Thursday, March 14, 2013

Limited capacities and wider thoughts cannot travel together



పరిమితమైన శక్తి యుక్తులు, విశాలమైన ఆలోచనలు కలసి పయనించలేవు

కొంతమంది వ్యక్తులు మన జీవితంలో అకస్మాత్తుగా ఎదురవుతారు. వారి తాకిడి తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది.  వారు మన నుండి చాలా ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. వారు ఆశించినది మనం ఇవ్వలేమని మనం అనుకుంటాము. వాస్తవానికి వారు ఎంత ఆశించారన్నది మనం ఊహించుకున్నదే. కనుక మనం ఊహించుకున్నంత సమయం మనం ఇవ్వడానికి సిద్దంగా లేక మనం వారిని చాలాసార్లు hurt చేస్తూ ఉంటాము (అనుకుంటాము). వారు కూడా మనం ఇచ్చిన తక్కువ సమయాన్ని ఎక్కువగా వాడుకుని, నువ్వు మరికొంత సమయం గడిపి ఉంటే బావుండును సుమా! అని చెప్పి వెళ్తారు. ఇలా కొనసాగుతున్న ప్రయాణంలో మరికొంత సమయం గడిపి ఉండాలేమో? బావుంటేదేమో? అనే guilty feeling పెరిగిపోతుంది. పరిచయం పెరుగుతున్న కొలదీ, సరేలే మనమూ మన సమయాన్ని పొడిగిద్దాం, దాని వలన పొందే ఆనందంలో నేనూ ఉన్నాను కదా అనిపిస్తుంది. 

మనం ఎదుటి వారి కోసం పొడిగించి, వెచ్చించడం మొదలు పెట్టిన తరువాత మనకు వెలితి కనిపిస్తుంది. మనం వెచ్చించినంత సమయం ఎదుటివారు వెచ్చించలేరని అర్ధమవుతుంది. మనం ఊహించుకున్నదానికి, వాస్తవానికి మధ్య ఉన్న అంతరాన్ని చూసినప్పుడు ఎదుటి వారు మనల్ని మోసం చేసారని అనిపిస్తుంది. మనల్ని అనవసరంగా ఉగ్గులోకి దించారేమో అనిపిస్తుంది.  అరె... ఇంత నిగ్రహంగా ఉన్న మనం ఇలా ఎలా. . .  అని కొన్ని వేల ఆలోచనలు మన మనసుని కలచివేస్తాయి. మనమీద మనకే నమ్మకం పోతుంది. confidence levels నెమ్మదిగా పడిపోతుంటాయి. అసహనం రాజ్యమేలుతుంది. అప్పటి వరకూ అద్భుతంగా కనిపించిన ఈ సంబంధం విలువలేని వృధా సమయంగా అనిపిస్తుంది. ఈ సమాజాన్ని అర్ధం చేసుకునే సామర్ధ్యం నాకు లేదు అనే ఆత్మనూన్యాతా భావంలోనికి పడిపోతాం. బ్రతుకంతా ఓ పెద్ద అర్ధం కాని ప్రశ్నలా కనిపిస్తుంది. 

అప్పుడే చీకటినుండి వెలుగులోనికి, అజ్ఞ్నానం నుండి జ్ఞ్నానానికి ప్రయాణం ఆరంభమవుతుంది.  మనం అంతరాత్మ మనకు ఒక మాట చెబుతుంది "Limited capacities and wider thoughts cannot travel together". వాస్తవానికి మనం వెచ్చించిన సమయంతో ఎదుటి వారు సంతృప్తి చెందారు. వారు అంతకు మించిన సమయాన్ని మీతో వెచ్చించలేరు. అది వారి limitation. అందుకే వారు మీ సంబంధాన్ని ఇంతకాలం కొనసాగించగలిగారు మరియు దాని విలువను పొందారు. అయితే ఇక్కడ సమస్య అంతా మనకున్న wider thoughts. వారు గడపాలనుకున్న సమయం, వారు గడపాలనుకుంటున్నారని మీరనుకున్న సమయం మధ్య వ్యత్యాసం ఇక్కడి సమస్యకు మూలం. వారు గడపాలనుకుంటున్న సమయం కన్నా, వారు గడపాలనుకుంటున్నారని మీరనుకుంటున్న సమయం ఎక్కువగా ఉంది. మీ wider thoughts వారి limited capacities ని దాటి ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఇవ్వగలిగినంత సమయం వారు ఉపయోగించుకోలేక పోయినందుకు వారిపై జాలి పడడం, మీ సమయం మిగిలినందుకు సంతోషపడడం, మీ స్థానాన్ని నిలబెట్టుకోవడం మిమ్మల్ని మరింత confident స్థాయికి తీసుకెళ్తుంది. ఒక ద్వారం మరో ద్వారానికి దారి చూపించాలి. అలాగే మనం కోరుకున్న వారి సమయాన్ని వృధా చేయకుండా ఎలా వాడుకుంటున్నామో గ్రహించగలిగితే మన చిరునామా ’ఆనందం’ కాదా?. 

No comments: