Wednesday, February 25, 2009

నిశబ్దం పగిలింది






నిశబ్దం వీడి పోయింది
నా సహనం నశించి పోయింది
నా మౌనం ఇప్పుడు పొలికేకై అరుస్తుంది
నీ మాయ మాటలు నమ్మే రోజులు పోయాయి
నా వాటా...నాది
ఎవరు ఇవ్వరో తేల్చుకుంటాం
ఆరెతో చెప్పే కాదు
నీ నోరు కూడా కుట్టేస్తాను
కోసీ.. కోసీ.. రక్తానికి, మాంశానికి
నా కళ్ళు అలవాటు పడిపోయాయి
నాలో నేర్పరితనం పెరిగిపోయింది
నీ మాట ముగుసేలోగా
నీ చర్మం వలిచేస్తా
నువు కళ్ళు మూసేలోగా
నీ రక్తంలో నిన్ను స్నానం చేయిస్తా
ఖబడ్ఘార్...
నా మౌనం నీకు లోకువయ్యిందా
నా మంచితనం నీకు అలుసయ్యిందా
ప్రజాస్వామ్యంలో ఆట నీకే తెలుసా
నేను మొదలెట్టే వరకే అది
ఇప్పుడు సమాధానం చెప్పు
నిన్నటి వరకు ఇది నా సమస్య!
అందుకేనా అందరు చోద్యం చూస్తున్నారు
ఇక సమయం లేదు...మాట్లాడండి
నోట్లోని అడ్డాన్ని ఊసేయండి
మెదళ్ళుకున్న బూజు దులపి మాట్లాడండి
నేనిపుడు గాయపడ్డ ఆబోతును
నీ నాటకాలలో విసిగి, వేసారిన ఏనుగును
నేను ఊరిమీదికొస్తున్నాను
ఇంతవరకూ నా మౌనాన్ని చూసావు కదా
ఇప్పుడు నా కోపాన్ని కూడా చూడు
రగలిపోతున్న నా కళ్ళల్లోకి సూటిగా చూడు
దహించిపోతున్న నా గుండెను చూడు
మోగిస్తా... మోగిస్తా
నీ చెవులు పేలిపోయె దరువేస్తా
నీ కళ్ళు అదిరిపోయే నాట్యం చేస్తా
ఈ భయంతోనైనా నువు మాట్లాడాలి
పోకిరి మాటలు కాదు
తెరవెనుక ఆటలు కాదు
నేను యుద్దానికు సిద్దంగా ఉన్నాను
రా...రా..దమ్ముంటే తేల్చేసుకుందాం
అడుగని వారికే అన్నీ ఇస్తున్న నీకు
పదిహేనేళ్ళుగా నాగొంతు వినిపించడంలేదా
అరుపుటంటే ఎలా ఉందో వినిపిస్తాను
నిశబ్దం లావాలా పగిలితే
ఎలావుంటుందో చూపిస్తాను
న్యాయం కోసం వాటాలు పంచమన్నోడ్ని
తేడాలొస్తే నిన్నే వాటాలేసేస్తాను.


[ఎస్సీల వర్గీకరణలో నా వాటా కోసం]

3 comments:

Kathi Mahesh Kumar said...

ఈ స్ఫూర్తి అందరి మాదిగలకూ ఉంటే ఈ పాటికి వర్గీకరణ జరిగిపోయేది. ఇప్పుడిదొక రాజకీయ ఆట. రాజశేఖరుడి సయ్యాట. కృష్ణమాదిగ బంతాట.

Bolloju Baba said...

కవిత నిండా ఎమోషను పెల్లుబికింది.
భావం స్ఫష్టంగా తన గొంతు వినిపించింది.

Anonymous said...

naaku bhayam vesindi, ayyabaaboi!
:)
powerful