Monday, July 5, 2021

నిజం-అబద్దం





అబద్దానికి పోటీ
నిజానికి నిలకడ
నిక్కమైన లక్షణాలు
ఈ క్షణం దాటిపోతే ఒప్పించలేనని అబద్దం
ఏదో ఒక క్షణం తెలుస్తుందిలే అని నిజం
తమ నడకను కొనసాగిస్తాయి
అబద్దం ఓడినా, నెగ్గినా
తన పరిధిని మరింత పెంచుతుంది
నిజం ఓడితే ఎదురు చూస్తుంది
నెగ్గితే సంతోషిస్తుంది
కానీ అక్కడే అలాగే ఉంటుంది
అబద్దం భయాన్ని పెంచుతుంది
ధైర్యం కోసం మరిన్ని అబద్దాలను పోగేస్తుంది
నిజం ధైర్యాన్ని ఇస్తుంది
ప్రాణ త్యాగానికైనా సిద్దపడుతుంది
సత్యాగ్రాహికి మౌనం ఆయుధమౌతుంది
సమయం సాధనమవుతుంది
అసత్యాగ్రాహికి ఆలస్యమయ్యేకొలదీ
మనస్సు గందరగోళం అవుతుంది
అరిస్తేగానీ మన మాట ఎవ్వరూ వినరని అసత్యం అనుకుంటుంది
అరవడం వలన అసలు విషయం పక్కదారి పడుతుందని సత్యం భావిస్తుంది
అబద్దం అంటే బ్రతుకు మీద అభద్రత
ఎలాగైనా బ్రతికేయ్యాలి అనే ఆశ
నిజం అంటే ఎలాగైనా బ్రతకగలను అనే నమ్మకం
నిజానికి నిజం అంటే ఇష్టం
అబద్ధం ఆంటే అబద్దానికి అసహ్యం
నిజం వెతికితే దొరికేది
అబద్దం తయారు చేస్తే వచ్చేది
 అబద్దం నిలబెడుతూ పడగొడుతుంది
నిజం పడిపోతూ నిలబెడుతుంది

x