ఆమె నవ్వితే ముత్యాలు రాలతాయి
ఆ వెనుకే నేను అవి ఏరుకుంటూ వస్తాను
ఆమె మాట్లాడితే
నా చెవిలో మధురమైన సంగీతం
నేను మైమరచిపూతాను
ఆమె స్పర్శ
నాకు స్వర్గపు అంచులు చూపిస్తుంది
ఆమె అంటే నాకంత ఇష్టం
అందుకే ఆమె నన్ను వదిలి వెళ్ళినప్పుడూ
నేను సాదరంగా సాగనంపాను
అది తన ఇష్టం
కాదనడానికి నేనెవరు?
నేను మాత్రం ప్రేమించాను..ప్రేమిస్తూనే ఉంటాను.
-సురేష్ కుమార్ దిగుమర్తి,
-సురేష్ కుమార్ దిగుమర్తి,
09.01.౨౦౦౯
పరిశోధక విధ్యార్థి
రాజనీతి శాస్త్రం
హైదరాబదు విశ్వవిద్యాలయం
[ప్రేమ భగ్నమైనదని బతుకు భగ్నం చేసే వాళ్ళకు అంకితం]
4 comments:
కొంపదీసి ఒక అధ్యాయంగానీ ముగిసిపోలేదుకదా!
@katti
Ayyaabaaboy, idi kevalam spandana maatrame. eppudo raayaalanukunnaanu, ippudu kudirindi ante.
baagundi :) ..chakkagaa cheppaaru
చక్కని భావనండి.......ఫ్రేమిస్తూనే వుండండి....
Post a Comment