నీ మాటలలో ఏదో
తెలియని అయస్కాంతం ఉంది
నీ దగ్గరగా
వచ్చానేమో – నన్ను లాగేసింది
మాటల మైకంలో
మురిపించేస్తుంది
ప్రేమల మాటలతో
సొంతం అయ్యింది
ఈ ప్రేమ, ఈ మాట
జీవితాంతం ఉంటే
బావుంటుంది!!
నువు నాకు నచ్చావంటూ నా మనసే చెబుతుంది
నీతోనే ఉండాలంటూ నియమాలే చెబుతుంది
ఊహలలోనైనా నీతో - ఎడబాటే అనిపిస్తే
మరుక్షణమే నే..ను - నీకోసం వచ్చేస్తా!!
http://chirb.it/D8Gksx http://chirb.it/D8Gksx
No comments:
Post a Comment