ఇది అస్తమానూ వినబడే మాట కాదు. దానికో సమయం సందర్భం వుంటాయి. నా మట్టిబుర్రకి చాలాకాలం అదేమిటొ అర్ధం కాలేదు. కానీ ఎవరి చేతిలొనైనా మోసపోయినప్పుడు, మనం మంచోడనుకున్న వాళ్ళు మనకి మంచోళ్ళు కానప్పుడు, మన మాట విన్తరనుకున్నవాల్లు మన మాట విననప్పుడు, ఒక్కమాటలో చెప్పాలంటే మనకి బాధ కలిగినప్పుడు, మనం పక్కావారి మీద కోపాన్ని మాటల్లో తీర్చేసుకోవడానికి ఉపయోగించే పదం. అది విన్నప్పుడల్లా నేను అనుకొనే వాడిని, ఒక మనిషిని చూడగానే వాళ్ళు మంచో కాదో ఎలా తెసుస్తుంది అని. చాలా కాలం ఆలోచించాను, ప్రయత్నించాను. నావల్ల కాలేదు. ఎప్పటికి నేను ఎదుటి వారి గురించి తెలుసుకోలేక పోయాను. అందరు అనుకొనే "ఆ" మోసం అనుభవాలు వస్తూనే వున్నాయి. ప్రతీ సారీ చిన్నప్పటి నుండి చెవిలో అరిగిపోయిన రికార్డు గుర్తొస్తూనే వుంది. కానీ ఓ రోజు, నా మంచం మీద వెల్లకిలా పడుకొని, గిర్రున తిరుగుతున్న పంఖా వైపు చూస్తూ, పని పాటా లేక, తల అలా ఇలా తిప్పుతూ ఉంటే, తళుక్కున మెదడులో మెదిలిన ఓ తుక్కు అలోచన 'కీడెంచి మేలెంచు ' తుప్పొదిలి పోయింది, సమాధానం దొరికింది. అవును నిజమే కీడెంచకపోతే మేలెంచలేము. నేను చదివిన రాజనీతి తత్త్వం లో ఒక మహానుభావుడు చెప్పినట్టు మనుషులంతా స్వార్థ పరులు, క్రూరమైన స్వభావం కలవారు, దుర్మార్గులు అనుకుంటే సమస్యే లేకుండా పోతుంది. తప్పు చెయ్యని మనిషి ఉండడు. అది వ్యక్తీ నైజం.
మనుషులంతా ఇలానే ఉంటారు అని తెలిసినపుడు, నేనూ మనిషినే కాబట్టి ఇతర మనుషులతో నేనెలా వుండాలి అని ఆలోచించుకుంటే సరిపోతుంది కదా. అలాంటి సమయంలో ఎవరైనా మనం ఆకున్నంత చెడ్డగా కాకుండా వేరేలా ఉంటే వాళ్ళే మంచోళ్ళు. ఎప్పుడూ మంచిగా వుండడం అందరికీ అన్ని సమయాల్లోనూ సాధ్యం కాదుకదా, దీనిని మనం కీగ్రంట గమనించ గలిగితే అందరూ మంచోల్లే.
ఇంకేమి చెప్పమంటారు నాలో నూతనోత్సాహం. అందరూ నాలాంటి వారే.
No comments:
Post a Comment