Thursday, March 31, 2011

మా గోదారోల్లు సూపరు

అది నర్సాపురం- సఖినేటిపల్లి రేవు. నేను మొదటి సారి పంటి ఎక్కాను. నా స్కూటి ని నెమ్మదిగా ఎక్కించి, రివర్స్ చేసి నిల్చున్నాను. ఇంతలో ఒక పల్సర్ బండి మీద హీరో లాంటి కుర్రాడు వచ్చాడు. ఇంత పెద్ద బండి ఎలా రివర్స్ చేస్తాడా అని ఆశగా చూస్తున్నాను.
బండి తిన్నగా ఎక్కించి, సైడు స్టాండు వేసి, దానిపై గిర్రున తిప్పి, నేను నిలబడ్డ లైనులోకి సమానంగా వచ్చాడు. పవన్ కళ్యాన్ సినిమా చూసినట్టనిపించింది.
సన్నగా నా పెదాలపై చిరునవ్వుతో, నా మనసు అంది 'మా గోదారోల్లు సూపరు'

2 comments:

రాధిక(నాని ) said...

బాగుందండి ఫోటో ఉంటే చుసేవాల్లము.నేనూ గోదారమ్మయినే నండి

Suresh Kumar Digumarthi said...

మీరు సెప్పింది రైటేనండి..నేనేమో enjoy సేత్తా ఉండి పోయానండి.. నాకు తట్టలేదండి