Wednesday, August 19, 2009

దేవుడిది ఏ కులం

ఏడవ తరగతి చదువుతున్న మా అన్నయ్య గారి అమ్మాయి, ఆరవ తరగతి చదువుతున్న మా పెదనాన్న గారి మనుమడు ఆడుకొంటున్నారు. నేను ఇలా computer దగ్గర కూర్చొని ఏదో చదువుతున్నాను. వాళ్ళిద్దరికీ నేను బాబాయినే. వాళ్ల పనిలో వాళ్ళు, నా పనిలో నేనూ ఉన్నాం.

ఇంతలో మా పాప పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. బాబాయి వీడికో doubt వచ్చింది చెప్పవూ అని. ఏ subject లో doubt అడుగుతాడో చెప్పేద్దామని ఆశగా వాడివైపు చూసాను. వాడేమో అడగడానికి సిగ్గు పడుతున్నాడు. ఇంతలో మా అమ్మాయి తనే అందుకొని, వీడు "దేవుడు ఏ కులం అని అడుగుతున్నాడు" నువ్వు చెప్పు బాబాయి అని తనకి కూడా సమాధానం కావాలన్నట్టుగా చూసింది.

నా పరిస్తితి అడకత్తెరలో పోక చెక్క అయ్యింది. ఇన్ని బ్లాగులు చదివినా, రాసినా, ఇలాంటి ప్రశ్నను ఊహించలేదు. మా ఊరు IInd grade municipality అయినా మేముండే ప్రాంతం మాత్రం పల్లె వాతావరణమే ఉంటుంది. అక్కడ అంబేద్కర్ నగర్, గాంధీ నగర్, కనగ దుర్గ అమ్మవారి వీధి, ఇలా వుండవు. మాదిగ పేట, కుమ్మరి పేట, చాకలి పేట, శెట్టిబలిజ పేట, కాపుల పేట ఉంటాయి. అన్ని పేటలలోనూ అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. మా వాడు కొంచె తెలివైన వాడు. అందుకే వీడికి ఆ ప్రశ్న వచ్చింది.

ఆ వయసుకు నా ఆలోచనలన్నీ చెప్పేస్తే వాడికర్ధం కాదేమో అని అనుమానం. నీకెందుకురా అని కొంతమంది లాగా తిట్టి పంపించలేనూ. ఇన్ని అనుమానాలతో నేను ఉంటే వాళ్ళు ఇంకా నా వైపే చూస్తున్నారు. అందుకే దేవుడు మన కులమేరా అని చెప్పాను. అంతే వాళ్ళు అక్కడి నుండి గొప్ప విశయాన్ని సాధించినట్టుగా విజయ గర్వంతో వెళ్ళిపోయారు.

ఇప్పటికే కులం గురించి రకరకాల మనుషులతో రక రకాలుగా వాదించి, చర్చించి అలసిపోతున్నాము. కనీసం వాళ్ల కొంతకాలమైనా ప్రశాంతంగా వుండాలని అలా చెప్పేసాను. నిజానికి నాకు దేవుడే లేడు, ఇక కులమెక్కడ తెచ్చేది.

కానీ ఆంధ్ర ప్రదేశ్ లో దలిత వినాయకుడిని, అయ్యగోర్ల వీధిలో ఊరేగించినందుకు, ఊచకోత కోసిన సంఘటనలు మాత్రం ఇంకా మరిచిపోలేదు.

No comments: