స్వేచ్చకోసం
ఖమ్మం కవుల శ్రీ శ్రీ స్మారక కవితా సంకలనం
సంపాదకులు: ఐనాల సైదులు, గద్దపాటి శ్రీనివాస్
జూన్:2008, ప్రజా రచయితల సమాఖ్య-ఖమ్మం
నన్ను తడిమిన కొన్ని అక్షరాలు
ధరఖాస్తులో నాకులం
సరిగానే నివేదించాను
అయినా మండలాధికారి
తానెందుకో నమ్మలేదు
ఇతర కులపోళ్ళు ఎవరైనా ఇద్దరు
వాంగ్మూల పత్రాలు
దాఖలు పరచాలన్నారు - గరికపాటి మణీందర్
మాకు కొండల్ని పిండికొట్టే కండబలాన్ని
దేనినైనా ఎదురించే గుండెబలాన్ని
ఇచ్చింది నిజానికి గొడ్డుమాంసమే కదా
రోగమొచ్చిందనో డాక్టరు తినమన్నాడనో
సలవసేత్తుందనో దొంగసాకులు సూపి
సాటుమాటుగా తెచ్చుకొని తెగమెక్కడం లేదా
ఇయ్యాల అన్ని కులపోళ్ళూ
తినుడు నేర్సినాకే కదా
కుర్రమాంసం ఇంతగా కిర్రెక్కిపోయింది
అయినా తెలీకడుగుతాను
తినేదికాడా ఆచ్చేపనేందయ్యా
ఎవడికి నచ్చినట్టు వాడుంటడు
మధ్యలో పనిగట్టుకుని
పెసారాలు సెయ్యాల్సిన
దురదేందంట నీకు - జి. మాణిక్యరావు
పురస్కారాలు సరితూగని
మహాకవి
సంకుచిత సరిహద్దుల్ని దాటిన
విశ్వమానవతా మూర్తి
’విడిపోవడం చెడిపోవడమే’నన్న
సమైక్యతావాది
ఒక శ్రీ ప్రేరణ ఒక శ్రీ జాగృతి
వెరసి శ్రీశ్రీ సాహిత్యాకృతి !!
తనమార్గాన్ని మనకొదిలిన
పాతికేళ్ళ ’మరో ప్రపంచ’ యాత్రికుడు -బి. ఇందిర
చందస్సుల చరబట్టి
అలంకారాల నిదిలిపెట్టి
కఠిన పదాలపై కోతపెట్టి
మహా ప్రస్థానానానికి శ్రీకారం చుట్టి
గ్లోబలైజేషన్ పుణ్యమాని
తరలిపోతున్న మేధోజీవం
డాలర్ల వర్షానికి
డేగల్లా ఎగిరిపోతుంటే
జీవంలేని ప్రభుత్వం అస్తిపంజరం
చూస్తూ కూర్చుండె - కాలువ సుధాకర్
కలాన్ని హలముక జేసి
పదాల పొలముల దున్ని
అక్షరం విత్తులు నాటి
జగత్తు మత్తుని దులిపి - బి.రాజా
అంతులేని స్వార్ధాన్ని ... బల్లకింది చేతుల్ని
నా రహదారి సాక్షిగా ఎన్ని సార్లు ఖండించినా
అవే అంకురాలు
మళ్ళీ మళ్ళీ మొలవడం చూస్తున్నా
మరిగే రక్తంలో దు:ఖాన్ని ఇంకించి
ఎండిన కళ్ళను ఎడారుల్లో అతికించి
నేను ఓ ఇసుక తుఫానునై
అవినీతిని అణువుగా చీల్చి
ఆకాశంలో ఎగురుతాను - కల్వకోఝ్వుల రమేష్
ఈ నేలమీద యీ బురదలో
నా పక్కనే కూచుంటావు
కాని నీ అభిమానం నా మీద కాదు
నా చేతిలోని ఓటుమీద
ఓటు వెనుక గద్దెమీద
అందుకే నీ ఆతిధ్యం నాకు వద్దు
మా యింటికి నువు రానే వద్దు - రవీంధ్రనాధ్ జూపల్లి
మనిషి మనిషికో నీతి
కులానికి ఓ నీతి మతానికి ఓ నీతి ప్రభోదించే
మీ పాఠశాలలో
మాకు అడ్మిషన్లు అవసరం లేదు
ీ తప్పుల్ని ప్రశ్నించకూడదు
మీ మాటల్ని ధిక్కరించకూడదు
అసమ్మతి నెపంతో కొందరినీ
క్రమశిక్షణ సాకుతో మరికొందరినీ
మీ కంచె తాకకుండా కట్టుదిట్టం చేస్తారు - దాసరి రాజబాబు
మనకు ఖచ్చితంగా నమ్మకం ద్రోహం చేసే
మహ రాజులకు
వారి సామంతులకు
వినతి పత్రాల రూపంలో
జరిగిన అన్యాయాల్ని
అక్రమాల్ని
లయబద్దంగా విపులీకరిద్దాం - నవ్యశ్రీ
పశువులకే కాదు మనుష్యులకు కొట్టాలొసున్నాయి
ఆరుబయటకాదు అందరి మధ్య
నిలువెల్ల సోదాచేసి అస్తిత్వాన్ని ప్రతిరాత్రీ
యింతింత దోచుకు పోతుంటారు
పెదవులు..చేతులు..కాళ్ళు
ఎక్కడ తడబాటు కనిపించినా
మన్సెక్కడుందని బడితపూజ మొదలు బెడ్తరు - జె. రవీంద్రనాధ్
మేము నిన్ను నమ్మనే నమ్మం
ఎందుకంటే
అపనమ్మకానికి నీవు "అమ్మ"వు గనక
కసాయి తానికి "అయ్య"వు గనక - డి. వెంకట్రామయ్య
చావెన్నటికీ పరిష్కారం కాదంటూ
గుండె దిటవుగా దండిగ నింపుకు
బతుకు పోరులో నిత్యం గెలవాలంటూ
ముడిచిన ఈ పిడికిలి సాక్షిగ
నేర్పిస్తానేటి నుండి నా పిల్లలకి
పోరా(డ)ట మంటే ఏమిటో - బొమ్మరాత యల్లయ్య
ఈ భావాలన్నీ నన్ను తడిమిన సైదులుకే అంకితం
No comments:
Post a Comment