Wednesday, February 9, 2011

నిస్సహాయత

ఒక తెలివైన, ఉత్సాహవంతడైన, కష్టపడగలిగిన వ్యక్తి. ఓ రోజు Ph.D Pre-submission seminar కి వెళ్ళాడు. ఆ రోజు ఆ సభలో నేను కూడా ఉన్నాను. ఓ పెద్దాయన తొమ్మిదేళ్ళుగా పిహెచ్.డి. చేస్తున్నారు. ఆ రోజు ఆ సభ ఆయన ఏర్పాటు చేసినదే. ఆయన మధ్యలో Deregistration చేసుకొని, ఓ రెండు నెలల క్రితం Re-registration చేయించుకొన్నారు. యూనివర్సిటీ లెక్కల ప్రకారం అలా Re-registration చేయించుకొన్న వారు కేవలం ఆరు నెలలో submit చేయాలి.

సభ చాలా ఘనంగా ప్రారంభమయింది. ఆ పెద్దాయన చక చకా తను చేసిన పనిని విశ్లేషిస్తు ముందుకు సాగిపోతున్నాడు. అందరూ చాలా ఆశక్తిగా వింటున్నారు. కాని కొంత సమయం తరువాత ఆ తెలివైన కుర్రాడు చాలా అసహనంగా కనిపించాడు. ఆ పెద్దాయన చెప్పేది వింటున్నట్టుగా కూడా నాకు అనిపించడం లేదు. కాని అతని ముఖంలో ప్రశాంతత కరువైనట్టుగా నాకు అనిపించింది.

పెద్దాయన presentation పూర్తయ్యింది. నెమ్మదిగా ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. ఇక తెలివైన కుర్రాడి వంతు వచ్చింది. ఆ కుర్రాడు తనలోని అసహనాన్ని మరింత పెంచి, I have a problem with your hypothesis. You have 3 hypotheses. You can’t keep too many hypotheses. Your hypotheses are very complex, but it should be very simple. I think, you have not followed the proper framework to frame the hypotheses. పెద్దాయనకు ఒక్కసారిగా ఏమీ అర్ధం కాలేదు. ఇన్ని hypotheses ల వల్ల రీసెర్చికి ఏ విధంగా నష్టం కాదో, తన వేరు వేరు hypothesis లని ఎలా justify చేసాడో మళ్ళీ చెప్పాడు. ఇక ఆ తెలివైన కుర్రాడి అసహనం రెట్టింపు కాదు, కొన్ని రెట్లు పెరిగిపోయింది. You do not understand my point. You first tell me “what is hypothesis”. తన M.A, class లో కూడా Research Methodology చెప్పిన teacher అంత గట్టిగా అడుగలేదు. గత తొమ్మిదేళ్ళుగా తన Research analysis లో మునిగిపోయిన పెద్దాయనకు, అర్ధం చెప్పగలడుగానీ, అచ్చం definition లాగా చెప్పడం కష్టమైన పని. అంతమంది ముందు కాదంటే కప్పకు కోపం, వదలమంటే పాముకి కోపం అన్నట్టుంది ఆయన పరిస్తితి. తన work ఇంకా మెరుగు పరచడానికి ఉపయోగపడుతుందని, ఈ సభ ఏర్పాటు చేసారు. కానీ చర్చంతా మారిపోయింది. అసలు టాపిక్ అందరూ మరచిపోయారు. ఆ కుర్రాడు శాంతించడం లేదు. ఆ పెద్దాయన వివరిస్తున్నాడు కానీ ఆ కుర్రాడికి నచ్చిన terminology లో చెప్పలేక పోతున్నాడు. అ తెలివైన కుర్రాడిని శాంతింప చేయడం కానీ, తృప్తి పరచడం కానీ సభలో ఉన్న ఎవ్వరివల్లా కాలేదు. అసంపూర్ణంగానే సభ ముగిసింది.

ఒక ప్రశ్న ఆయన జీవితాన్నే మార్చేసింది. తన Field work లో తన అలుపెరుగని శ్రమ కనిపిస్తుంది, సమాజంలో జరుగుతున్న సమస్యకు తన వంతు సాయం కనిపిస్తుంది. ఆ సమాచారం సంపాదించడం కోసం తను ఎన్నిసార్లు తిరిగాడో చాలా తక్కువ మందికే తెలుసు. అయితేనేం? ఆ కుర్రాడిని సంతృప్తి పరచలేకపోయాడు.

తను submit చేయడానికి కేవలం నాలుగు నెలలే ఉన్నాయి. తరువాతి రోజు రాత్రంతా తన supervisor తోచర్చించాడు. చాలా భాగం hypotheses మీదనే. సరేలే రేపు draft final print తీసుకు రా అన్నారు. కొండంత బరువు దిగిపోయినట్టయింది ఆ పెద్దాయనకు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లారి తన పనులన్నీ త్వరగా ముగుంచుకొని వెళ్లబోతున్న సమయంలో ఒక ఫోను. “మనం ఇంకో ఆరు నెలలు మెరుగ్గా పని చేసిన తరువాత submit చేద్దువు గాని, ప్రస్తుతానికి printing ఆపు” అని supervisor చల్లగా చెప్పారు. ఆ పెద్దాయన మెల్లగా కుప్పకూలిపోయారు. ఎందుకంటే De-registration తరువాత Re-registration చేయించిన ఆరు నెలలో submit చేయకపోతే ఆ ph.d cancel అవుతుంది. ఆట మళ్ళీ మొదటినుండి ప్రారంభించాలి.

ఇప్పుడు అసహనం ఆ కుర్రాడిది కాదు, నాది. ఆ సభలో నీ ప్రశ్న ఆయన జీవితాన్ని ఇలా మార్చేసిందని అడిగే హక్కు నాకు లేదు, ఒక చిన్న సమాధానాన్ని మీకనువుగా మార్చుకొని సమాధానం చెప్పలేక పోయారే అని ఎన్నిసార్లడిగినా ప్రయోజనం లేదు, ఆయనలో తొమ్మిదేళ్ళుగా కనిపించని దోషం మీకు ఇప్పుడెందుకు కనిపించదని వాళ్ళ supervisor ని అడిగే ధైర్యం లేదు. మనం నేర్చుకొన్న చదువు వల్ల ఒరిగిన జ్నానం, నలుగురికి సహాయ పడాలే కానీ, నలుగిరిని ఇంకా వెనక్కు నెట్టేస్తే నా ప్రయాణం ముందుకెళ్ళినట్టా? వెనక్కెళ్ళినట్టా?

2 comments:

చెప్పాలంటే...... said...

ee rojullo pani enta kastapadi chesru ani chudarandi, kaburlu cheppi spu vese vaarike praamukhyata...

S Swaroop Sirapangi said...

I think by sharing your agony here, you are are diplomatically expressing to all the intended persons too. Whether they can come to know this immediately or not is a secondary matter, as of now. But, certainly, at least, at some of time, they may come to know, and may try to present you their version of convincing reply. Then, again, if possible, let us know, whether do you still feel agony or not!

Any how, its true that we can not express every thing at uncertain tempting time. But, I hope, one waits conciously for right time, and in such a process too, if you can wait, this kind of agony can be let downed! So, at last, I hope, you should get right time to out-let your agony, hopefully at the earliest!!(May be, expressing here itself may present relief from agony...it depends on individual behaviour...) All the best.