నేను సోమవారం [౦౮.౧౨.౨౦౦౮] న స్నేహితుడి వాళ్ళమ్మకు ఆపరేషను ఉందని రక్తం ఇవ్వడానికి నిమ్స్ కి వెళ్లాను. ప్రధాన ద్వారం దగ్గర, ఉదయం తొమ్మిది గంటలకు నా బండి (బజాజ్ స్పిరిట్) ఐదు రూపాయలు చెల్లించి, కాపలా పెట్టి లోనికి వెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి నా బండి కొంచెం లోపల వుండి. తాళం వేయవద్దని చెప్పడం వలన అసలు తాళం వేయకుండా, ఇంజను తాళం వేసి వెళ్లాను. సౌకర్యమ్ కోసం అలా పెట్టారని అనుకోని, బండి దగ్గరకు వెళ్లి బయలు దేరడానికి, పెట్రోలు ఆను చేద్దామని చూసే సరికి అక్కడి పరికరం బాగా వదులు అయిపోయి, పని చేయకుండా వుంది
ఎవరో నా బండి మీద గట్టి ప్రయత్నమే చేసారు. కానీ విఫలం అయ్యారు. ఇక ఎవ్వరైనా ఆ ప్రదేశంలో స్పిరిట్ బళ్ళు పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది అంట సులభం కాదని తెలిసి పోయింది. ఆ దొంగ వున్నంత కాలం మనం నిర్భయంగా గా వుండవచ్చు. తను ఇక స్పిరిట్ జోలికి పోడు. ఇది తనకీ నాకు మంచి అనుభవమే కదా.
3 comments:
నాది ఏకంగా బండే పోయింది. :(
అనంతం గారి కొసమెరుపు అదిరింది
హేమంత్ గారు
పోయే దానిని మనమేమీ చేయలేమండీ, ఇది కొంచెం ఉపసమనం అంతే
Post a Comment