు. ఇది నేను ఏ జిల్లాలోనూ చూడలేదు అన్నాడు. వినడానికి చేదుగా ఉన్నా భరించలేని నిజం. నేను మౌనంగానే తల ఆడిస్తున్నాను. అతను చెప్పుకు పోతున్నాడు.

ఎవరో గొడవో ఎందుకు, నా స్వానుభవమే చెబుతాను. రెండు నెలల క్రితం నేను ఈ ఆటోను ఫైనాన్స్ లో తీసుకున్నందుకు నేను చాలా ఇబ్బంది పడ్డాను. నెలరోజుల్లో ఐదువేలు కట్టాలి. కట్టలేకపోయాను. మూడు దఫాగా (అదే నెలలో) నాలుగు వేల అయిదు వందలు కట్టాను. ఇక ఐదు వందలు మాత్రమే ఇవ్వాలి. వాటికోసం నన్ను కొంతమంది హైవే రోడ్డులో ఆపారు. ఆటోను ఆఫీసుకు తీసుకెళ్ళి సీజ్ చేస్తామన్నారు. నా ఆధారాన్నే తీసేసుకుంటే ఇక నా బ్రతుకెలా... అప్పు తీర్చేదెలా... బాధ, కోపం వచ్చేసాయి. అందుకో ఒకడు బండిలోకి వచ్చి కూర్చొని పోనీయ్ అన్నాడు. ఆపుకోవడం నా వల్ల కాలేదు. అయిదు వందలు కోసం నన్ను ఇంత బాధ పెడుతున్నారు. బండి తీసుకెళ్ళి హెవీ వెహికిల్ కిందకు పోనిస్తాను. నాతో పాటు నిన్ను తీసుకెళ్ళిపోతాను. నాకు ప్రాణం మీద తీపి లేదు, నువ్వు కూడా వస్తావా అని బండి స్టార్ట్ చేసాను. వాడు గబగబా బండి దిగేసాను.

గుంటూరోన్ని.. తలదించుకొని బ్రతకను.. నిన్ను బయటికి లాగుతా... నువు రూల్ కి వ్యతిరేకంగా వెళ్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నావు. అమాయకుల దగ్గరనుండీ వడ్డీ పేరుతో బండి తీసుకెళ్ళిపోయి, వేరే వాళ్లకి అమ్మేస్తున్నాను. ఇవన్నీ బయటికి వస్తాయి. అని గట్టిగా మాట్లాడా. ఇప్పటి వరకూ మళ్ళీ నా దగ్గరకు రాలేదు. రూల్స్ తెలియకపోతేం వీళ్ళనుండి మనం నెగ్గలేం.. అంటూ చెబుతున్నాడు..


నా ఆలోచనలకు తోడైయింది "గుంటూరోళ్ళూ సూపర్"

14 comments:

కమల్ said...

అలాంతి వాళ్లు ఒక్క గుంటూర్ మినహా అన్ని జిల్లాల్లో ఉంటారనుకుంటున్నారా..? అలా జిల్లాలను బట్టి..కులాలను బట్టి మనస్థత్వాలుండవు బ్రదరూ..! ఒక్కో మనిషి ఒక్కో తరహా ఉంటారు అంతే..గాని ప్రాంతాలను బట్టి..కులాలను బట్టి మనుషుల మనస్థత్వాలుండవు..! అలా అనుకుంటే ఇప్పుడూ తెలంగాణ వాదులంటున్నట్లు..తెలంగాణ ప్రజలంటా అమాయుకులు..మంచివాళ్లు.. మిగతా కోస్తా, రాయలసీమ, గుంటూరు ప్రాంతాలలొ లేనట్లే మరి.. మరది ఒప్పుకుంటారా..?మీరు చూసిన అనుభవమే మిగతా ప్రపంచమంతా ఉంటుందనుకుంటే అంతకన్న మూర్ఖత్వం ఏది ఉండదు..

Unknown said...

ok supere inko superni recognize cheya galaru

Unknown said...

ok supere inko superni recognize cheyagalaru

ఆత్రేయ said...

Mr.Guntur..

nice posting but try to redesign ur blog. the gap above your new post is very much. i thought its blank.

all the best

Suresh Kumar Digumarthi said...

మీరనుకున్న ’మూర్ఖత్వం’ నా పోస్ట్ లో ఉందని నేననుకోవడం లేదు. మీరన్నట్టు ’ఒక్కో మనిషి ఒక్కో తరహా ఉంటారు’ నిజం. ఒక్కోసారి ఒకోలా ఉంటారు. అన్నింటికన్నా మించిన నిజం ’అనుభవం’. ఎవరి జీవితం అయినా ప్ర్రారంభమయ్యేది వాళ్ళ అనుభవం నుండే. ప్రపంచం అంతా ఇలానే ఉంటుంది అని నేనెప్పుడూ చెప్పలేదు, చెప్పను. నిజానికి అందరూ సూపరే. నాకు ఎవ్వరిమీద తక్కువ అభిప్రాయం లేదు. అయితే వారి way of expression తప్పకుండా different గా ఉంటుంది అని నా నమ్మకం. I am expoloring that difference.

కమల్ said...

మూర్ఖత్వం పదం నేను ఉపయోగించి ఉండకూడదు..క్షమించండి..! కాని నా వ్యాక్యలో వున్న భావం మాత్రం నేను పూర్తిగా నమ్ముతున్నాను.

Unknown said...

డియర్ కమల్,
ఒక రచయత వ్రాసిన కధనాన్ని రచయత ద్రిష్టి లోనుండి చూస్తేనే అతను ఏమి చెప్పదలచుకొన్నాడూ అర్ధమవుతుంది. గుంటూరు వాల్లూ సూపర్ అంటే గుంటూరు వారు 'కూడా' సూపర్ అని అర్ధం. గుంటూరు వారు 'మాత్రమే' సూపర్ అని అర్ధం రాదు. మీరు టైటిల్ ని కొంచం జాగ్రత్తగా చదివి ఉండాల్సింది! ఒకే ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తీ ఆలోచనకి, ఒక ప్రాంతం లో పుట్టి నాలుగు ప్రాంతాలు తిరిగిన వ్యక్తీ ఆలోచనలకి తేడా మనం గమనించవచ్చు. కోస్త ప్రజలలో మొబిలిటీ ఎక్కువ. ఒక్క సారి Crime in AP స్టడీ చేయండి. ప్రాంతానికి-మనస్తత్వానికి ఉన్న సంబధం మీకే అర్ధమవుతుంది. అయతే ఒక్క మాట, ఈస్ట్ గోదావరి crime records లో ఒక్క faction కేసు lodge ఆయన రోజు మీ 'అనుభవాన్ని' పరిగణ లోనికి తీసుకొనవచ్చు! ఆఖరిగా 'పరిశోధనలో నమ్మకానికి స్తానం లేదు'.

ప్రదీప్

Unknown said...

డియర్ కమల్,
ఒక రచయత వ్రాసిన కధనాన్ని రచయత ద్రిష్టి లోనుండి చూస్తేనే అతను ఏమి చెప్పదలచుకొన్నాడూ అర్ధమవుతుంది. గుంటూరు వాల్లూ సూపర్ అంటే గుంటూరు వారు 'కూడా' సూపర్ అని అర్ధం. గుంటూరు వారు 'మాత్రమే' సూపర్ అని అర్ధం రాదు. మీరు టైటిల్ ని కొంచం జాగ్రత్తగా చదివి ఉండాల్సింది! ఒకే ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తీ ఆలోచనకి, ఒక ప్రాంతం లో పుట్టి నాలుగు ప్రాంతాలు తిరిగిన వ్యక్తీ ఆలోచనలకి తేడా మనం గమనించవచ్చు. కోస్త ప్రజలలో మొబిలిటీ ఎక్కువ. ఒక్క సారి Crime in AP స్టడీ చేయండి. ప్రాంతానికి-మనస్తత్వానికి ఉన్న సంబధం మీకే అర్ధమవుతుంది. అయతే ఒక్క మాట, ఈస్ట్ గోదావరి crime records లో ఒక్క faction కేసు lodge ఆయన రోజు మీ 'అనుభవాన్ని' పరిగణ లోనికి తీసుకొనవచ్చు! ఆఖరిగా 'పరిశోధనలో నమ్మకానికి స్తానం లేదు'.

ప్రదీప్

Suresh Kumar Digumarthi said...

@Depu
నమ్మకాన్ని వాపస్ తీసుకుంటున్నాను.

Unknown said...

Dear suresh anna,

my reply is addressed to KAMAL.

PRADEEP

కమల్ said...

@దీపు.
ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాల్లో కొద్దిపాటు తేడా వున్నా కూడ మనుషులు ఎక్కడైనా మనుషులే..! మనుషులుకుండే అన్ని లక్షణాలు.. ఉద్వేగాలు..కోపాలు..తాపాలు.. అనుబందాలు అందరికీ ఒక్కటే..అది అమెరికావారికైనా..భారతీయులకైనా.. ఆఫ్రీకా వారికైనా..వస్తిస్తుంది..! కొద్దిపాటు చిన్నచిన్న తేడాలుంటాయి..అవి సర్వసాదారణం..! ఒక ఊరివారు తమ పక్క ఊరివారిని హాస్యంకోసమో లేక హేలనతొనో..తమ మద్యనున్న చిన్న చిన్నతేడాలను ఎత్తి చూపిస్తూ.. వెక్కిరిస్తారు..! ఇది ఎక్కడైనా ఉన్నదే..మా పక్క వూరు వాళ్లను మా వూరివాళ్లు..వెక్కిరిస్తారు " మీది మొరటు బాష ..మొరటు చేష్టలని.." అలా చాలానే.. అలాగే మా పక్క వూరివారు కూడ మా వూరివారిని మరో లోపాన్ని ఎత్తిచూపుతూ హేలన చేస్తారు..! అవన్ని మనుషుల్లో ఉన్న ఒక జాడ్యం అంతే కాని అవి ఒక్కరికి మాత్రమె పరిమితం కాదు..!ప్రతి ఒక్కరు తమగురించి గొప్ప చెప్పుకోవాలంటే పక్కవారిని కాస్త తక్కువ చూపినప్పుడే తమ గొప్పతనం కనపడుతుంది అన్న మనస్థత్వం ఎక్కువ మనుషులకు. మీరు ఫ్యాక్షన్ అన్న పదాన్ని ఎత్తిచూపారు కదా..!! ఫ్యాక్షన్ అన్ని ప్రాంతాలలో ఉన్నదే..! కాకపోతే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో ఉంటుంది దాని స్వబావం..! గ్రామక్షలు లేని గ్రామాలున్నాయా మన దేశంలో..ఎక్కడైనా..? కాకపోతే వాటి స్వరూపాలు వేరుగా వుంటాయి..! మీరంటున్న గుంటూరు మాచర్ల ప్రాంతంలో ఎన్ని స్యాక్షన్ గొడవలు, హత్యలు జరగలేదు..? ఇక ఈస్ట్ ‌గోదావరి గురించి ఉదహరించారు..మీకు తెలుసో లేదో..ఒక్క ఈస్ట్ ‌గోదావరి ప్రాంతం వారే కాదు..మన రాష్ట్రంలోని చాలా జిల్లాలవారు కిరాయి హంతకులతో ఒప్పందాలు చేసుకొని " పని ముగిస్తున్నారు " మీకు దగ్గర్లో ఎవరన్న క్రైమ్ రిపోర్టర్స్ ఉంటే వారిని సంప్రదించండి మీకు తెలుస్తాయి విషయాలు. అవన్ని పోలీసు రికార్డ్స్‌లలో చేరవు.నేను గత 20 ఏళ్లుగా మీడియాలో ఉంటూ..చాలా డ్యాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తున్నవాడిని.. నా పరిశోధనలో చాలానే విషయాలు తెలుస్తూనే ఉంటాయి..అదొక నిరంతర ప్రక్రియ. నాకు మీకంటే ఎక్కువ తెలుసు అన్న అహంకారం కాదు నాది..నా వృత్తిలో భాగంగా చాలానే చూస్తూ ఉంటాను కాబట్టి చెబుతున్నాను అంతే. వాకె..ఇవి ఎంత మాట్లాడిన తెగని మాటలు..ఇక పొడిగింపు అనవసరం అనుకుంటాను.

Suresh Kumar Digumarthi said...

@ Depu: Still, withdrawing a good job.

Prasad said...

మీ పోస్ట్ సూపరండీ! మన అనుభవం అనేది ఒక ర్యాండం సాంపుల్ లాంటిది. వంద బాల్స్ ఉన్న బుట్ట లోంచీ కళ్ళూ మూసుకొని ఓ ఐదు బాల్స్ తీస్తే, ఆ ఐదు బాల్స్ లో నల్ల బాల్స్ ఎక్కువ గా ఉంటే, బుట్ట లో నల్ల బాల్స్ ఎక్కువ గా ఉన్నట్లు భావించాలి. గోదావరి జిల్లాల వాళ్ళు మంచి వ్యవహారం తెలిసిన వాళ్ళూ అనేది నా అనుభవం లోని విషయం కూడా..కానీ అందరూ అలా కాక పోవచ్చు.

Suresh Kumar Digumarthi said...

@ Prasad: Mine is absolutely randam sampling. This expression is limited to particular incident only