Tuesday, January 19, 2010

శంభో శివ శంభో’ ఒక విషయం ఉన్న సినిమా


సినిమా తీయాలి కాబట్టి ఉన్న కధనే తిప్పి తిప్పి ఎన్నో సినిమాలు చేస్తున్న సమయంలో ఉన్న కధలోనించి, చిన్న చిన్న ట్విస్టులతో కొత్త కధను, సందేశాన్ని చూసినట్టనిపించింది. నన్ను అన్నింటికన్న బాగా కట్టిపడేసింది వారి నటన.
రవితేజ మార్కు సినిమా. రవితేజ ఆవేశం, emotions, fights, అన్నీ చిత్రానికి పట్టుకొమ్మలే. కానీ నన్ను అంత ఎక్కువగా మనసుకు హత్తుకుంది అల్లరి నరేష్ మరియు శివబాలాజీ. సినిమా చివరి వరకూ ప్రేమ కోసం స్నేహితులు ఇంత త్యాగం చేస్తారా. చేయాలా అని మనసుని కదిపి వేసింది.
దర్శకుని ప్రతిభ ప్రతీ షాట్ లోనూ కనిపించింది. అది శివ బాలాజీ-అభినయ, రవితేజ-ప్రియమణి సన్నివేశాలు, కుటుంబ సన్నివేశాలు. సంగీతం మనల్ని కధతో పరుగులు తీయిస్తుంది.
వినబడని నరేష్, నడవలేని శివ బాలాజీ నటన అద్భుతం అని చెప్పాల్సిందే. అన్నింటికన్నా కేవలం సందేశం మాత్రమే ఇచ్చి, పాత్రల్ని మనకే వదిలేసిన సముద్రఖని ఎంతైనా అభినందనీయుడే.

2 comments:

శివ చెరువు said...

right... very good movie with nice feel... I watched it in Tamil. Since, the same directed did it here too, we can expect the nice result..

రాజ్ కుమార్ said...

Naaku kooda ee movie baaga nachindi... i watched it 2 times..