నేను ఇంటర్మీడియట్ కి వెళ్ళినప్పుడు, మినీ మైగ్రేషన్ లో యానాం నుండి మాదగ్గరకు వచ్చినవాడు వీడు. జుట్టంతా నలుపు, తెలుపుల నిండిపోయి, వాడు చెప్పినట్టు కాకుండా, దానిని నచ్చినట్టుగా వంగే జుట్టు. వాడి సహచరులెవ్వరికీ అర్ధంకాని విషయాలను, తెలియని విషయాలను చెప్పేవాడు. వీడేంటిరా అని వాడితో ఇంతకుముందు చదివిన వారిని అడిగితే ’వాడంతే" అనేవారు. మేము కూడా అలానే అనేసుకున్నాం. అలా అనుకుంటేనే మేము దగ్గరయ్యాం. కలసి పాటలు పాడుకొనేవాళ్ళం. వాడు అప్పట్లోనే ’ఫ్యాబ్లో పికాసా కూబిక్స్లో- మైఖేల్ జాక్సన్ స్టెప్పుల్లో- సమంతాఫాక్స్ నడకల్లో- హే లవ్లో ఫోజుల్లో- అంటూ రాసి, పాడేవాడే వాడు. వీళ్ల పేర్లు కూడా అప్పుడు నాకు తెలియదు. అలాగే నన్ను సురేష్ అని పిలవడం మానేసి, సురాధిప అని పిలిచాడు. నేను చాలాకాలం అర్ధం తెలియకుండానే పలికేసాను. ఆ తరువాతెప్పుడో ఇంతకీ దానర్ధం ఏమిటి అనడిగితే సురేష్=సురాధిప అని వివరించి చెప్పాడు.
మొట్టమెదటి సారి ఇంటర్నెట్లో ప్రపంచం లోకి వచ్చినప్పుడు, సురేష్ అంటే చాలా మంది ఉంటారు అని సురాధిప అని పెట్టేసాను. ఆ పేరుతోనే నేను అందరినోట్లోకి వచ్చేసాను. నాకు ఆ పేరు పెట్టినోడికి నిన్న [14.12.2009] నిన్న పెళ్లయింది. I wish him a very happly life.
అప్పుడు వాడిని మురళిధర్ అనేవాళ్లం, ఇప్పుడు వాడు మాధ్యూస్.
No comments:
Post a Comment